Telugu Language Day

Telugu Language Day

తెలుగు భాషా దినోత్సవం

భారతదేశంలో తెలుగు భాషా దినోత్సవం భారతదేశంలోని ఆరు సాంప్రదాయ భాషలలో తెలుగు ఒకటి. ఇది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా మరియు యానాం కేంద్రపాలిత రాష్ట్రాలలో మాట్లాడబడుతుంది. భారతదేశంలో వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని (ఆగస్ట్ 29న) తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. బ్రిటీష్ పాలనలో ప్రముఖ తెలుగు రచయిత, తొలితరం భాషావేత్తలు మరియు సామాజిక దార్శనికులలో ఒకరు గిడుగు వెంకట రామమూర్తి గారు. (Telugu Language Day)

పాఠశాలల్లో బోధించే వ్రాత తెలుగు కంటే మాట్లాడే తెలుగు భిన్నంగా ఉండేది. లిఖిత తెలుగు నేర్చుకోవడం వల్ల దైనందిన జీవితంలో అర్థం చేసుకోవడానికి లేదా సమర్థవంతమైన సంభాషణకు అవసరమైన నైపుణ్యాలు లభించవు. రామమూర్తి చేసిన ప్రయత్నాల వల్ల మాట్లాడే తెలుగు ప్రామాణికమై పండితులచే ఆమోదించబడింది. రామమూర్తి గారు పండిత భాష వాడకాన్ని వ్యతిరేకించాడు.

ఈ రోజుల్లో ఆధునిక తెలుగు బోధన, పరీక్ష మరియు థీసిస్ రాయడానికి కూడా మాధ్యమంగా ఉంది. అయితే ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది.

గిడుగు వెంకట రామమూర్తి గురించి క్లుప్తం గా

ఆంధ్రదేశంలో వ్యవహారిక భాష ఉద్యమానికి మూల పురుషుడు గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగ స్టు 29న శ్రీకాకుళం ప్రాంతం పర్వ తాలపేట గ్రామంలో జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకొచ్చి భాష అందాన్ని తెలియజేసిన మహనీయుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది. కైజర్ ఎ హింద్, రావు సాహెబ్ బిరుదులు పొందారు. కళాప్రపూర్ణ పురస్కార గ్రహీత. ఆయన జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఆచరిస్తున్నారు. ఆయన 1940 జనవరి 22న కన్నుమూశారు.

తెలుగు భాష గొప్పతనం తెలిపే పాటలు 

తెలుగు జాతి మనది..


తేనేకన్నా తీయనిది..


తెలుగు భాష తీయదనం..


పాడనా తెలుగు పాట..


తల్లి పాల భాష..


అజరామరమైనది తల్లి భాష..

Video songs

Read also..

Gidugu Ramamurthy Biography in Telugu

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!