Teachers unions with Minister meeting highlights

Highlights of meeting of teachers unions with Education Minister on 5 May 2023 on various issues

తేది: 05.05.2023 న వివిధ సమస్యలపై విద్యాశాఖ మంత్రి తో ఉపాధ్యాయ సంఘాల భేటిలోని ముఖ్య విషయాలు

తేది: 05.05.2023 పాఠశాల విద్యాశాఖ మంత్రి వివిధ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ డైరక్టర్ కె.సురేష్ కుమార్, అడిషనల్ డైరక్టర్ పి.పార్వతి, జాయింట్ డైరక్టర్ ఎం.రామలింగం, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ తో బాటు 32 రికగ్నైజుడు, రిజిష్టర్డు సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.

(1) ప్రమోషన్లు :

  • 292 ప్లస్ టు హైస్కూల్సులో ఇంటర్మీడియట్ విద్య బోధించడానికి 1752మందికి ప్రమోషన్లు ఇస్తారు. – పిజిటి క్యాడర్ ప్రస్తుత సర్వీస్ రూల్సులో లేదు. పోస్టులు కేటాయింపు జరిగినా, వాస్తవంగా వాటి అప్గ్రేడేషన్ జరుగలేదు. కనుక ఈ ప్రమోషన్లు ఒక ఇంక్రిమెంట్ బెనిఫట్ అడ్ హాక్ పద్ధతిని ఇస్తారు.
  • ఈ ప్రమోషన్లకు విద్యార్హతలతోబాటు సీనియార్టీని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ప్రమోషన్ పొందగోరే వారికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది.
  • సబ్జెక్టు వారీగా తెలుగు -253, ఇంగ్లీషు 253, గణితం – 196, ఫిజిక్స్ – 241, కెమిస్ట్రీ – 241, బోటనీ 188, జువాలజీ – 188, కామర్స్ -62, ఎకనామిక్స్-62, సివిక్స్ -62మందికి ప్రమోషన్లు లభిస్తాయి. జిల్లాల వారీగా శ్రీకాకుళం -42, విజయనగరం-6, విశాఖపట్నం-71, తూర్పుగోదావరి-335, పశ్చిమగోదావరి-268, కృష్ణా – 260, గుంటూరు-174, ప్రకాశం-95, నెల్లూరు – 148, చిత్తూరు -236, కడప- 92, కర్నూలు, అనంతపురం-13మందికి ప్రమోషన్లు ఇస్తారు.

(2) స్కూలు అసిస్టెంటు, హెచ్ఎం, ఎంఇఓ ప్రమోషన్లు:

  • క్రొత్తగా సృష్టించిన 678 ఎంఇఓ పోస్టులు, ఖాళీగా యున్న పోస్టులతో కలిపి 1004 మందికి ఎంఇఓలుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా విల్లింగ్ ఇచ్చిన హైస్కూలు హెడ్మాష్టర్లను ఎంఇఓలుగా ట్రాన్సఫర్ చేస్తారు. మిగిలిన ఖాళీలకు స్కూలు అసిస్టెంట్ల నుండి ప్రమోషన్ ఇస్తారు. అంటే గత సంవత్సరం ఇచ్చిన 5082 పోస్టులకు అదనంగా మరో 1000మందికి ప్రమోషన్లు ఇస్తారు. – ఖాళీ అయిన హెచ్ఎం, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్లు ఇస్తారు. దీనికి గతంలో అనుసరించిన విధంగానే ముందస్తు ఆప్షన్ తీసుకుంటారు.
  • గతంలో రిలింక్విష్ చేసి 1 సం॥ పూర్తి అయిన వారికి, గత సం॥ 70%, 30% ప్రమోషన్ల సందర్భంగా ఛాన్సు వదులుకున్న వారికి మరో అవకాశం కల్పిస్తారు.
  • ప్రమోషను ఆప్షను ఇచ్చిన వారిని, బదిలీలలో చివరన చేర్చి ప్లేసు కేటాయింపు చేస్తారు.

(3) బదిలీలు:

