Opening of the online portal for submission of Online Application Form for UGC – NET June 2023
The NTA has been entrusted by the University Grants Commission (UGC) with the task of conducting UGCNET, which is a test to determine the eligibility of Indian nationals for ‘Assistant Professor’ and ‘Junior Research Fellowship and Assistant Professor’ in Indian universities and colleges.
The National Testing Agency (NTA) will conduct UGC – NET June 2023 for ‘Junior Research Fellowship’ and eligibility for ‘Assistant Professor’ in 83 subjects in Computer Based Test (CBT) mode.
The schedule of UGC-NET June 2023, are as follows:
Submission of Online Application Form | 10 May 2023 to 31 May 2023 (up to 05:00 P.M) | |
Last date for submission of Examination fee (through Credit
Card/ Debit Card/Net Banking /UPI |
01 June 2023 (up to 11:50 P.M) | |
Correction in the Particulars in Online Application Form | 02 – 03 June 2023 (up to 11:50 P.M) | |
Announcement of City of Exam Centre | First week of the June 2023 | |
Downloading of Admit Card from NTA Website | Second week of the June 2023 | |
Dates of Examination | 13 June 2023 to 22 June 2023 | |
Centre, Date and Shift | As indicated on Admit Card | |
Display of Recorded Responses and Answer Key(s) | To be announced later on the website | |
Website | https://ugcnet.nta.nic.in / www.nta.ac.in | |
Application Fee |
General/ Unreserved | Rs. 1150/- |
General-EWS/OBC-NCL | Rs. 600/- | |
SC/ST/PwD | Rs. 325/- | |
Third Gender |
యూజీసీ నెట్ జూన్ 2023 నోటిఫికేషన్ వివరాలు తెలుగు లో ..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ)- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(యూజీసీ నెట్) జూన్ 2023కి దరఖాస్తులు కోరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయడానికి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నకు నెట్ అర్హత తప్పనిసరి. ఎన్ఎఫ్ఎస్సీ, ఎన్ఎఫ్ఎఓబీసీ, ఎన్ఎఫ్ఎపీడబ్ల్యూడీ ఫెలోషిప్ లకు కూడా నెట్ అర్హతనే ప్రామాణికంగా తీసుకొంటారు. మొత్తం 83 సబ్జెక్టుల్లో ఈ టెస్ట్ ని నిర్వహిస్తున్నారు.
అర్హత: హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ (లాంగ్వేజ్ లు సహా), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర విభాగాల్లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు; ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్ష లకు సన్నద్ధమౌతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) నకు అప్లయ్ చేసుకొనే అభ్యర్థుల వయసు జూన్ 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసి స్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు అప్లయ్ చేసుకొనే అభ్యర్థులకు వయోపరిమితి నిబంధనలు లేవు.
యూజీసీ నెట్ : దీనిని సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. రెంటిలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఇస్తారు. మొదటి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థికి ఉన్న టీచింగ్/ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్ నెస్ అంశాలకు సంబంధించి 50 ప్రశ్నలు అడుగుతారు. రెండో పేపర్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్ధి ఎంచుకొన్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు అడు గుతారు. రెండు పేపర్లలో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు మార్కులు లేవు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తారు.
- దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1150; ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.325
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31
- యూజీసీ నెట్ జూన్ 2023 తేదీలు: జూన్ 13 నుంచి 22 వరకు
- వెబ్సైట్: www.nta.ac.in, wwwwww.ugc.ac.in
UGC – NET June 2023 NOTICE
Official website