PM Internship scheme details Registration Online apply
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం (PM Internship scheme)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 12 సా.5 గం. నుంచి నుంచి మొదలైనది. 24 ఏళ్లలోపు యూత్ కోసం పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం రూపొందించబడినది. ఇంటర్న్‌షిప్ సమయంలో స్టైపెండ్‌గా రూ. 5000 పొందుతారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. (PM Internship scheme details Registration Online apply)
అర్హతలు & ఇంటర్న్‌షిప్ వ్యవధి (PM internship eligibility)
10, 12వ తరగతి ITI, పాలిటెక్నిక్ డిప్లొమా లేదా BA, B.Sc., B. Com, BCA, BBA, B. Pharma చదివిన 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని ప్రసిద్ధ 500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేయవచ్చు. దీని ఇంటర్న్‌షిప్ వ్యవధి 12 నెలలు. ఇంటర్న్‌షిప్ వ్యవధిలో కనీసం సగం తరగతి గదిలో కాకుండా వాస్తవ పని అనుభవం లేదా ఉద్యోగ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది.
దరఖాస్తు & స్టైపెండ్ వివరాలు
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద అర్హతగల అభ్యర్థులు pminternship.mca.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతి ఇంటర్న్ స్టైపెండ్‌గా రూ. 5000 పొందుతారు. ఇందులో రూ.4500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రూ. 500 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంబంధిత కంపెనీ ఇస్తుంది. ప్రతి ఇంటర్న్ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేయబడతారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 12 నుంచి ప్రారంభమై అక్టోబర్ 26 తో ముగుస్తుంది. దీని తర్వాత అక్టోబర్ 27 నుంచి ఎంపికైన యువతకు ఇంటర్న్‌షిప్ చేయడానికి కంపెనీని కేటాయించనున్నారు. నవంబర్ 7వ తేదీలోపు జాబితాను విడుదల చేసి, నవంబర్ 8 నుంచి 25వ తేదీ వరకు సంబంధిత వ్యక్తి కి ఆఫర్ లెటర్లు పంపిస్తారు. డిసెంబర్ 2 నుంచి వారి సంబంధిత కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభిస్తారు. మొత్తం పథకంలో కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానం వర్తిస్తుంది.
కావలసిన పత్రాలు
దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేస్తున్నప్పుడు అక్టోబర్ 11 నాటికి రిజిస్టర్ అయిన కంపెనీలలో ఇంటర్న్‌షిప్ కోసం ప్రతి ఇంటర్న్‌కు గరిష్టంగా ఐదు ఎంపికలు ఇవ్వబడతాయి.
ఏ ఏ రంగాల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది ?
గత మూడేళ్ల CSR ఖర్చుల సగటు ఆధారంగా అగ్రశ్రేణి కంపెనీలను గుర్తించారు. గ్యాస్, చమురు, ఇంధన రంగానికి ఇంటర్న్‌షిప్ పథకంలో నమోదు కోసం గరిష్ట అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత టూర్-ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయి.
వీరు దరఖాస్తు కు అనర్హులు
తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు లేదా కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు లేదా పూర్తి సమయం కోర్సులు చదువుతున్న యువకులు వీటికి దరఖాస్తు చేసుకోలేరు. IIT, IIM, నేషనల్ లా యూనివర్సిటీ, IISER, NIT, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల నుంచి డిగ్రీలు పొందిన యువత దరఖాస్తుకు అనర్హులు. వృత్తిపరమైన డిగ్రీలు ఉన్నవారిని పథకం నుంచి దూరంగా ఉంచుతారు. అలాగే ఏదైనా స్కిల్ అప్రెంటిస్‌షిప్ ఇంటర్న్‌షిప్ చేసిన లేదా చేసిన యువత దరఖాస్తు చేయలేరు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి శిక్షణా కార్యక్రమంలో భాగమైన యువత ఈ పథకానికి అర్హులు కాదు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద ఎప్పుడైనా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన లేదా శిక్షణ పొందుతున్న యువత కూడా దరఖాస్తు చేయలేరు.