Vijayadashami Dasara festival story details in Telugu pdf

Vijayadashami / Dasara festival story details in Telugu pdf

విజయదశమి / దసరా

       దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు. (Vijayadashami / Dasara festival story details in Telugu pdf)

దసరా ప్రాముఖ్యత ఏమిటి?

       పురాణపరంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో ప్రాధాన్యం ఉన్న పండుగ దసరా. మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించిన రోజు, రావణుణ్ణి శ్రీరాముడు వధించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. జమ్మిచెట్టు మీద దాచిన తమ ఆయుధాలను పాండవులు తీసుకున్న రోజు కూడా విజయదశమేనని మహాభారతం పేర్కొంటోంది. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకొనుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు.  కాబట్టి ధర్మాచరణతో వాటిని తుదముట్టించాలనే అంతరార్థాన్ని విజయదశమి చాటి చెబుతోంది.

విజయ దశమి జరుపుకోవడానికి కారణాలు:

రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని జరుపుకోవడం..!

      విజయ దశమి రాక్షస శక్తులపై దైవిక శక్తి యొక్క విజయాన్ని సూచిస్తుంది. తన భార్య సీతాదేవిని అపహరించిన పది తలల రావణుడిని శ్రీరాముడు సంహరించినది ఇదే రోజు. దీనికి సంబంధించి ఈ రోజును దసరా అని కూడా అంటారు. దసరా అనే పదం రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది – దశ (పది) మరియు హర (ఓటమి). చెడుపై ధర్మం సాధించిన ఈ విజయాన్ని ప్రజలు, రావణుడు, అతని సోదరుడు కుంభకర్ణుడు మరియు కుమారుడు మేఘనాదుల దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా జరుపుకుంటారు.

రాక్షసుడు మహిషాసుర సంహారాన్ని జరుపుకోవడం..!

        మహిషాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు.  అతని నాయకత్వంలో అసురులు దేవతలపై యుద్ధం చేసి వారిని ఓడించారు. దేవతలు మహిషాసురుని సంహరించడానికి దుర్గాదేవిని ఆశ్రయించారు. దుర్గాదేవి, సింహంపై ఎక్కి, తొమ్మిది రోజుల పాటు శక్తివంతమైన రాక్షసునితో పోరాడి పదవ రోజున చంపింది. మహిషాసుర అనే రాక్షసునిపై దుర్గామాత సాధించిన ఈ విజయాన్ని విజయ దశమి గా గుర్తించబడింది.

వివిధ ప్రదేశాలలో దసరా

         దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో ఈ సంబరాలను నిర్వహించినా, ఉత్సాహం, ఉత్తేజం స్థాయి ఒకేలా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబ, ఆలంపురం జోగులాంబ, శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ, వరంగల్‌ భద్రకాళి, వేములవాడ రాజరాజేశ్వరి, ద్రాక్షారామం మాణిక్యాంబ… ఇలా సుప్రసిద్ధమైన అనేక ఆలయాల్లో దేవీ నవరాత్రులు విశేషంగా జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంలో శరన్నవరాత్రుల ప్రారంభానికి ముందురోజు నుంచీ నిర్వహించే బతుకమ్మ పండుగ ప్రకృతికీ, మానవుడికీ మధ్య ఉండే సంబంధాన్ని చాటిచెప్పే గొప్ప వేడుక. ఇక కర్ణాటకలోని మైసూరులో నిర్వహించే దసరా ఉత్సవాలకు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. విజయదశమి రోజున చాముండేశ్వరీ దేవిని ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు. పశ్చిమబెంగాల్‌లో వాడవాడలా దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. కోల్‌కతాలో కాళీమాత ఉత్సవాల్లో భక్తుల ఉత్సాహం ఆకాశాన్ని అంటుతుంది. ఉత్తరాదిన విజయదశమి సందర్భంగా నిర్వహించే రామ్‌లీలా ఉత్సవాలు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణదహనం జరుపుతారు.

జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత..?

       దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. ఏడాదిపాటు అజ్ఞానవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది చెబుతారు.

పాలపిట్ట దర్శనం ఎందుకు ?

       పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ వృక్షంపై ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యాణ‌మ‌వుతారు. అదే స‌మ‌యంలో వారు పాల‌పిట్ట‌ను చూస్తారు. దీంతో వారికి ఆ త‌రువాత అన్నీ శుభాలే క‌లుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌర‌వుల‌పై వారు విజ‌యం సాధిస్తారు. అప్ప‌టి నుంచి ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను చూడ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి.

‘దసరా’ పూజకు సరైన సమయం

        విజయదశమి రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందుకాలాన్ని విజయ ముహూర్తంగా చెబుతారు. ఆ సమయంలో శమీవృక్షా(జమ్మిచెట్టు)న్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని ‘అగ్నిగర్భ’ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని అర్థం. దీనికే ‘శివా’ అనే మరో పేరుంది. అంటే సర్వశుభకరమైనదని. దసరా సాయంత్రం వేళ జమ్మిచెట్టుని కొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు.

Read also..

శ్రీ కృష్ణ జన్మాష్టమి, జన్మాష్టమి అంటే ఏమిటి..?

CLICK HERE

# Vijayadashami Dasara festival story details in Telugu pdf, About dussehra in Telugu, విజయదశమి దసరా ప్రాముఖ్యత ఏమిటి, Dasara festival story

Sharing is caring!

error: Content is protected !!