PRASHAST APP Registration Disability Screening Process
Prashast app గురించిన వివరణ?
పాఠశాల ప్రధానోపాధ్యాయులు & ఉపాధ్యాయులందరూ ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లో నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కావాలి. తరువాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల రిజిస్టేషన్ అప్రూవ్ చేసిన తర్వాత ఉపాధ్యాయులు CWSN సర్వే చేయాల్సి ఉంటుంది. (PRASHAST APP Registration Disability Screening Process)
PRASHAST APP Registration Process:
మొదటిసారి రిజిస్ట్రేషన్ అయ్యే వారు New User అని login కావలెను. ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు వారి యొక్క వ్యక్తిగత జిమెయిల్ లేదా యాహు మెయిల్ ద్వారా లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు మాత్రం వారి యూడైస్ లో గత సంవత్సరం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఉన్నారో దాని ద్వారా లాగిన్ అవ్వాలి. Teacher ఒకసారి registration అయితే సరిపోతుంది. కానీ ప్రధానోపాధ్యాయులు మాత్రం వ్యక్తిగత email తో Teacher designation గానూ, u dise లో ఉన్న email తో Principal / Head Master గానూ రెండు లాగిన్ లు కలిగివుంటారు.
ప్రధానోపాధ్యాయులు టీచర్లను వెరిఫికేషన్ చేసే విధానం:
ప్రధానోపాధ్యాయులు యూడైస్ లో ఉన్న ఈ-మెయిల్ తో లాగిన్ అయిన తర్వాత Teachers అనే ఆప్షన్ లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ఉపాధ్యాయుల వివరములు వచ్చిన ఉంటాయి. ఆ ఉపాధ్యాయులను వెరీఫై చేసి కన్ఫమ్ చేయవలసి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు వారి LOG IN లో TEACHERS ను VERIFICATION చేస్తేనే టీచర్లు స్క్రీనింగ్ చేయుట సాధ్యపడుతుంది.
టీచర్లకు HM గారు Class లు Assign చేసే విధానం:
టీచర్స్ ను కన్ఫర్మ్ చేసిన తర్వాత వారికి Class లను Assign (కేటాయించవలసి) ఉంటుంది. అనగా ప్రధానోపాధ్యాయులు కూడా ఏదైనా ఒక తరగతిని క్లాస్ టీచర్ గా తీసుకోవలెను.
గతంలో స్క్రీనింగ్ చేసివారికి మరలా చేయవలెనా?
క్లాస్ లను కేటాయించిన తర్వాత ఉపాధ్యాయులు వారి లాగిన్ లో గతం లో స్క్రీనింగ్ చేసి ఉంటే, 2023-24 లో స్క్రీనింగ్ చేసిన విద్యార్థుల పేర్లు కనబడతాయి. ఆ విద్యార్థులను మరల స్క్రీనింగ్ చేయాల్సిన అవసరము లేదు. పాఠశాల విడిచి వెళ్లిన విద్యార్థులను కూడా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విద్యా సం. కొత్తగా అడ్మిషన్ పొందిన వారిని మాత్రమే “ADD STUDENT” అనే ఆప్షన్ ద్వారా Name, Gender, Date of Birth, Class, Section, Enrollment id (PEN number) & Father Mother తదితర వివరాలు ఎంటర్ చేసి add చేయవలెను. వారికి మాత్రమే స్క్రీనింగ్ చేయవలెను. ఒకవేళ గత సం విద్యార్థులకు ఎటువంటి స్క్రీనింగ్ చేయకపోతే అందరూ విద్యార్థులను (పాఠశాల లో ఎన్రోల్ అయిన మొత్తం) Add student అనే ఆప్షన్ ద్వారా Add చేసుకుని స్క్రీనింగ్ -1 పూర్తి చేయవలెను.
పాఠశాలలోని అందరి విద్యార్ధులను స్క్రీనింగ్ చేయవలేనా ?
