తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ పునః ప్రారంభం
తిరుమల, 2023 ఏప్రిల్ 01: కోవిడ్ కారణంగా నడక మార్గంలో మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిన దివ్యదర్శనం టోకెన్ల జారీ టీటీడీ శనివారం ఉదయం నుంచి పునః ప్రారంభించినది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 1250వ మెట్టు చేంత 5 వేల దివ్యదర్శనం టోకెన్లను ఏప్రిల్ 1వ తేదీ నుండి కేటాయిస్తున్నారు. ఇందుకు గాను భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తారు. టీటీడీ కొద్దిరోజులపాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించనుంది.
ఈ దివ్య దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం తిరుమల నడక మార్గం లో వచ్చే అందరికీ ఉచిత దర్శనం కలిగించడమే. తిరుమలకు నడక మార్గం లో చేరుకోవడానికి పాదచారులకు అలిపిరి (9KM పైన). శ్రీవారి మెట్టు (2KM పైన) అనే రెండు మార్గాలు ఉన్నాయన్నది విదితమే. సాధారణ రోజుల్లో, దివ్య దర్శనం కు సుమారు 3-4 గంటలు మరియు రద్దీ రోజులలో 10 గంటల సమయం పడుతుంది.