Talliki vandanam scheme details
తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు చొప్పున విద్యార్థుల తల్లులకు అందజేయనున్నారు. ఈ మేరకు అర్హులైన విద్యార్థి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వ కార్య దర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. (Talliki vandanam scheme details)
అలాగే స్టూడెంట్ కిట్ కింద టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫాం, కుట్టు చార్జీలు, షూ, బెల్టు, స్కూల్ బ్యాగు, డిక్షనరీ ప్రతి విద్యార్థి కి అందించాలని ఆదేశించారు. తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిచారు.
తల్లికి వందనం పథకం సమాచారం :
- పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.
- ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్ 2nd ఇయర్ ) వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.
- BPL (Below Poverty Line) కుటుంబాలకు చెందిన వారై ఉండాలి . దీనికిగాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.
- విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75% మించి ఉండవలెను.
- ఆధార కార్డు ధ్రువీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధ్రువీకరణ ఉంటుంది కావున తల్లులకు / సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.
- పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించి ఆధార ధ్రువీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది.
Below poverty line (BPL) కుటుంబాలంటే ఎవరు?
- కుటుంబ సభ్యుల ఆదాయం అంటే తల్లి తండ్రి ల ఎవరిదైనా లేక ఇద్దరి దైనా ఈ క్రింది విధంగా ఉంటే వారిని BPL Families అంటారు
- రూరల్ లో నెలకు 10,000/-, అర్బన్ లో నెలకు రు 12,000/- కంటే తక్కువ కుటుంబ ఆదాయం
- మాగాణి అయితే 3 ఎకరాలు మెట్ట అయితే 10 ఎకరాలు రెండూ కలిపి అయితే 10 ఎకరాల కంటే తక్కువ పంట భూమి ఉన్న కుటుంబాలు
- నెలకు 300 యూనిట్స్ కంటే తక్కువ కరంటు వాడే వారు
- ప్రభుత్వ ఉద్యోగము/ ప్రభుత్వ పెన్షనరు లేని కుటుంబము ( ప్రభుత్వ తీసుకొంటున్న శానిటరీ వర్కర్స్ కుమినహాయింపు)
- టాక్సీ, ట్రాక్టరు, ఆటో వంటి మినహా 4 చక్రాల వాహనాలు కల కుటుంబాలు అర్హులు కారు
- Income tax చెల్లించే వారు అర్హులు కారు
- పట్టణాలలో 1000 sq feet కంటే ఎక్కువ మున్సిపల్ స్ధలము ఉన్న కుటుంబాలు కూడా అర్హులు కారు
GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT
School Education Applying for Sub AUA (Authentication user Agency) under Regulation 15 of Aadhaar (Authentication) Regulation, 2016 Notification under section 7 of the Aadhaar (Targetted Delivery of Financial and other subsidies, benefits and service) Act, 2016(Act No.18 of 2016) for the schemes of “Talliki Vandanam” “Student kits” etc. – Orders – Issued.
SCHOOL EDUCATION (GENERAL) DEPARTMENT
G.O.Ms.No. 29
Dated:09.07.2024
Detailed GO DOWNLOAD