Potti Sreeramulu Biography

Potti Sreeramulu Biography

పొట్టి శ్రీరాములు (మార్చి 16, 1901-డిసెంబర్ 15, 1952)

పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్ర రాష్ట్రానికై ప్రాణాలు అర్పించి అమర జీవి గా కీర్తి పొందారు. గాంధీజీ వలె నిస్వార్థ దేశభక్తుడు, నిరాడంబరుడు, త్యాగశీలి, కార్యదీక్ష పరుడు. తన ఆశయ ప్రసిద్ధికి ప్రాణములను సైతం లెక్కచేయని సాహసి, సాంఘిక సేవకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. Potti Sreeramulu Biography

భారతదేశమున భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఈయన ఒక గాంధేయవాది. సామాన్య కుటుంబంలో జన్మించి, అనేక జీవిత సమస్యలను ఎదుర్కొని, గాంధీజీ బోధనలతో సాహచర్యంతో ఆదర్శ జీవితాన్ని ఏర్పరుచుకున్న సుశ్లోకుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. శ్రీరాములు వంటి కార్యదీక్ష పరులు పదిమంది ఉంటే ఒక సంవత్సరంలోనే స్వాతంత్రం సాధించవచ్చని గాంధీజీ అనేవారు. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయనను స్మరించుకోవడం తెలుగువారి గా అది మన కర్తవ్యం.

Potti Sreeramulu జీవిత విశేషాలు

పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్ లో జన్మించారు. తల్లి దండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ లు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లా లోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత ముంబైలోని ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి అక్కడే రైల్వే శాఖలో ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించి నెలకు 250 రూపాయల జీతంతో ఉద్యోగం చేశారు.

1928 వ సంవత్సరంలో, 25 సంవత్సరముల పిన్న వయసులోనే అతని భార్యను, కుమారుడిని కోల్పోవడం ద్వారా జీవితం మీద విరక్తి కలిగి తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. తనకు చెందిన ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సాబర్మతి ఆశ్రమంలో చేరి గాంధీజీతో పాటు దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.

స్వాతంత్రోద్యమంలో పాత్ర

  • 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు పొట్టి శ్రీరాములు గారు.
  • 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుకు వెళ్లారు.
  • 1943- 44 సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశారు, కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు.
  • గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లోను, ఆంధ్ర లోని కృష్ణా జిల్లాలోనూ గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని యెర్నెని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరారు.
  • 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసి వారికి ఆలయంలో ప్రవేశం కల్పించేందుకు కృషి చేశారు పొట్టి శ్రీరాములు గారు.
  • మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను నిరాహార దీక్ష చేసి ఆమోదింప చేశారు. దీనికి ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చేయవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
  • నెల్లూరు లోనే ఉంటూ హరిజనోద్దరణకు కృషి చేశారు. దీనికి సంబంధించిన నినాదాలు అట్టల మీద వ్రాసి మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవారు, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు పూనుకున్నారు.
  • 1946 నవంబర్ 25న గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్స్ లోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు.
  • కొద్ది రోజుల్లోనే స్వాతంత్రం రావచ్చునని ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు అందరి దృష్టికి తీసుకెళ్లిన పొట్టి శ్రీరాములు గారు దీక్షను మానుకోవాలని సూచించినా.. అతను వినకపోయేసరికి వారు గాంధీజీ నీ ఆశ్రయించారు. గాంధీజీ శ్రీ రాములకు నచ్చచెప్పి దీక్షను విరమింపచేశాడు.
  • 1985లో ప్రచురింపబడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (committee for history of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. “సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. వినయం, సేవ, ప్రేమ నిస్వార్థత లు మూర్తిభవించిన స్వరూపమే శ్రీరాములు.”

Potti Sreeramulu ఆంధ్ర రాష్ట్ర సాధనకై దీక్ష

మద్రాసు ప్రెసిడేన్సి మరియు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేది. ఆంధ్ర ప్రజల యొక్క సంస్కృతిని కాపాడటానికి మరియు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. 1946 నుంచి 1948 వరకు దళితులకు మద్దతు తెలుపుతూ మూడుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి వారి ఇంట్లో నిరాహారదీక్షను ప్రారంభించాడు. ప్రారంభించిన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ప్రభుత్వం మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలందరూ పొట్టి శ్రీరాములు గారికి మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా ప్రకటన ఏమి చేయలేదు.

పొట్టి శ్రీరాములు గారికి ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా మనో ధైర్యం మాత్రం తగ్గలేదు, నవంబర్ 27వ తేదీ నాటికి క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం జరిగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అయ్యేది. డాక్టర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేసేవారు.  నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపి తీసుకునేవారు. డిసెంబర్ నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో ఆయన వణుకుతుంటే ఎప్పుడూ.. చొక్కా వేసుకోనీ పొట్టి శ్రీరాములు గారికి చొక్కా వేసేవారు. ఉద్యమం ఉదృతం కావడం, ప్రభుత్వం స్పందించకపోవడం వలన పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో క్రమక్రమంగా దేహం బలహీనమై పోయినా, స్పృహ తప్పిపోయినా.. దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకునేవారు.

తెలుగు భాషాపరంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ను విడదీయాలని మరియు దానికి మద్రాసు రాజధానిగా ఉండాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తాను అని చెప్పినా, ఆ విషయంపై ఎలాంటి పురోగతి సాధించలేదు. దాని వెనుక ఉన్న ముఖ్య కారణం ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా అడగడం.

ఆఖరు రోజు

డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు ! నిరాహార దీక్ష చేపట్టి ఆరోజు “56వ రోజు”. ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 15.8 కేజీలు బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. చివరికి రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు. అందుకే ఆయన త్యాగానికి గుర్తుగా అందరూ “అమరజీవి” అని పిలుచుకుంటారు.

పర్యవసానాలు

పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పుడు ఇంటి ముందు గోడమీద బొగ్గుతో “పొట్టి శ్రీరాములును పొట్టన పెట్టుకున్న రాజాజీ ని ఉరితీయాలి” అని రాశారు. పొట్టి శ్రీరాములు గారి మరణం తర్వాత తన త్యాగాన్ని పొగుడుతూ వేలమంది నిరసనలు తెలిపారు. నిరసనలకు ప్రతిఫలంగా అల్లర్లు జరిగి చాలా ప్రజా ఆస్తి నష్టం జరిగింది. ఒంగోలు, కనిగిరి, విజయనగరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, తెనాలి, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం మరియు నెల్లూరు ప్రాంతాలలో కూడా నిరసనలు మొదలయ్యాయి.నిరసనల కారణంగా పోలీసులు కాల్పులు జరపడం ద్వారా విజయవాడకు చెందిన మరియు అనకాపల్లికి చెందిన ఏడుగురు వ్యక్తులు చనిపోయారు.

1952 డిసెంబర్ 19న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న తెలుగు మాట్లాడే ప్రజల కోసం కర్నూలు రాజధానితో “ఆంధ్ర రాష్ట్రం” ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రంలో కూడా తెలుగు మాట్లాడే జిల్లాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. 1956 నవంబర్ 1న హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా ప్రకటించారు. Potti Sreeramulu Biography

స్మరణలు

  • మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది.
  • ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది.
  • నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.
  • అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు 2000 మార్చి 16 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.

Celebration of Amarajeevi Sri Potti Sriramulu Jayanthi as State Function on 16th March 2024 – Instructions

DOWNLOAD

Read also…

Jawaharlal Nehru Biography

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!