New Jaya Jayahe Telangana state anthem

Jaya Jayahe Telangana state anthem

New Jaya Jayahe Telangana Song lyrics

కొత్త “జయ జయహే తెలంగాణ” గీతం

జయ జయహే తెలంగాణ.. (New Jaya Jayahe Telangana state anthem)

జననీ జయకేతనము..

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనము

తరతరాల చరితగల తల్లి నీరాజనం

తరతరాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం

జై తెలంగాణ జై జై తెలంగాణ ll2ll

జానపద జనజీవన జావలీలలు జాలువారగ

కవితాలిక వైతాయిక కదల మంజీరాలు

జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర

అనునిత్యం నీ గానం మహిమ నీవే నా ప్రాణం

జై తెలంగాణ జై జై తెలంగాణ ll2ll

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగ

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి

ప్రతిదినము తెలంగాణ ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జై జై తెలంగాణ ll2ll

జై తెలంగాణ జై జై తెలంగాణ ll2ll

జై తెలంగాణ జై జై తెలంగాణ ll2ll

New Jaya Jayahe Telangana state anthem in video format CLICK HERE

Old Jaya Jayahe Telangana anthem

పాత “జయ జయహే తెలంగాణ” గీతం

జయజయహే తెలంగాణ.. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్‌

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జానపద జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర వేలకొలదిగా

వీరులు నేలకొరిగిపోతెనేమి తరుగనిదీ నీత్యాగం మరువనదీ శ్రమ యాగం

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే

నీ తనువుకు సింగారం సహజమైన వనసంపద సక్కనైన పువ్వుల పొద

సిరులు పండె సారమున్న మాగాణియె కద నీ ఎద

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

Sharing is caring!

error: Content is protected !!