Vinayaka Chavithi Vratha kadha in Telugu
వినాయక చవితి Vinayaka Chavithi
వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. అందుకనే ఎప్పుడూ తొలి పూజ వినాయకుడికే చేస్తారు. (Vinayaka Chavithi Vratha kadha in Telugu)
వినాయక వ్రత కథ (Vinayaka Vratha kadha)
సూత మహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆరోజా చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను ఈ విధంగా వివరించాడు.
ఒకప్పుడు గజ (ఏనుగు) రూపంలో వున్న గజాసురుడు అనే రాక్షస రాజా పరచు శివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరచుశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోనున్నాడు. అప్పుడు గజాసురుడు “స్వామీ. మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే వుండాలి” అని కోరుకున్నాడు. మ హేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకోసం గణాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే వుండటం మొదలు పెట్టాడు.
ఇదిలా వుంటే కైలాసం (శివుడి ఇల్లు)లో వున్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో వున్నాడని తెలుసుకుంది. కానీ, శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి. చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి. తన భర్త విషయం చెప్పింది. “ఓ మహాసుఖాదా. పూర్వం భస్మాసురుని బారినుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు” అని కన్నీళ్ళు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీ దేవిని ఓదార్చి పంపేశాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేదాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు.
శివుడి వాహనం నందిని ఒర గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలచేత తల కొక బాయిద్యం ఇచ్చాడు. తాను చిరు గంటలు. సన్నాయి తీసుకుని గణాసురుడు వుండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది. “మీరు ఏం కాబాలో కోరుకోండి. నేను ఇస్తాను” అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి “ఇది శివుడి వాహనం నంది. శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని అవ్వు” అని కోరాడు.
ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని. తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అపుడు తన పొట్టలోపల వున్న శివుడిని “నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా వుండాలి. నా చర్మం నువ్వు ధరించాలి” అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా. లోపలనుంచి శివుడు బైటకు వచ్చాడు. హరి శివుడితో “వెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఆస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది” అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి రాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు.
వినాయకుడి పుట్టుక
కైలాసంలో వున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు వుంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.
ఇది ఇలా వుండగా, శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో వున్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు.
లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురువచ్చి పూజించి. కూర్చోపెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో వున్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి, తాను తీసుకు వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి ‘గజాననుడు’ అనే పేరు పెట్టి పెంచుకోవటం ప్రారంభించారు.
గజాననుడు కూడా భక్తితో తల్లి తండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా వీరుడు. నెమలి అతని వాహనము.
వినాయక చవితి పూజా సామాగ్రి
పసుపు, కుంకుమ, పూలు, పూలదండలు, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగరబత్తులు, గంధం, అక్షింతలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, బెల్లం, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి, వత్తులు, వినాయకుడి ప్రతిమ, పంచామృతం, పత్రి, ఉండ్రాళ్ళు, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు. వీటితోపాటు పత్రిగా పిలుచుకునే 21 రకాల ఆకులు కూడా ఉండాలి. అవేంటంటే మాచీ పత్రం, బృహతీ పత్రం (ములక), బిల్వపత్రం అంటే మారేడు ఆకు, దూర్వా పత్రం అంటే గరిక, దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు, బదరీ పత్రం అంటే రేగు ఆకులు, అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు, తులసి పత్రం, మామిడి ఆకులు, గన్నేరు ఆకులు, విష్ణుక్రాంత ఆకులు, దానిమ్మ ఆకులు, దేవదారు ఆకులు, మరువం, సింధువార పత్రం అంటే వావిలి పత్రం, సన్నజాజి ఆకులు, లతా దుర్వా అని పిలిచే గండలీ పత్రం, శమీపత్రం, రావి ఆకులు, మద్ది చెట్టు ఆకులు, జిల్లేడు ఆకులు.
వినాయక చవితి రోజు చేయవలసిన పనులు
వినాయక చవితి ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. వాకిళ్ళ ముందు ముగ్గులు వేయాలి. ఆ రోజు అందరూ తలంటు స్నానాలు చేయాలి. దేవుని గదిలో లేదా ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపైన వినాయక విగ్రహాన్ని ఉంచాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాళ్లు, కుడుములు వంటి మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి స్వామివారికి నివేదించాలి.
చవితిరోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే..
