Thunderstorm & Lightning: Do’s and Don’ts

Thunderstorm & Lightning: Do’s and Don’ts

పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

పిడుగు ఎలా ఏర్పడుతుంది .. ?

ఆవిరి రూపంలో ఉన్న నీటితో కూడిన మేఘాలు పరస్పరం ఒకదానితో మరోటి ఢీ కొనడం వల్ల సంభవించేదే పిడుగు. ఇలా రెండు మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొన్న సమయంలో కలిగే ఒత్తిడితో విద్యుత్ తరంగాలు బయటకు ఉత్పత్తి అవుతాయి. ఈ విద్యుత్ తరంగాల శక్తి లక్షల ఓల్టుల్లో ఉంటుంది. ఆ సమయంలో వచ్చే శబ్దం లక్షల డెసిబుల్స్లో ఉంటుంది. ఒక మిల్లీ సెకన్ కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 అంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని వెలువరుస్తుంది. అప్పుడు ఏర్పడే క్షేత్ర తీవ్రత మీటరు 2 లక్షల వోల్టులతో సమానం. ఇది ఒక లక్ష కిలో మీటర్ల పొడువుంటుంది. రెండు మేఘాల మధ్య అయితే తక్కువలో తక్కువ 7 నుంచి 140 కిలో మీటర్ల దూరం ఉంటాయి.

మెరుపులు (పిడుగు) భూమి మీదికి పడినప్పుడు వస్తువులను బట్టి తీవ్రత ఉంటుంది. మేఘాలు డీ కొన్నప్పుడు జనించే విద్యుత్, ధ్వని తరంగాలు భూమిపైకి చేరేందుకు వీలుగా సన్నటి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం గుండా ధ్వని, విద్యుత్ తరంగాలు భూమిని చేరుతాయి. ఈ సమయంలో అవి ప్రవహించే మార్గంలో 50 వేల డిగ్రీల వేడి నమోదవుతుందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

అలా భూ ఉపరితలం మీద నుంచి అవి భూమిలోకి వెళ్తాయి. ఇలా వెళ్లాలంటే వాటికి మరో సాధనం కావాలి. అవి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ఆలయాల్లోని ధ్వజస్తంభాలు వంటి వాటి ద్వారా ఈ విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్లిపోతాయి. ఒక్కోసారి మైదాన ప్రాంతాల్లో కూడా విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న మనుషులు, జంతువులు వాటికి సాధనంగా మారతారు.

మనకు కనిపించే మేఘంలో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం ఫాజిటివ్ చార్జ్ తో ఉంటే కింద ఉన్న భాగంలో నెగెటివ్ చార్జ్ ఉంటుంది. ఇలా ప్రతి మేఘం పాజిటివ్ నెగటివ్ ఎనర్జీతో నిర్మితమవుతుంది. ఇలా నెగెటివ్ ఎనర్జీ భూమిమీద పాజిటివ్ ఎనర్జీతో భూమి మీద కలిస్తే పిడుగ్గా మారుతుంది. పిడుగులు అత్యధిక వేగంతో భూమిపై పడుతుంటాయి. పిడుగు నేరుగా మనిషిపై కానీ జంతువులపై కానీ పడిందంటే మాడి మసైపోయినట్లే. వర్షాలు వచ్చిన ప్రతి సారి పిడుగులు పడతాయన్న గ్యారెంటీ లేదు.

భూప్రపంచంలో ప్రతి చోట పిడుగులు పడతాయన్న దాఖలాలు లేవు. వాతావరణ మార్పులు, క్యూములోనింబస్ మేఘాలు ఇతరత్రా పరిస్థితుల వల్లే పిడుగులు పడతాయన్నది వాస్తవం. అప్పుడే మరణాలు సంభవిస్తాయి. మెరుపు కనిపించిన క్షణంలోనే అప్రమత్తమైతే కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంటుంది.

