SA-2 Time table Instructions
Syllabus for SA-II as informed by SCERT- AP is full syllabus (not semester wise) in all subjects of all classes.
SA-2 / CBA-3 Time table 2023-24
Date |
1-5 classes | 6-9 classes |
9.00 to 12.00 | 9.00 to 12.00 for VI to VIII
9.00 to 12.15 for IX class |
|
06.04.2024 | Telugu / Urdu | Telugu / Composite Telugu / Urdu |
08.04.2024 | English part-A | Hindi / SL Telugu / Spl English |
10.04.2024 | English part-B TOEFL | English part-A |
12.04.2024 | Mathematics | English part-B TOEFL |
13.04.2024 | EVS for III,IV,V | Mathematics |
15.04.2024 | OSSC for III, IV, V | General Science / Physical Science (9.00 to 11.00) |
16.04.2024 | SLAS 2024 for IV class | Biological Science (9.00 to 11.00) |
18.04.2024 | Social Studies | |
19.04.2024 | Composite courses Sanskrit (9.00 to 10.30) / OSSC paper I and Paper-II (one after another) |
SA-2 / CBA-3 Instructions
- అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో (1 నుండి 9 వ తరగతి వరకు) మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో (6 నుండి 9 వ తరగతి వరకు) SCERT-AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తేదీ 06.04.2024 నుండి SA-II పరీక్షలు నిర్వహించాలి.
- 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (CBA-3) నిర్వహించడం జరుగుతుంది. 9వ తరగతి విద్యార్థులకు, 10వ తరగతి మాదిరిగా SA-II పరీక్షలు. నిర్వహించడం జరుగుతుంది.
- క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (CBA – 3) కు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్ధులకు ప్రశ్న పత్రంతో పాటు Variable OMR షీట్ ఇవ్వడం జరుగుతుంది. (1 నుండి 5 తరగతుల విద్యార్ధులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక OMR, 6, 7, 8 తరగతులకు లాంగ్వేజ్ పరీక్షలకు ఒక OMR మరియు నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు మరియొక OMR ఇవ్వబడతాయి). ప్రవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నపత్రములు మాత్రమే ఇవ్వబడతాయి, కానీ OMRలు ఇవ్వబడవు.
- ప్రశ్నా పత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్థులు జవాబులను ప్రశ్న పత్రం లోనే టిక్ చేయాలి, వ్రాయాలి మరియు OMR నందు బబుల్ చేయాలి.
- ప్రశ్న పత్రములో ప్రశ్నలు-మార్కుల క్రమము క్రింది విధంగా ఉండనుంది.
Class | MCQs | FRQs | Total | |||
Number | Marks | Number | Marks | Number | Marks | |
I,II | 10 | 20 | 5 | 30 | 15 | 50 |
III,IV,V | 15 | 30 | 5 | 20 | 20 | 50 |
VI, VII, VIII | 25 | 50 | 5 | 30 | 30 | 80 |
- 9వ తరగతి విద్యార్ధులకు SSC పబ్లిక్ పరీక్షల మాదిరి ప్రశ్న పత్రములు 100 మార్కులకు ఉంటాయి, కానీ వెబ్సైటు నందు అప్లోడుచేయునపుడు 80 మార్కులకు కుదించి వేయాలి.
- ఈ విద్యా సంవత్సరం TOEFL పరీక్షను ఎన్నుకోబడిన పాఠశాలలలో మాత్రమే ప్రత్యేకమైన OMR లతో నిర్వహించి, తరగతి వారీగా అన్ని ప్రశ్నపత్రములను (ఉపయోగించిన మరియు ఉపయోగించని) ఒక కవర్ నందు, జవాబులు రాసిన OMR లను మరియు కవర్ నందు ఉంచి MRC నందు 13.04,2024 తేదీ జమ చేయాలి.
- CBSE పాఠశాలల్లోని 8, 9 విద్యార్థులకు కూడా 12.04.2024 తేదీనే మిగిలిన పాఠశాలలతో పాటుగా TOEFL పరీక్షలను నిర్వహించాలి.
- 16.04.2024 తేదీ 4వ తరగతి విద్యార్థులకు జరుపవలసిన SLAS-2024 పరీక్షల గురించి వివరాలు తరువాత తెలియజేయబడతాయి.
Detailed SA-2 / CBA-3 Time table Instructions
Read also..