ఒకరోజు వినాయకుడు రకరకాల పిండి వంటలు, ఉండ్రాళ్లు తిని మరికొన్ని చేతిలో పట్టుకుని భుక్తాయాసంతో ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులకు నమస్కరిద్దామని వంగడానికి ప్రయత్నించాడు. కానీ పొట్ట బిర్రుగా ఉండటం వల్ల వంగలేక అవస్థలు పడటంతో పొట్ట పగిలి కుడుములు అన్నీ బయటకు వచ్చాయి. శివుడి తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పకా పకా నవ్వాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి చంద్రుడిని శపించింది. ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాపనిందలు పడాల్సి వస్తుందని శపించగా, దేవతలు విషయం తెలిసి వేడుకోగా భాద్రపద చతుర్థి రోజు వినాయకుడిని పూజించి అక్షింతలు ధరించిన తర్వాత చంద్రుణ్ని చూడొచ్చని సెలవిచ్చింది.
మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి ?
జీవ నిర్జీవ రాశులన్నింటికీ ఈ పుడమి తల్లే ఆధారం. మట్టి వినాయకుడిని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం. మట్టిలోంచే సకల ప్రాణులు, సంపదలు వచ్చాయని మనం నమ్ముతున్నాం. అందుకనే ప్రకృతితో మమేకమవుతూ సాగే గణేశుని పూజలో మట్టి వినాయకుడు ఉండటం సహేతుకం. మనకు జీవాన్ని, జీవితాన్ని, మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయకచవితి ద్వారా లభిస్తోంది. వినాయకచవితికి ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమగానీ, పత్రిగానీ ప్రకృతికి ప్రతిరూపాలే. అదేవిధంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది.
వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఈమధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు విష పదార్ధంతో సమానం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేస్తే నీళ్ళు పూర్తిగా కలుషితమైపోతాయి. మట్టి వినాయకుడిని పూజించడం మనకీ మంచిది, పర్యావరణానికీ మంచిది.
వినాయక వ్రత పూజ ఆడియో (mp3) రూపంలో
వినాయక వ్రతకల్పం తెలుగులో
TITLE | LINK | PREPARED BY |
Vinayaka Vrathakalpam / Vratha kadha in Telugu pdf | DOWNLOAD | Eenadu |
Vinayaka Chavithi Vratha kadha in Telugu pdf | DOWNLOAD | Mohan Publications |
Vinayaka Vrathakalpam | DOWNLOAD | Telugu One |
వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు:
వినాయకుడి జీవితం నుంచి మనం ఓ 5 ముఖ్యమైన విషయాలను ప్రేరణగా తీసుకుని వాటిని మనం మన నిత్య జీవితంలో పాటించవచ్చు. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..
- విధి నిర్వహణే ముందు: పార్వతి దేవి స్నానానికి వెళ్తూ ఇంటికి గణేషుడి ని కాపలా ఉంచిన సమయంలో శివుడు వచ్చినప్పుడు లోపలికి వెళ్లకుండా గణేషుడు అడ్డుకుంటాడు. సాక్షాత్తూ శివుడే వచ్చినా, గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణను పూర్తి చేస్తాడు. ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్యసాధనలో, కెరీర్‌లో మనం దూసుకెళ్లవచ్చు.
- తల్లిదండ్రుల కన్నా ఎవరూ ఎక్కువ కాదు: గణేషుడు, కుమారస్వామిలలో ఒకరిని గణాధిపతిగా ఎంపిక చేసే సమయంలో, “ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టి రావడం” బదులు గణేషుడు తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు. నిజంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని ఈ సంఘటన చెబుతుంది.
- తప్పుచేసిన వారిని క్షమించడం : వినాయకుడు ఒకసారి చంద్రుని పై కోపోద్రిక్తుడై ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండా శాపం పెడతాడు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న గణేషుడు చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక్క రోజు కు ఆ శాపాన్ని మారుస్తాడు. అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించమని మనకు వినాయకుడి జీవితం చెబుతుంది.
- చేపట్టిన పనిని వెంటనే పూర్తిచేయడం: వినాయకుడు మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగా మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా రాస్తూనే ఉంటాడు. ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే ఘంటం విరుగిన క్రమలో గణేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేస్తాడు. దీన్ని బట్టి ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి.
- ఆత్మ గౌరవం: ఒకసారి దేవతలందరూ స్వర్గలోకానికి గణేషున్ని కాపలాగా ఉంచి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి వెళ్తారు. అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది. దీంతో దేవతలకు గుణపాఠం చెప్పే క్రమంలో గణేషుని మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది. దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు. అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. అతను వచ్చి గణేషున్ని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. వినాయకుడు ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు. వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. దీంతో వినాయకుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరతారు. అయితే దేవతలు అందరూ తన ఆకారం పట్ల అయిష్టతను ప్రదర్శించినా వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మ గౌరవంతో అలా వ్యవహరించడం.. మనకూ ఆదర్శనీయమే.
Read also..
Sri Krishna Janmashtami