Mother Teresa Biography
మదర్ థెరీసా (ఆగస్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997)
ఎందరో జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నతమైన వ్యక్తి మదర్ థెరీసా భారతీయులతో ‘అమ్మ’ అని పిలిపించుకున్న అంతటి మహనీయత గల వ్యక్తి మదర్ థెరెసా. పేదల పాలిట, అభాగ్యుల పాలిట ఆశాజ్యోతి. కలత పడిన వారి పాలిట కన్నతల్లి, సర్వజనులకు సేవ మూర్తి. ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది ఈ దేశం చేరింది ప్రజలందరి గుండెల్లో గూడు సంపాదించుకుంది. సేవకి ప్రతిరూపంగా నిలిచింది. మదర్ థెరీసా ని ఎరుగని వారెవరు లేరు అంటే అతిశయోక్తి లేదేమో. Mother Teresa Biography
జననం & బాల్యం
యుగోస్లేవియా దేశంలో 1910 ఆగస్టు26న ఈమె జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు ‘అగ్నస్ గోనా బొజాక్షువు’. ఈమె అల్బెనియ దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. ఉత్తర మేసిడోనియా ముఖ్య పట్టణంలో జన్మించింది. ఈమె పుట్టిన మరుసటిరోజే ఆమెకు బాప్తిసం ఇచ్చారు. ఈమె ఆగస్టు 26న జన్మించినప్పటికీ క్రైస్తవ మతం స్వీకరించిన ఆగస్టు 27న తన నిజమైన జన్మ దినముగా భావించే వారు.
తన బాల్యంలోనే మత ప్రచారకుల జీవిత కథల పట్ల వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంటిని తల్లిదండ్రులను విడిచి సిస్టర్స్ ఆఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరింది. 1929లో ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారతదేశంలో హిమాలయ పర్వతాల వద్దనున్న డార్జిలింగ్ కు వచ్చింది. 1931 మే 24 సన్యాసిగా మొదటి మత ప్రతిజ్ఞ చేసింది. మత ప్రచారకుల సంఘం సెయింట్ అయిన ‘తెరేసే డి లిసే’ పేరు మీదుగా తన పేరును ‘తెరెసా’ గా మార్చుకుంది. 1937 మే 14 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసింది.
Mother Teresa మిషనరీస్ ఆఫ్ చారిటీ (అక్టోబర్ 7- 1950)
ఈమె భారతదేశ పౌరసత్వం పొంది 1950 అక్టోబర్ 7న మత గురువుల సంఘాన్ని’ద మిషనరీస్ ఆఫ్ చారిటీ’ గా కలకత్తా లో ప్రారంభించారు. అనాధ పిల్లలను తప్పిపోయిన పిల్లలను చేరదీసి వారికి ఆశ్రయం కల్పించాలని భావించారు మదర్ థెరెసా. 1955లో ఆమె అనాధల కోసం బాలల ఆశ్రయమైన ‘నిర్మల శిశు భవన్‘ ను ప్రారంభించారు. 1960 నాటికి భారతదేశవ్యాప్తంగా అనేకమైన అనాధ శరణాలయాలను ధర్మశాలలను కుష్టి వ్యాధుల కొరకు కేంద్రాలను ఏర్పాటు చేశారు మదర్ థెరెసా. ‘ద మిషనరీస్ ఆఫ్ చారిటీ బ్రదర్స్’ అనే సంస్థ 1963లోను ‘ద మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్స్’ అనే సంస్థ 1976 లోను స్థాపించారు. వ్యాధులతో ను జబ్బులతోను బాధపడుతున్న వారు ‘ది మిషనరీ ఆఫ్ చారిటీ’ లో చేరారు. కుష్టి వ్యాధిగ్రస్తుల కొరకు ధర్మశాల లను ‘శాంతి నగర్’ అనే పేరుతో ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2007 నాటికి ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనేక ఆశ్రమాలను కలిగి ఉంది.
