TSPSC Group-1 Services Recruitment-2024 Notification

TSPSC Group-1 Services Recruitment-2024 Notification

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 పరీక్షల నోటిపికేషన్ జారీ చేసింది. పేపర్‌ లీకేజీలు, నిబంధనల ఉల్లంఘనలు వంటి కారణాల వల్ల గతంలో 508 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ ను రద్దు చేసి దాని స్థానంలో 563 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC Group-1 Services Recruitment-2024 Notification details ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా గతంలో గ్రూప్-1 (4/22 నోటిఫికేషన్)కు దరఖాస్తు చేసుకున్నవారూ పరీక్షలు రాయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నది.

TSPSC Group-1 పోస్టుల వివరాలు

డిప్యూటీ కలెక్టర్లు 45
డీఎస్పి 115
ప్రాంతీయ రవాణా అధికారి 4
జిల్లా పంచాయతీ అధికారి 7
జైళ్లశాఖలో డీఎస్పీ 5
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 8
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు 41
జిల్లా బీసీ అభివృద్ధి అధికారి 5
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి 2
జిల్లా ఉపాధి అధికారి 5
పరిపాలనాధికారి (వైద్యారోగ్యశాఖ) 20
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 41
సీటీవో 48
మండల పరిషత్ అభివృద్ది అధికారి 140
జిల్లా రిజిస్ట్రార్ 6
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3

మెయిన్స్ సిలబస్ మరియు వివరాలు

  • ఈ పరీక్ష వివరణాత్మక(డిస్క్రిప్టివ్) విధానంలో ఉంటుంది
పేపర్ సిలబస్ మార్కులు సమయం
జనరల్ ఇంగ్లిష్   150 మార్కులు 3 గంటలు
పేపర్-1 సమకాలీన అంశాలపై సాధారణ వ్యాసం (జనరల్ ఎస్సే) 150 మార్కులు 3 గంటలు
పేపర్-2 చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం 150 మార్కులు 3 గంటలు
పేపర్-3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పాలన 150 మార్కులు 3 గంటలు
పేపర్-4 ఆర్థికశాస్త్రం, అభివృద్ధి 150 మార్కులు 3 గంటలు
పేపర్-5 సైన్స్, టెక్నాలజీ 150 మార్కులు 3 గంటలు
పేపర్-6 తెలంగాణ ఆలోచన(1948-1970). సమీకరణ దశ  (1971-1990), తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటు వైపు(1991-2014) అంశాలు 150 మార్కులు 3 గంటలు

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు రుసుము రూ.200 కాగా, పరీక్ష రుసుము రూ.120, నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/ప్రభుత్వ రంగ సంస్థల/కార్పొరేషన్ల /ఇతర ప్రభుత్వ రంగాల ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

వయోపరిమితి:

యూనిఫామ్ సర్వీసులైన డీఎస్సీ, ఆసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ( ఏఈఎస్), ఆర్టీవో పోస్టులకు కనిష్ట గరిష్ట వయోపరిమితులు 21 నుంచి 35 ఏళ్లు కాగా.. మిగిలిన పోస్టులకు 18 నుంచి 10 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వరకు, దివ్యాంగులకు పదేళ్లు. మాజీ సైనికులు, ఎస్సీసీ ఇన్స్ట్రక్టర్లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

అర్హతలు:

ఆర్టీవో పోస్టుకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా దాని సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులన్నింటికీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏసీఎల్ పోస్టుల భర్తీలో డిగ్రీతో పాటు సోషల్ వర్క్స్ పీజీ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు
దరఖాస్తుల్లో మార్పు మార్చి 23న ఉదయం 10 గంటల నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు
హాల్ టికెట్లు లభ్యత పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభ సమయానికి గంటల ముందు వరకు
ప్రిలిమినరీ పరీక్షలు మే/జూన్
మెయిన్స్ సెప్టెంబరు / అక్టోబరు

Detailed…

TSPSC Group-1 Services Recruitment-2024 Notification

DOWNLOAD

Official website CLICK HERE

Read also…

Competitive Exams Materials / Notes

CLICK HERE 

Trending Information
error: Content is protected !!