ప్రశస్థా యాప్లో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అందరూ పాఠశాలలోని ప్రతి ఒక్క విద్యార్ధిని స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. ఇది కేవలం ప్రత్యేక అవసరాలు (CWSN) గల పిల్లల కోసం మాత్రమే అని కొంతమంది భావిస్తున్నారు. కానీ Normal student ని కూడా 63 ప్రశ్నల్లో ఏవైనా ఒక ప్రవర్తన మార్పు (Behavioral Changes) కు, లేదా DISABILIY కి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. Class Teachers Student wise Abnormalities ఏదైనా ఉంటే, Survey లో ఇచ్చిన 63 ప్రశ్నలకు తగిన దానికి Tick పెట్టాలి. Abnormalities ఏమీ లేకపోతే, చివర None of the Above కు Tick చేస్తే చాలు. మీ పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్ధిని ఆ తరగతి ఉపాధ్యాయులు (class teacher) Screening 1 చేయాల్సి వుంటుంది.
స్క్రీనింగ్ లో అందరికీ None of Above అని ఇవ్వవచ్చా?
విద్యార్థుల యొక్క ప్రవర్తన మార్పులు మరియు వారి యొక్క భౌతిక మరియు మానసిక మార్పులను గమనించి 63 ప్రశ్నలు ఉంటాయి. అందులో ఏదో ప్రశ్న వాళ్ళకి తగినది అవుతుందో ఆ ప్రశ్నకు వారిని సమాధానం కేటాయించాలి. పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరూ లేరు అని, అందరూ NONE OF ABOVE సమాధానం ఇవ్వడం సరికాదు. పాఠశాలలోని అందరు విద్యార్ధుల్ని ఆ క్లాస్ టీచర్లు స్క్రీనింగ్ -1 పూర్తి చేయవలసి ఉంటుంది.
Teacher Survey (స్క్రీనింగ్ -1) తరువాత ఆ సమాచారం Special Educator లేదా IERP ల లాగిన్ లో వస్తుంది. Spl. Educator (IEDSS, IERP) 2nd Level Survey చేయవలెను.
లోపాన్ని గుర్తించిన తర్వాత ఏం చేయాలి?
పరిశీలన ద్వారా గాని prashast చెక్ లిస్ట్ ద్వారా గాని లోపాలు (ప్రత్యేక అవసరాలు) గల పిల్లలను గుర్తించాలి. ఈ విషయం తల్లిద౦డ్రుల సమావేశం నిర్వహించి వారితో చర్చించి వారిని పరిశీలించమని, ఆ తర్వాత వారి లోపం /వైకల్యం (ఎంత ఉన్నది అన్నది సంబంధించిన డాక్టరు) నిర్ధారణ కోసం ‘వైద్య ధృవీకరణ సర్టిఫికెట్ / సదరం’ (Medical Certifi cate/సదరం) కోసం దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
PRASHAST APP – UDISE REGISTERED EMAIL ID FINDER
ప్రధానోపాధ్యాయులు పాఠశాల యొక్క U DISE లో రిజిస్టర్ చేసుకొన్న మెయిల్ ID తో లాగిన్ కావాలి. ఒకవేళ UDISE mail ఏమిటి అని మరచి పోయి ఉంటే సదరు mail id ను ఈ క్రింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చును.
PRASHAST APP నందు Screening చేసేటప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థుల వైకల్యాలు గుర్తించటానికి Disability conditions కొరకు క్రింది pdf ను చూడండి.. |
PRASHAST APP / User Manuals / Check lists
TITLE | LINK |
Prashast Android APP | DOWNLOAD |
PPT_How to use Prashast App? (Bullet points for Teachers, Principals and Special Educators) |
DOWNLOAD |
Disability Screening Checklist for Schools (Telugu) | DOWNLOAD |
Disability Screening Checklist for Schools (English) | DOWNLOAD |
Read also..