RBI Withdraw circulation of Rs 2000 Currency Notes

RBI Withdraw circulation of Rs 2000 Currency Notes

రూ.2,000 నోట్లు సర్క్యులేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆర్‌బీఐ

దేశంలో రూ.2,000 నోట్లు సర్క్యులేషన్ నిలిపివేస్తున్నట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారుల నుంచి రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని, అలాగే వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్వకూడదని కూడా బ్యాంక్ లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే వినియోగదారులు తమ వద్ద ఉన్న 2 వేల నోట్ల ను సెప్టెంబర్‌ 30లోపు బ్యాంకులకలో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. చాలా కాలంగా బ్యాంకులు, ఏటీఎంలల్లో రూ.2,000 నోట్లు కనిపించక పోవడంతో ప్రజల్లో రూ.2,000 నోట్లపై అయోమయం నెలకొంది. ఇప్పుడు రూ.2,000 నోట్లు చలామణి నిలిపివేస్తున్నట్టు ఆర్‌బీఐ స్పస్టం చేసింది.

ఉపసంహరణ కు అసలు కారణం..

భారత ప్రభుత్వం 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500 నోట్లతో పాటు రూ.2,000 నోట్లను చలామణిలోనికి తీసుకువచ్చింది. ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి రావడంతో 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసింది ఆర్‌బీఐ. 2023 మార్చి నాటికి చలామణీలో ఉన్న మొత్తం నగదులో రూ.2వేల నోట్ల వాటా 10.8 శాతానికి తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది. క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రూ.2వేల నోట్లను చలామణీని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే రూ.2000 డినామినేషన్‌లోని బ్యాంక్ నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి. ఆర్‌బీఐ 2013-2014లో కూడా ఇదే తరహాలో నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం గమనార్హం.

మన దగ్గర ఉన్న రూ.2,000 నోట్ల ను ఎలా మార్చు కోవాలి ..?

ఎలాంటి రుసుము లేకుండా మే 23 నుంచి ఏ బ్యాంక్‌లోనైనా రూ.2000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్‌లుగా మార్చుకోవచ్చు. అన్ని బ్యాంకులు 2023 సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లను డిపాజిట్‌గా స్వీకరిస్తాయి. డిపాజిట్‌ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. ఒక విడతలో బ్యాంకులో రూ.20వేల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

అలాగే ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల దగ్గర వద్ద ఒకేసారి రూ.2000 నోట్లను రూ.20,000 పరిమితి వరకు మార్చుకునే సౌకర్యం కూడా కల్పించారు. బ్యాంకు రోజు వారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని మార్గదర్శకాలను జారీ చేసింది ఆర్‌బీఐ.

RBI Circular regarding Withdraw circulation of Rs 2000 Currency Notes

DOWNLOAD

Trending Information
error: Content is protected !!