TS EAMCET-2023 Result released

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం మాసబ్ ట్యాంక్ లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు.

పరీక్షరాసినవారిలో ఇంజినీరింగ్ లో 80 శాతం, అగ్రికల్చర్లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం లో అనిరుధ్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ దక్కినది. జూన్ లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఉండే అవకాశం ఉంది. స్థానిక విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర కోటా కింద 85% రిజర్వ్ చేయగా, 15% సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. అలాగే ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అగ్రికల్చర్ మెడిసిన్ (AM) ఫార్మా కేటగిరీ టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం గమనార్హం.

ఫలితాలను https://eamcet.tsche.ac.in , https://pratibha.eenadu.net, https://results.sakshieducation.com తదితర వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

TS EAMCET 2023 Results (Official website)

CLICK HERE

TS EAMCET Engineering 2023 Results (Eenadu website)

CLICK HERE

TS EAMCET Agriculture & Medical 2023 Results (Eenadu website)

CLICK HERE

Trending Information
error: Content is protected !!