Swarnandhra-2047 Guidelines day wise schedule survey link

Swarnandhra-2047 Guidelines day wise schedule survey link

స్వర్ణాంధ్ర@2047 నేపథ్యం మరియు ప్రకరణం

2047వ సంవత్సరంలో భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటోంది. ఆ సమయానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, జనసాంద్రతలో మార్పులు మరియు వాతావరణంలో మార్పులు అనేవి ప్రపంచ స్థూల ఆర్థిక మరియు సామాజిక చిత్రపటంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. (Swarnandhra-2047 Guidelines day wise schedule survey link)

భారతదేశం సమగ్రాభివృద్ధి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. 2047 నాటికి వికసిత్ భారత్@2047 కింద ప్రపంచ మూడు అగ్రగామి ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదగాలని కోరుకుంటోంది.

స్వర్ణాంధ్ర@2047 కోసం ఆంధ్రప్రదేశ్ విజన్

ఇది మంచి ప్రభుత్వం – ఇది ప్రజల ప్రభుత్వం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో మనమందరం తప్పనిసరిగా భాగస్వాములవ్వాల్సిందే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 2047 విజన్ అభివృద్ధి కొరకు సమగ్ర కసరత్తు చేపట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ఒక కీలకపాత్ర పోషించడానికి ఆంధ్రప్రదేశ్ కంకణబద్ధమై ఉంది. రాష్ట్రానికున్న ప్రధాన బలాలు ఏమిటంటే: రాష్ట్రానికి ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం, అపారమైన సహజ వనరులు, పుష్కలమైన మానవ వనరులు, సుస్సంపన్నమైన సంస్కృతి మరియు కళలు, చివరి మైలు వరకు అభివృద్ధి ఫలాలు అందించగల వ్యవస్థ కలిగి ఉండటం.

స్వర్ణాంధ్ర@2047 దార్శనిక పత్రం అనేది ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి, వాతావరణ సుస్థిరతలపైన దృష్టి సారిస్తూ 2047 నాటికి భారతదేశానికి ఒక పెద్ద వృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపాంతరం చెందించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తుంది. 1వ తేదీ నవంబరు 2024న ఈ విజన్@2047 పత్రాన్ని ఆవిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమ్యాలు భారతదేశ అభివృద్ధి ప్రాధమ్యాలతో అనుసంధానించుకుంటూ:

  1. పేదరికరహిత రాష్ట్రం, సామాజిక సమగ్రాభివృధ్ధి మరియు వాతావరణ సమతుల్యత సాధించడం
  2. పటుత్వమైన, ఆరోగ్యకరమైన, నైపుణ్యయుతమైన మరియు విశ్వవ్యాప్తంగా ఉద్యోగం చేయగలిన పౌరులతో ముందుకు సాగిపోయేలా జనాభా నిర్వహణ:
  3. ఆర్థికరంగం 15% వార్షికాభివృద్ధితో తలసరి జీడీపీ 43,000 డాలర్లకు మించుతుందనే అంచనాలతో 2047 నాటికల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల కనీస జీఎస్ డీపీ సాధించడం.
  4. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్తు వాహనాలు, బయోటెక్నాలజీ, అత్యాధునిక తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యవసాయం, పర్యాటకం మరియు వాతావరణ రంగాలపైన ధ్యాస పెట్టడం.

వ్యూహాత్మక దృష్టి సారించాల్సిన రంగాలు

2047 విజన్ సాకారమవ్వాలంటే, వ్యూహాత్మక దృష్టి సారించాల్సిన కొన్ని రంగాలను ఇక్కడ గుర్తించడమైనది.

  • విద్య మరియు నైపుణ్యం
  • ఆరోగ్యం మరియు సామాజిక సంక్షేమం
  • మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ
  • సుస్థిరత మరియు వాతావరణ సమతుల్యత
  • ఆర్ధికాభివృద్ధి
  • అత్యాధునిక తయారీరంగం మరియు లాజిస్టిక్స్
  • నాలెడ్జ్ ఎకానమీ
  • పునరుత్పాదక ఇంధనం మరియు గ్రీన్ ఇన్నోవేషన్
  • వ్యవసాయం, ఆహార శుద్ధి, మరియు ప్రకృతి వ్యవసాయం
  • పర్యాటకం మరియు సంప్రదాయ వైద్యం

స్వర్ణ ఆంధ్ర@2047 పథకంలో భాగంగా పాఠశాలలలో చేయవలసిన పనులు

స్వర్ణ ఆంధ్ర@2047 పథకంలో భాగంగా అన్ని యాజమాన్యాలలోని పాఠశాలలలోని ఆరు నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు “స్వర్ణ ఆంధ్ర సాధించుటకు రాబోవు ఐదు సంవత్సరాలలో విద్యారంగంలో తీసుకురావలసిన సంస్కరణలు” అనే అంశం పై దిగువ పేర్కొన్న తేదీలలో వివిధ స్థాయిలలో వ్యాస రచన, వక్త్రత్వం, డిబేటింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది.

  • తేదీ: 24.09.24  & తేదీ: 25.09.24 MEOs, HMs లకు ఓరియంటేషన్ తరగతులు
  • తేదీ: 27.09.24 ఉదయం -పాఠశాల స్థాయి, మధ్యాహ్నం – స్కూల్ కాంప్లెక్స్ స్థాయి.
  • తేదీ: 28.09.24 – మండల స్థాయి.
  • తేదీ: 29.09.24 – జిల్లా స్థాయి.

Note:

ప్రతి స్థాయిలో ప్రథమ స్థాయిలో నిలిచిన విద్యార్థులను తదుపరి స్థాయికి ఆయా తేదీలలో పోటీలలో పాల్గొనడానికి పంపించాలి. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ ఎం టి లు వారి పరిధిలోని పాఠశాలలలో ఈ పోటీలు నిర్వహించబడేటట్లు తగిన మానిటరింగ్ చేయవలసిందిగా సూచించడమైనది. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచేవారికి నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుంది.

Details of the prizes to be distributed at District Level

1st Prize: Book: Worth of Rs.700 & Certificate of Achievement

2nd Prize: Book: Worth of Rs.500 & Certificate of Achievement

3rd Prize: Book: Worth of Rs.300 & Certificate of Achievement

Swarnandhra@2047 Essays & Speeches by KV Krishna Reddy sir

DOWNLOAD

Swarnandhra@2047 Notes

DOWNLOAD

Swarnandhra@2047 Guidelines day wise schedule

DOWNLOAD

Swarnandhra@2047 Survey link

CLICK HERE

Swarnandhra@2047 Pamphlet

DOWNLOAD

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం QR-CODE స్కాన్ చేయడం ద్వారా స్వర్ణాంధ్ర@2047 పై మీ ఆలోచనలను / సలహాలను కోరుతోంది.

స్వర్ణాంధ్ర@2047 సర్వే ఫామ్ ను ఆన్లైన్ లో సబ్మిట్ చేసే పూర్తి విధానం & మన పేరుతో Certificate Download చేసే పూర్తి విధానం – వీడియో

Trending Information
error: Content is protected !!