National Voters day

National Voters day

ఒక ఓటు నిర్లక్ష్యమైన ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం, బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైనది..

National Voters Day Significance

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశం కొందరు ఓటు వేయడం నామోషీగా భావిస్తుంటారు. ఇలాంటి అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters Day) ప్రారంభించింది. దీనికి అనుగుణం గా ప్రతి సంవత్సరం భారతదేశం లో జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Online Quiz on National voters day

CLICK HERE

National Voters Day History

జాతీయ ఓటర్ల దినోత్సవం అనే భావన 2011లో తెరపైకి వచ్చింది. ఇది 2011 జనవరి 25 నుండి ఎన్నికల కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. ఎక్కువ మంది యువతను ఎలక్షన్ పోలింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఆవిర్భవించింది. యువతలో ఓటరు నమోదు తగ్గుదలకు ప్రతిస్పందనగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల పోలింగ్ లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రంలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది. అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు లను అందజేస్తుంది..

National Voters Day 2024 Theme

2024 జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్, ‘Nothing Like Voting, I Vote for Sure’ అనేది ఓటర్లకు అంకితం చేయబడింది మరియు వారి ఓటు శక్తి ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం పట్ల వ్యక్తుల భావాలు మరియు ఆకాంక్షలను తెలియజేస్తుంది.

Voter’s Pledge in English

“We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement”.

ఓటర్ల ప్రతిజ్ఞ తెలుగు లో..

భారతదేశ పొరులమయిన మేము. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్మ సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.

Read also…

AP Final voters list 2024

CLICK HERE

Trending Information
error: Content is protected !!