National Teachers day

National Teachers day

జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

      మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. అజ్ఞానమనే చీకటిలో ఉన్న వారిని విజ్ఞానమనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు. ఏ దానం చేసినా కరిగిపోతుంది కానీ విద్యా దానం చేస్తే అది చచ్చిపోయేంత వరకు వారితోనే ఉంటుంది. అలాంటి గొప్ప దానాన్ని చేసే ఉపాధ్యాయుడిని సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో పోల్చారు పెద్దలు. జీవితంలో స్థిరపడడానికి, జీవితాన్ని గొప్పగా కొనసాగించడానికి విలువైన పాఠాలు నేర్పించడంలో గురువుల తర్వాతే ఎవరైనా. (National Teachers day)

   మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవ సత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంను అక్టోబరు 5వ తేదీన జరుపుకుంటారు.

సెప్టెంబర్ 5నే టీచర్స్ డే ఎందుకు?

   గొప్ప పండితుడు, భారతరత్న, తొలి ఉప రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే టీచర్స్ డే గా భారతీయులందరూ జరుపుకుంటున్నారు. దాని వెనుక ఒక కారణం ఉంది. నిజానికి రాధాకృష్ణన్ ఒక గొప్ప ఫిలాసఫర్, మానవతావాది మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప పండితుడు కూడా.

      సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962లో రెండో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయం లో అతని వద్ద చదువుకున్న విద్యార్థులందరూ కలిసి అతని పుట్టినరోజు సెప్టెంబర్ 5ను గ్రాండ్‌గా జరపాలనుకున్నారు. ఇందుకు, “మీ బర్త్ డే వేడుకల మేం చేసుకోవచ్చా మాస్టారూ,” అని వారందరూ కలిసి రాధాకృష్ణన్‌ను అడిగారు. వారికి బదులిస్తూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటిస్తే అది తనకు ఎంతో గర్వకారణమని రాధాకృష్ణన్ తెలిపారు. అలా ఆ రోజు నుంచి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5న భారతీయులందరూ టీచర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

శో॥ అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా

        చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమ:

“God lives, feels and suffers in every one of us, and in course of time, His attributes, knowledge, beauty and love will be revealed in each of us ” Sarvepalli Radhakrishnan

“Thank You Teacher” Poem

  • Thank you for all the
  • Hours you spend,
  • Attention you give,
  • Needs that you tend,
  • Knowledge you pass on,
  • Your special touch,
  • Offering guidance,
  • Undaunted by much,
  • Time you spend planning,
  • Efforts you make,
  • Angles to learning.
  • Chances you take.
  • Here’s to our teachers,
  • Each one a gem.
  • Recognized now; we,
  • Salute them!

Teachers day speeches for Students & Teachers

TITLELINK
Very short speechesDOWNLOAD
Short speechesDOWNLOAD
Long speechesDOWNLOAD
గురుపూజోత్సవ గీతాలు pdf రూపంలో

DOWNLOAD

ఉపాధ్యాయ దినోత్సవం పై ప్రత్యేక mp3 పాటలు

మా ఊరి బడులకు దండాలు

ఓ గురు దేవా నిను మరువములే

గురుదేవుడు ఆచార్యుడు

గురుబ్రహ్మ గురువిష్ణు

Teachers day video songs

Read also..

Dr. Sarvepalli Radhakrishnan Biography in Telugu

CLICK HERE

హిందూ పురాణాల ప్రకారం, మహాభారతం, రామాయణం మరియు ఉపనిషత్తుల వంటి పురాతన గ్రంథాలలో ఐదు రకాల ఉపాధ్యాయులు (గురువులు) ప్రస్తావించబడ్డారు.  అవి:

  1. శ్రోత్రియ గురు: శాస్త్రోక్తమైన ఉపాధ్యాయుడు, గ్రంధాలపై పట్టు సాధించి విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.
  2. బ్రాహ్మణి గురు: దైవత్వాన్ని మూర్తీభవించిన ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు వారి అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడతారు.
  3. ప్రజ్ఞ గురు: ఆచరణాత్మక జ్ఞానం మరియు నైపుణ్యాలను అందించే ఉపాధ్యాయుడు, విద్యార్థులకు సైద్ధాంతిక భావనలను వర్తింపజేయడంలో సహాయం చేస్తాడు.
  4. ఉపాసక్ గురు: విద్యార్థులకు ఆధ్యాత్మిక సాధనలు మరియు ఆచార వ్యవహారాలలో మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయుడు.
  5. మోక్ష గురువు: విద్యార్థులను ఆధ్యాత్మిక విముక్తి (మోక్షం) మరియు ఆత్మసాక్షాత్కారం వైపు నడిపించే గురువు.
error: Content is protected !!