VIDYADHAN Scholarships Notification-2023

VIDYADHAN Scholarships Notification 2023

ఆర్ధికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు “సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్” ద్వారా కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. నిర్ధిష్ట ఎంపిక ప్రక్రియ విధానం ద్వారా పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఈ ‘విద్యాధాన్ ప్రోగ్రామ్’ ద్వారా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 6,500 మంది విద్యార్థులు లబ్దిపొందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో 2016 విద్యాసంవత్సరం నుంచి విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఎంపికైనా విద్యార్ధులు రెండు సంవత్సరాల పాటు ‘సరోజినీ దామోదర్ ఫౌండేషన్’ నుంచి స్కాలర్షిప్ పొందుతారు. అలాగే విద్యార్ధుల ప్రతిభను ఆధారంగా, వారికి నచ్చిన కోర్సు లో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్ధులు చదువుతున్న కోర్సు, కాలపరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ లభించును.

ANDHRA PRADESH, TELANGANA Intermediate Programme for 2023

స్కాలర్షిప్ వివరాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు 2023 విద్యా సంవత్సరం లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకొనుటకు 10,000/- రూపాయలు అలాగే ఇంటర్ రెండవ సంవత్సరం చదువుకొనుటకు 10,000/- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ లభించును.

ఎవరు అర్హులు ?

విద్యార్ధుల యొక్క కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు మరియు 2022-2023 విద్యాసంవత్సరం లో  10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదువగోరేవారు.

ఎన్ని మార్కులు రావాలి ?  

విద్యార్ధి 10వ తరగతిలో కనీసం 90% లేదా 9 CGPA (దివ్యాంగులు కనీసం 75% లేదా 7.5 CGPA)  మార్కులు సాధించినవారు అర్హులు.

ఎంపిక విధానం :

  • విద్యార్ధి 10వ తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు / మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది.

ముఖ్యమైన తేదీలు :

  • ఆంధ్రప్రదేశ్ – దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 15th June 2023.
  • తెలంగాణ – దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 20th June 2023
  • ఆంధ్రప్రదేశ్ – Online పరీక్ష తేది : 02nd July 2023.
  • తెలంగాణ – Online పరీక్ష తేది : 09th July 2023
  • ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేది, పరీక్ష కేంద్రం వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది.
  • ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు June 20th 2023 నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు . అలాగే తెలంగాణ విద్యార్ధులు July 1st  2023 నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు .

అవసరమైన పత్రాలు:

దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను

  • 10th వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ నుండి పొందినది)
  • Passport size photo
  • 2023లో మండల రెవెన్యూ అధికారి దగ్గర తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • దివ్యంగుడు అయితే దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం

పైన తెలుపబడిన మొదటి మూడు పత్రాలు అప్లోడ్ చేసిన తరువాత మీ అప్లికేషన్ అంగీకరించబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు 15th June 2023 లోపు మీ విద్యాధాన్ ఆన్లైన్ అప్లికేషన్ లో ఇంటర్ కాలేజీ వివరాలు, పెట్టగలరు. లేనియెడల మీ అప్లికేషన్ అంగీకరించబడదు.

సంప్రదించవలసిన వివరాలు:

  • ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు – Email: vidyadhan.andhra@sdfoundationindia.com or sms or whatsapp ద్వారా 8367751309/8985801326. పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.
  • తెలంగాణ విద్యార్ధులు- Email: vidyadhan.telangana@sdfoundationindia.com or sms or whatsapp ద్వారా 6300391827  పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయు విధానం, అధికారిక నోటిఫికేషన్ & అధికారిక వెబ్సైట్ కొరకు క్రింది లింకు లను ఉపయోగించగలరు..   

AP VIDYADHAN Scholarships Notification 2023

DOWNLOAD

Telangana VIDYADHAN Scholarships Notification 2023

DOWNLOAD

Online Application for VIDYADHAN Scholarships

CLICK HERE

Official website for VIDYADHAN Scholarships

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!