Sun stroke – Precautionary measures Remedies

Sun stroke – Precautionary measures Remedies

వడదెబ్బ – లక్షణాలు – ముందుజాగ్రత చర్యలు – నివారణా మార్గాలు

వడదెబ్బ అంటే ఏమిటి ?

వడదెబ్బ లేదా ఎండదెబ్బ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడం. చాలా వేడియైన వాతావరణంలో, సరియైన మోతాదులో ద్రవపదార్థాలని తీసుకోకుండా తీవ్ర పనుల వలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, శరీరం యొక్క ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. శరీరంలో వేడిని చల్లబరచడానికి చెమటపట్టే క్రమంలో కొన్నిసార్లు రక్తంలో ద్రవం ఎక్కువగా ఆవిరైపోతుంది. అప్పుడు శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలి, చెమట పట్టడం కూడా ఆగిపోయి, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం పొడిబారి శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలు కూడా దాటవచ్చు. (Sun stroke – Precautionary measures Remedies)

వడదెబ్బ సమయంలో ఏమి జరుగుతుంది ?

వడదెబ్బకు ముందస్తు సూచనలు వేడి నిస్త్రాణ (Heat Exhaustion). అంటే ఎండ వేడిమికి తట్టుకోలేక కొంతమందిలో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణ ఉంటుంది. విపరీతంగా చెమట పడుతుంది, శ్వాస ఎక్కువగా తీసుకోవలసి వస్తుంది. ఎక్కువ చెమట పట్టడంవల్ల శరీరంలో లవణాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. నాడి వేగం కూడా తగ్గుతుంది. ఇదే పరిస్థితి ఎక్కువసేపు కొనసాగితే వడదెబ్బకు దారితీస్తుంది. హైపర్ థెర్మియాతో పాటు మారిన మానసిక ప్రవర్తన, చెమట, వికారం మరియు వాంతులు, ఎర్రబడిన చర్మం, వేగవంతమైన శ్వాస, అధిక హృదయ స్పందన రేటు లేదా తలనొప్పి వంటివి వడదెబ్బకు సూచికలు.

హీట్ స్ట్రోక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. చికిత్స చేయని వడదెబ్బ, కీలకమైన అవయవ వైఫల్యం, జీవరసాయన విధులు సక్రమంగా లేకపోవడం మరియు తీవ్రమైన నిర్జలీకరణానికి( dehydration)  దారితీయవచ్చు. తీవ్రమైన వడదెబ్బ సోకిన సందర్భాల్లో,  రోగి మూర్ఛ మరియు అపస్మారక స్థితి మరియు మరణానికి గురికావచ్చు.

వడదెబ్బ తగిలినపుడు పాటించవలసిన నియమాలు

  • వడదెబ్బకు గురైనపుడు శరీరాన్ని వేగంగా చల్లబరిచే ప్రయత్నం చేయాలి.
  • రోగిని నీడపట్టున చేర్చి దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డ తో ఒళ్ళంతా తుడవాలి.
  • రోగి చుట్టూ గుమిగూడకూడకుండా తగినంత గాలి ఆడేటట్లు చేయాలి.
  • వడదెబ్బ తగిలిన వ్యక్తి ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.
  • వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.

వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

  • తగినన్ని నీళ్ళు తాగాలి.
  • వేసవికాలంలో వదులైన నూలు దుస్తులు ధరించాలి.
  • ఎండలో ఎక్కువగా తిరగరాదు. అవరసమై వెళ్ళవలిస్తే నెత్తికి గొడుగు లేదా టోపీ రక్షణగా వాడాలి
  • కారం, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలి.
  • ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.
  • వేసవి లో విరివిగా  లభించే తాటిముంజలు తినాలి.
  • పలచటి గంజిలో ఉప్పు వేసి తాగిన మంచి ఫలితం ఉంటుంది.

CLICK HERE

Sharing is caring!

Leave a Comment

error: Content is protected !!