కష్టాల జీవితం
మదర్ థెరీసా తన డైరీలో తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి ఉన్నట్లుగా వ్రాసుకున్నారు. ఆమెకు ఆదాయం లేకపోవడం వలన ఆహారం, ఇతర సరఫరాల కొరకు యాచించవలసి వచ్చేది. ఈ ప్రారంభ నెలలలో ఒంటరి తనము, ఆమెకు ఆశ్రమ జీవితంలోని సౌకర్యాలకు మరలి పోవాలనే ప్రేరేపణ, ఎంచుకున్న క్రొత్త దారి పట్ల సంశయమును కలిగించింది. ఈ విషయాలను తన డైరీలో వ్రాసుకున్నారు:
“మా దేవుడు నన్ను పేదరికం అనే శిలువతో కప్పబడిన స్వేచ్ఛా సన్యాసినిగా వుండమంటున్నాడు. నేను ఈరోజు మంచి పాఠం నేర్చుకున్నాను. పేదల బీదరికం వారికి చాలా కష్టంగా వుండివుండాలి. ఒక ఇల్లు కొరకు వెతుకుతూ నా కాళ్లు చేతులు నొప్పిపుట్టేంతవరకూ నడిచాను. పేదవారు ఇంటికొరకు, ఆహారం , ఆరోగ్యం కొరకు వెతుకుతూ శరీరంలోను , ఆత్మలోను ఎంత బాధపడుతున్నారోనని అనుకున్నాను. అప్పుడు లోరెటో లో నున్న సుఖప్రధమైన జీవితం నన్ను లాలసకు గురిచేసింది. నీవు ఒక్క మాటంటే చాలు మరల ఆ పాత జీవితం మరలం నీదవుతుందని నన్ను లోంగదీసుకోనే గొంతు చెప్తున్నది. నా స్వేచ్ఛమైన మనస్సుతో దేవుడా, నీపై ప్రేమతో, నేను ఇక్కడే వుంటాను. నాగురించి నీ పవిత్ర ఇష్టాన్ని నెరవేరుస్తాను. నేను ఒక కన్నీటిబొట్టు కూడా రానివ్వలేదు.”
విమర్శలు
ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నది. ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను ఎదుర్కున్నారు.
తుది శ్వాస
1980 తర్వాత, మదర్ థెరిసా రెండు కార్డియాక్ అరెస్ట్‌లతో సహా కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. తన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, మిషనరీస్ ఆఫ్ ఛారిటీని మునుపటిలాగే సమర్ధవంతంగా పరిపాలించారు. ఏప్రిల్ 1996లో, మదర్ థెరిసా కిందపడి ఆమె కాలర్ బోన్ విరిగింది. ఆ తర్వాత, ఆమే ఆరోగ్యం క్షీణించడం జరిగింది. మరియు సెప్టెంబర్ 5, 1997న ఆమె తుది శ్వాస విడిచారు.
గుర్తింపు
- అందరికంటే ముందుగా భారత ప్రభుత్వం ఆమెను గుర్తించింది, 1962లో పద్మశ్రీ బహుకరించడం.
- తరువాతి దశాబ్దాలలో వరుసగా అంతర్జాతీయ అవగాహనకు గాను 1972లో జవహర్లాల్ నెహ్రూ పురస్కారాన్ని అందుకున్నారు.
- 1979లో మదర్ తెరిసా కు నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు.
- 1980లో భారతదేశతదేశ పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్నారు.
- 1992లో ఈమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అయిన నవీన్ చావ్లా ప్రచురించారు.
- ఫిలిప్పీన్స్ కు చెందిన రామన్ మాగ్సెసే అనే పురస్కారాన్ని 1962లో అందుకున్నారు.
- 1976లో పసెమ్ ఇన్ టెర్రీస్ అనే పురస్కారాన్ని అందుకున్నారు.
- 1983లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే పురస్కారాన్ని అందుకున్నారు.
- 1994లో స్వదేశమైన ఆల్బెనీయ ఆమెకు గోల్డెన్ ఆనర్ ఆఫ్ ది నేషన్ అనే బహుమతిని అందుకుంది.
- 1996 లో యునైటెడ్ స్టేట్స్ యొక్క గౌరవ పౌరసత్వం అందజేశారు..
- అల్బేనియా అంతర్జాతీయ విమానాశ్రయనికి ఆమె పేరు పెట్టడం జరిగింది.
- 2013 సెప్టెంబర్ 5 నాటినుండి, ఆమె వర్ధంతి రోజును అంతార్జతీయ దాతృత్వ దినముగా పాటించబడుతున్నది.
- మదర్ థెరీసా మహిళా విశ్వవిద్యాలయము, కొడైకెనాల్, తమిళనాడు నందు 1984 లో స్థాపించబడినది.
Read also..