November 14 Children day speeches essays songs

November 14 Children day speeches essays songs

బాలల దినోత్సవం

బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పూలన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టిన రోజైన నవంబరు 14 న మన దేశంలో బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. (November 14 Children day speeches essays songs)

బాలల దినోత్సవం చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పిల్లల హక్కులను ప్రోత్సహించడం, వారి విద్య, శ్రేయస్సుకి పాటుపడటంతో పాటు, పోషకాహారం, ఇంట్లో సురక్షితమైన వాతావరణం అందించడం వంటి బాధ్యతలను గుర్తు చేస్తుంది. పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, బాల కార్మికులుగా మారడం వంటి పిల్లలు ఎదర్కుంటున్న సవాళ్లపై అవగాహన పెంచుతుంది.

భారతదేశంలో బాలల దినోత్సవం

భారత దేశాన్ని దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్‌లాల్‌ నెహ్రూ సొంతం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషువారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాదించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిజేశారు. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.

బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది

1954 సంవత్సరానికి ముందు భారతదేశంలో అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం మొదటిసారి 1954 లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1989 లో పిల్లల హక్కులపై నవంబర్ 14వ తేదీన ఐరాసా ఓ బిల్లును ఆమోదించింది. 191 దేశాలు ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకాలు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలో జూన్ 1వ తేదీన, పాకిస్తాన్‌లో నవంబర్ 20వ తేదీన, జపాన్‌లో మే 5వ తేదీన, దక్షిణ కొరియాలో మే 5వ తేదీన, పోలాండ్ లో జూన్ 1వ తేదీన, శ్రీలంకలో అక్టోబర్ 1వ తేదీన ఇలా ఆయా దేశాల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

Children’s day Speeches in Telugu & English

TITLE LINK
Children’s day Telugu speech (Short) DOWNLOAD
Children’s day Telugu speech (Long) DOWNLOAD
Children’s day English speech (Short) DOWNLOAD
Children’s day English speech (Long) DOWNLOAD

Children’s day Special songs in Telugu

పసిడి పాపల చాచా జీ

చిట్టి పొట్టి బాలలం

పండిత నెహ్రూ పుట్టిన రోజు

పిల్లల్లారా పిల్లల్లారా

రండి రండి బాలల్లార

ఎల్లలెరుగాని వాళ్ళము

Read also..

Jawaharlal Nehru Biography in Telugu

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!