  • వేసవి సెలవులలోనే ఉపాధ్యాయుల బదిలీలు చేపడతారు.
  • బదిలీల చట్టం రూపొందిస్తే అసెంబ్లీ ఆమోదానికి సమయం పడుతుంది కాబట్టి, ముందుగా గత బదిలీ ఉత్తర్వులలో మార్పులు చేసి ఈ సం॥ బదిలీలు నిర్వహిస్తారు. తర్వాత బదిలీ చట్టం రూపొందిస్తారు. – బదిలీలకు గరిష్టంగా 5 సం॥లు చాలు అని 1,2 సంఘాలు వాదించినప్పటికీ, మెజార్టీ సంఘాలు 8 సం॥లు ఉండాలని కోరాయి. కాబట్టి బదిలీలకు గరిష్ట పరిమితికి 8 సం॥ ఉంటుంది.
  • వర్క్అడ్జస్ట్మెంట్, 117 జిఓ అమలు లేదా మరే కారణం చేతనైనా ఉపాధ్యాయుడు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుండి పోస్టు షిప్టు అయితే అట్టి వారికి పూర్వం పనిచేసిన పాఠశాల స్టేషన్ పాయింట్లు ఇస్తారు. – 187 జిఓలో చేయవలసిన మార్పులు చెప్పడానికి ఉపాధ్యాయ సంఘాలకు 5 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఆలోగా సంఘాలు తమ అభిప్రాయాలు తెలియజేయవలసి వుంటుంది.
  • ప్రభుత్వ, పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను ఎవరి మేనేజిమెంట్లకు వారిని బదిలీ చేయాలని ప్రభుత్వ ఉ పాధ్యాయులు కోరారు. అయితే ఉన్న ఖాళీలను బట్టి మాత్రమే స్వంత మేనేజిమెంట్కు వెళ్లడానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు.

(4) సబ్జెక్టు కన్వర్షన్ :

  • రాష్ట్రంలో ఎల్ఎఫ్ఎల్ హెడ్మాష్టర్లు సుమారుగా 4,000మంది పనిచేస్తుండగా వారిలో 370మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కన్వర్షన్ ఇచ్చారు. భవిష్యత్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు ఉండే అవకాశం లేదు. కాబట్టి మరోసారి స్కూలు అసిస్టెంట్ పోస్టులకు కన్వర్షన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తారు. అయితే, స్కూలు అసిస్టెంటుగా కన్వర్షన్ పొందిన వారికి మరల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా వెళ్లేందుకు అవకాశం లేదు. – ఒక సబ్జెక్టు నుండి మరొక సబ్జెక్టుకు కన్వర్షన్ పొందిన స్కూలు అసిస్టెంట్లకు మాత్రం వెనుకకు వెళ్లేందుకు ఒక అవకాశం ఇస్తారు. మరియు క్రొత్తగా కన్వర్షన్ కోరుకునే వారిని కూడా అనుమతిస్తారు.

(5) మున్సిపల్ సర్వీస్ రూల్సు :

  • మున్సిపల్ సర్వీసు రూల్సు డ్రాఫ్టుపై 7 సంఘాలు 21 ప్రతిపాదనలు ఇచ్చాయి. 21 అంశాలలో మెజార్టీ యుటియఫ్ ప్రాతిపాదించినవే ఉండడం గమనార్హం.

 (6) యాప్లు:

ఉపాధ్యాయులు యాప్లలో సమాచారం అప్లోడ్ చేయడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగింది. ఉపాధ్యాయులపై భారం బాగా తగ్గించే విధంగా యాప్లను రీ-డిజైన్ చేసారు.