ఉరుములు & మెరుపులు: చేయవలసినవి మరియు చేయకూడనివి

  • పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు కాపర్ ఎర్త్ (రాగి తీగ) ను ఏర్పాటు చేసుకోవాలి . కాపర్ తీగను ఏర్పాటు చేసుకునే సమయంలో ఉప్పుతో పాటు, బోగ్గు కలిపి అందులో వేయాలి. శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం రూపంలో కిందికి వచ్చినప్పుడు కాపర్ (రాగి) తీగ ఆపే అవకాశం ఉంది. టవర్లు, సినిమా హాళ్ల వద్ద ఇలాంటివి ఏర్పాటు చేస్తారు.
  • టాప్ క్లోస్ చేసి ఉన్న వాహనాల మీద పిడుగు పడడం తక్కువ..ఎందుకంటే, కప్పు మూసివేసిన వాహనాల్లో కూర్చుంటే, వాటి పెద్ద ఉపరితలం విద్యుత్ను అన్నిదిక్కులకు పంపించి తర్వాత భూమిని చేరుతుంది.
  • పిడుగులు పడే అవకాశం ఉందని అనిపిస్తే ఇంట్లోని కిటికీలన్నీ మూసివేయాలి. పెద్దపెద్ద భవనాలపై, పరిశ్రమలు అంతస్తులపై రాగి కడ్డీలను ఏర్పాటు చేసుకోవాలి.
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే చెట్ల కింద ఉండకూడదు.
  • ఇలాంటి సమయంలో రైతులు పొలాల వద్ద నుంచి ఇంటికి చేరుకోవాలి. లక్షల సెంటిగ్రేడ్లలో ఉష్ణోగ్రత విడుదలయ్యే వేడి ఒక్కసారి చేరి మనిషిపై పడడంతో గుండెపై ప్రభావం చూపిస్తుంది.
  • ఎత్తైన ప్రదేశాల్లో ఉండకూడదు.
  • ఎడ్లబండి, ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ వంటి వాహనాలు నడపకూడదు.
  • అధిక నీరు ఉన్న చోటగాని, లేదంటే నీళ్లలో ఈత కొట్టడం కాని చేయకూడదు.
  • టెలిఫోన్లో కూడా మాట్లాడకూదడు.
  • మెరుపులతో చుట్టుపక్కల విద్యుత్ తీగలు కాలిపోయే ప్రమాదం ఉంది. కావున సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ తీగలను, కేబుల్ తీగలను తొలగించడం మంచిది.
  • వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. ఎర్తింగ్తో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • సెల్ఫోన్లు, కెమెరాలు దూరం ఉంచాలి.
  • అటవీ ప్రాంతాల్లో ఉండకూడదు.
  • గొడుగుపై ఉండే బోల్టులతో రేడియేషన్ వచ్చే ప్రమాదం ఉంది. కాపర్ ఎర్త్ ఏర్పాటు చేసుకోవాలి
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే సమయంలో మైదాన ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలి.
  • మైదాన ప్రాంతాల్లో ఉన్న వారు మెరుపులు కనిపించిన సమయంలో నేలపై మోకాళ్ల మీద కూర్చుని తల కిందికి వంచి ఉంచాలి. దీంతో పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చు.
  • ఎత్తయిన చెట్ల కింద, శిథిల భవనాల కింద నిల్చోవడం చేయకూడదు.
  • మెరుపులు కనిపించే సమయంలో వ్యవసాయ పనుల్లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చోట గుంపుగా ఉండకూడదు. ఒక్కొక్కరుగా ఉండటం శ్రేయస్కరం. కచ్చితంగా మోకాళ్లపైనే తల కిందకు వాల్చి కూర్చోవాలి.
  • గొడుగులు వాడకూడదు. చేతిలో పలుగు, పార వంటి వస్తువులు ఉంచుకోకూడదు.
  • ఇళ్లపై పిడుగు పడే అవకాశం అరుదు కనుక వీలైనంత త్వరగా నివాసాలకు చేరుకుంటే మంచిది.
  • మెరుపులు, ఉరుముల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు వినియోగించకూడదు.
  •  పిడుగు పాటుకు గురైన వాళ్లు ప్రాణాపాయం నుండి బయటపడటం అరుదు. ఒక్కోసారి అదష్ట వశాత్తు బయటపడితే వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలి.

చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక మే-2023 వారి సౌజన్యం తో ..

Trending Information
error: Content is protected !!