What is Chat GPT.. ? details in Telugu
Chat GPT అంటే ఏమిటి..?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial intelligence – AI) సాయంతో పని చేసే అధునాతన చాట్‍బోటే ఈ ‘ChatGPT’. దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ (Chat Generative Pre Trained Transformer). అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్ జీపీటీ పని చేస్తుంది. చాట్ జిపిటి ఒక చాట్ బోట్ అయినప్పటికీ మనం ప్రశ్నలు అడిగినప్పుడు ఒక మనిషి లాగా సరైన సమాధానం ఇస్తుంది. (What is Chat GPT.. ?)
దీనిని అమెరికాకు చెందిన ఓపెన్ AI LP అనే ఫర్ – ప్రాఫిట్ (for-profit) ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంస్థ ద్వారా OpenAI 3.2 వెర్షన్‍ను నవంబర్ 30, 2022 లో లాంచ్ చేయటం జరిగింది. ఈ సంస్థను 2015 లో సామ్ ఆల్ట్మాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, లింక్‍డిన్ వంటి సంస్థలతో కలిసి స్థాపించారు. అయితే 2018 లో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా తప్పుకుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ OpenAI కు ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది.
Chat GPT ఎందుకంత పాపులర్ అయింది..?
కొత్త తరం ChatGPT-3 2022 నవంబర్‌లో అందుబాటులోకి వచ్చింది. లాంచ్ చేసిన 5 రోజుల లోనే ఈ చాట్ బోట్ 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకుంది. సోషల్ మీడియా దిగ్గజాలైన Netflix కు 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి మూడు సంవత్సరాల అయిదు నెలలు పడితే , Twitter కు 24 నెలలు, Facebook కు 10 నెలలు మరియు Spotify కు 5 నెలల సమయం పట్టింది. ఇందుకు ముఖ్య కారణం అడిగిన ప్రశ్నకు ఇది ఒకే సమాధానాన్ని పూర్తి సమాచారంతో ఇస్తుంది. అదే గూగుల్‍లో సెర్చ్ చేస్తే చాలా లింక్స్ కనిపిస్తాయి. దాంట్లో సమాచారాన్ని అంతా క్రోడీకరించుకోవాల్సి వస్తుంది. అదే చాట్ జీపీటీ అయితే ఒకే ఆన్సర్ ఇస్తుంది. అందుకే చాట్ జీపీటీ అత్యంత వేగంగా పాపులర్ అయింది.
మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తున్నారు మధ్యలో ఎర్రర్ రావటం వల్ల దగ్గర ఆగిపోయారు. ఆ కోడ్ ను ChatGPT కి ఇచ్చి ఎర్రర్ ను గుర్తించమని అడిగితే అది దానిని గుర్తించి సరి చేస్తుంది. ఇవే కాకుండా ఒక యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ రాయమంటే కూడా రాస్తుంది. ఉదాహరణకు ఏదైనా టాపిక్ గురించి చెప్పమన్నప్పుడు సింపుల్ వర్డ్స్ లో సమాచారాన్ని ఇస్తుంది. మీరు ఆ విషయాన్ని ఇంకా తెలుసుకోవాలి అన్నప్పుడు tell me more అని టైపు చేస్తే చాలు ఇంకా క్లుప్తంగా సమాచారాన్ని ఇస్తుంది.
Chat GPT ఎలా పనిచేస్తుంది..?
ప్రస్తుతం ChatGPT ని వెబ్‍సైట్ ద్వారా వినియోగించవచ్చు. openai.com/blog/chatgpt వెబ్‍సైట్‍లో రిజిస్టర్ అయి ChatGPT ని వాడవచ్చు. రిజిస్టర్ అయ్యాక ప్రశ్నలను టెక్ట్స్ బాక్స్ లో ఎంటర్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రస్తుతం ఇది ఉచితం. అయితే సబ్‍స్క్రిప్షన్‍తో ChatGPT ప్రొఫెషనల్ వెర్షన్‍ను త్వరలో OpenAI తీసుకురానుంది.
Chat GPT మరియు గూగుల్ కి మధ్య తేడా ఏమిటి ?
సాధారణంగా మనం ఏదైనా విషయాన్ని google ను అడిగినప్పుడు ఆ విషయానికి సంభందం ఉన్న ఆర్టికల్ యొక్క లింక్ లను మనకు ఇస్తుంది. వాటిలో మనకు నచ్చిన లేదా అర్థమయ్యే భాషలో చెప్పిన ఆర్టికల్ ను చదివి విషయానికి సమాధానాన్ని తెలుసుకో గలుగుతాము. అయితే ChatGPT మాత్రం మీరు ఏదైనా అడిగినప్పుడు సందేహానికి సమాధానాన్ని సూటిగా ఒకే సమాధానాన్ని ఇస్తుంది. ఈ ChatGPT మీరు ఇంతకు ముందు ఏ విషయాలపై మాట్లాడారో కూడా గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఎలాగైతే తెలియని విషయాల గురించి ఇతరులను అడుగుతారో అలాగే ChatGPT ను కూడా అడగవచ్చు.
Chat GPT ఆందోళనలు, భయాలు
వాస్తవానికి ChatGPT కేవలం మనుషులకు సహాయం చేయటానికి మరియు రోజు వారి కార్యక్రమాలలో వచ్చే సమస్యలను పరిష్కారం తెలపడానికి మాత్రమే. అయితే విద్యార్థుల విషయంలో ChatGPT పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్ల హోం వర్కును ఈ ChatGPT సులభంగా చేసేస్తోంది. దీనివల్ల విద్యార్థుల ఆలోచన శక్తిని ChatGPT తగ్గించేస్తుందని కొందరి వాదన. పరీక్షల్లో చీట్ చేసేందుకు కూడా ChatGPT దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళనలు ఉన్నాయి. ఈ కారణంగా న్యూయార్క్ లోని స్కూళ్లలో ఈ ChatGPT టూల్ వాడకాన్ని నిషేధించారు.
Read also…