  • స్కూలు అటెండెన్స్ యాప్ : దీనిలో 4 అంశాలు ఉంటాయి. (1) టీచర్స్ అటెండెన్సు (2) స్టూడెంట్ అటెండెన్సు (3) మధ్యాహ్న భోజన పథకం (ఎండిఎం) (4) బైజూస్ – టీచర్స్ అటెండెన్సు ఫేషియల్ యాప్ యధావిధిగా నమోదు చేస్తారు. దీనికి లీవు మేనేజ్మెంట్ జత చేయబడుతుంది. స్టూడెంట్ అటెండెన్సులో హాజరు కాని విద్యార్థులకు ఎదురుగా టిక్ చేస్తే చాలు. ఎండిఎంకు సంబంధించి ఎండిఎం తీసుకునే విద్యార్ధుల సంఖ్య, చిక్కీలు, రాగిజావ ఎందరు తీసుకుంటున్నారు నంబరు నమోదు చేస్తే చాలు. త్వరలో ప్రతీ స్కూల్కు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇస్తారు. అప్పటివరకు మాత్రమే బైజూస్ వివరాలు ఉపాధ్యాయులు నమోదు చేయాలి. తర్వాత బైజూస్ యాప్లో నమోదు టీచర్లు చేయనక్కర్లేకుండా ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది.
  • ఐఎంఎంఎస్ యాప్: అటెండెన్సు యాప్లో నమోదు చేసిన ఎండిఎం వివరాలు ఆటోమేటిక్ డిస్ప్లే అవుతాయి. ఇండెంటు, స్టాకు వివరాలు మాత్రమే టీచర్లు నమోదు చేయాలి. టాయిలెట్లు శుభ్రతకు సంబంధించి అన్ని టాయిలెట్ల ఫోటోలు పెట్టనవసరం లేదు. 10% పెడితే చాలు. ఎండిఎంకు సంబంధించిన వివరాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి (వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్) అప్లోడ్ చేస్తారు. (3) జెవికె యాప్ : జెవికె యాప్ 2 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కిట్ మొత్తం ఒకేసారి ఇస్తారు కాబట్టి వివరాలు ఒకసారి నమోదు చేసి తల్లి బయోమెట్రిక్ వేయిస్తే సరిపోతుంది. అయితే బ్యాగ్స్, షూస్ క్వాలిటీ గుడ్ / బ్యాడ్ నమోదు చేయాలి. అవి చిరిగిపోతే రీప్లేస్ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.
  • నాడు – నేడు యాప్ : రాష్ట్రంలో 22000 స్కూల్సులో నాడు-నేడు సెకండ్ ఫేజ్ జరుగుతోంది. 122 స్కూలు మినహా మిగిలిన స్కూల్సులో సమస్యలు లేవు అని చెప్పారు. రాబోయే 2,3 నెలల్లో నిర్మాణాలు పూర్తి అవుతాయి కాబట్టి అంతవరకు యాప్లో వివరాలు నమోదు చేయాలి. రశీదులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి.
  • అకడమిక్ మానిటరింగ్ యాప్: ప్రస్తుతం ఉపయోగంలో లేదు అంటున్నారు. – సోషల్ ఆడిట్, టీచ్ టూల్ యాప్లలో టీచర్లు నమోదు చేయనక్కర్లేదు
  • ఈ-హజార్, అభ్యాస్ యాప్స్ ప్రస్తుతం వినియోగంలో లేవు.
  • స్కూల్సు పరిశుభ్రతపై టికెట్స్ ఇకపై ఉదయం 8.30-9.30 మధ్య, సాయంత్రం 3.00-4.00 మధ్య మాత్రమే రైజ్ అవుతాయి.
  • ఆఫ్లైన్లో నమోదు చేస్తే సిగ్నల్ వచ్చాక ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయి.
  • ఉపాధ్యాయులు చేతి డబ్బు చెల్లించి కరెంటు బిల్సు పే చేయనవసరం లేదు. ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు అకౌంట్లో వేస్తే అప్పుడు వాటి నుండి బిల్సు పే చేస్తే సరిపోతుంది. ఏ పాఠశాల కనెక్షన్ తొలగించినా వెంటనే అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తే పునరుద్ధరింప చేస్తారు.

(7) టీచర్స్ ట్రైనింగ్ :

  • గత 6 ఏళ్లలో క్రొత్తగా ఉద్యోగంలో చేరిన 22,000 ఉపాధ్యాయులకు డైట్లలో శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్
  • వేసవి సెలవుల్లోనే వుంటుంది.
  • డిజిటల్ ఎడ్యుకేషన్పైన మొత్తం టీచర్లు అందరికీ శిక్షణ ఇస్తారు.

(8) జెవికె కిట్స్ :

  • కిట్ లో వస్తువులు అన్ని ఒకేసారి ఇస్తారు. కిట్స్ అన్నీ స్కూలు పాయింట్కే వస్తాయి. ఎవరూ ఎంఇఓ ఆఫీస్ నుండి తెచ్చుకోనవసరం లేదు. స్కూల్ పాయింట్కి కిట్స్ చేరిన తర్వాత క్వాలిటీ బాగున్న వాటినే హెచ్ఎం తీసుకోవాలి. లేనివాటిని తిరస్కరించవచ్చు. కిట్స్ వచ్చిన తర్వాత వాటి క్వాలిటీ యాప్లో నమోదు చేయాలి. – బ్యాగులు, బూట్లు చిరిగిపోతే రీప్లేస్ చేస్తారు.

(9) ఉయ్ లవ్ రీడింగ్ :

  • బడికి వెళ్లనవసరం లేదు. పిల్లలకు వాట్సాప్ చేస్తే చాలు
  • బుక్స్ స్కూలు నుండే తీసుకోనవసరం లేదు. గ్రామానికి చెందిన లైబ్రరీ నుండి కూడా తీసుకోవచ్చు.
  • పోస్టాఫీసు, రైల్వే స్టేషన్, రైతు భరోసా కేంద్రాలు, పాల కేంద్రాలు వంటివి సందర్శించి పరిశీలించమని విద్యార్ధులకు అసైన్మెంట్ ఇవ్వాలి.
  • వారు పరిశీలించిన అంశాలపై స్కూలు ప్రారంభించిన వెంటనే చిన్న చిన్న కాంపిటీషన్లు పెట్టి వారిని ప్రోత్సహించాలి.
Trending Information
error: Content is protected !!