National sports day

National sports day

జాతీయ క్రీడా దినోత్సవం

     ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భం గా ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని తొలిసారిగా 2012లో జరుపుకున్నారు. (National sports day)

     ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి మూడు బంగారు పతకాలు అందించిన గొప్ప క్రీడాకారుడు. క్రికెట్ కు అంతగా వైభవం లేని రోజుల్లో హాకీ క్రీడ ద్వారా ఇండియా పేరుప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటిచెప్పారు. మన దేశంలో హాకీ క్రీడకు ఆద్యుడిగా ధ్యాన్‌చంద్‌ ను అభివర్ణిస్తుంటారు. 1928,1932, 1936 ధ్యాన్ చంద్ సారథ్యంలో ఇండియా హాకీ జట్టు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నది. మెరుపు వేగంతో గోల్స్ చేయడం ధ్యాన్‌చంద్‌ ప్రత్యేకత. తన ఫుట్ వర్క్ తో ఎదుటి ఆటగాళ్లను సులభంగా బోల్తా కొట్టించేవాడు. హాకీ క్రీడతో పాటు ఆర్మీ అధికారిగా అతడు దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. అతడి జయంతి రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా 2012లో ప్రకటించింది.

జాతీయ క్రీడా దినోత్సవం 2024 యొక్క థీమ్

      భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం 2024 యొక్క థీమ్ ‘స్పోర్ట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ పీస్‌ఫుల్ అండ్ ఇన్‌క్లూజివ్ సొసైటీస్.’ క్రీడలు ప్రజలను ఒకచోట చేర్చి, అవగాహనను పెంపొందించుకోగలవు మరియు బలమైన సంఘాలను ఎలా నిర్మించగలవో ఈ థీమ్ హైలైట్ చేస్తుంది. క్రీడలు జట్టుకృషిని, గౌరవాన్ని మరియు ఐక్యతను ప్రోత్సహిస్తాయి, సామాజిక అడ్డంకులను ఛేదించడంలో సహాయపడతాయి. క్రీడలలో పాల్గొనడం ద్వారా, విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు ఒకరికొకరు కనెక్ట్ అవ్వగలరు మరియు మద్దతు ఇవ్వగలరు, శాంతి మరియు చేరికను పెంపొందించగలరు.

ఆటలతో ఆరోగ్యం

      క్రీడలు జీవితంలో అంతర్భాగం. ఈ కార్యకలాపాలు ఆడటానికి సరదాగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యం మరియు శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. క్రీడ ఆడటం గొప్ప వ్యాయామం. ఆటలతో ఆరోగ్యం బావుంటుంది. శరీరానికి తగిన వ్యాయామం అందుతుంది. కాబట్టి చదువుతో పాటు, పిల్లలకు ఆటలు ఆడు కోవడానికి తగిన సమయం ఇవ్వాలి.

ఆటలో నాకు ఇష్టమైన భాగం ఏమిటో మీకు తెలుసా? ఆడే అవకాశం.” – మైక్ సింగిల్టరీ

ధ్యాన్ చంద్ గురించి క్లుప్తంగా..

        హాకీ మాంత్రికుడిగా పేరొందిన ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29న అలహాబాద్ లో జన్మించారు. దేశంలో హాకీ క్రీడకు గుర్తింపు తెచ్చారు. ఒలింపిక్స్ లో మూడు బంగారు పతకాలు సాధించారు. 1928-64 మధ్య 8 ఒలింపిక్స్ క్రీడలలో 7 సార్లు గెలుపొందడంలో ఆయన కీలకులు. ఆర్మీలో మేజర్గా కొనసాగుతూనే క్రీడలకు వన్నె తెచ్చిన ఆయనకు ‘పద్మభూషణ్ పుర స్కారం అందుకున్నారు. 1979 డిసెంబరు 3న కన్ను మూశారు. ఆయన జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా ఆచరిస్తూ క్రీడలలో రాణించినవారికి ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డుతో గౌరవిస్తున్నారు.

Read also..

Dhyan chand Biography in telugu

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!