Mega Parent Teacher meeting Schedule Agenda Invitations
Mega Parent Teacher meeting Schedule Agenda Invitations
MEGA PARENT – TEACHER MEETINGS, ANDHRA PRADESH
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం – బడి వైపు ఒక అడుగు
పాఠశాలకు, తల్లిదండ్రులకు మరియు సమాజానికి మధ్య పటిష్టమైన, సుసంపన్నమైన, సుహృద్భావ బంధాన్ని సమర్ధవంతంగా ఏర్పరచడానికి తల్లిదండ్రుల, ఉపాధ్యాయ సమావేశాల నిర్వహణ చాలా అవసరం. దాని కోసం ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుచున్నాయి. గౌరవ ముఖ్యమంత్రివర్యులు మొదలుకొని, మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పాఠశాల యాజమాన్య కమిటీల ఛైర్మన్ల వరకూ అందరూ ఆరోజు వివిధ ప్రాంతాలలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. (Mega Parent Teacher meeting Schedule Agenda Invitations)
కార్యక్రమ విజయవంతానికి సూచనలు:
5 నుండి 7 రోజుల ముందుగానే సక్రమమైన ప్రణాళిక రూపొందించుకోవాలి.
కమిటీలు ఏర్పాటు చేసుకుని బాధ్యతలు పంచుకోవాలి.
2 నుండి 4 రోజులకు ముందుగానే ఆహ్వాన పత్రికలు పంపించాలి.
ఆహ్వాన పత్రికలు రూపొందించే పనిని విద్యార్థులకు అప్పగించాలి. ఇది SAMP – 2 కు ప్రాజెక్టు వర్కుగా భావించవచ్చు.
ఆహ్వాన పత్రికలు కవర్లలో పెట్టి పంపించాలి.
ఏ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆ తరగతి గదిలో కూర్చోవాలి.
ఏ ఒక్క పేరెంట్ను నిలబెట్టకూడదు. పేరెంట్ చెప్పేది టీచర్ ఓపికగా వినాలి.
పిల్లల ప్రగతిపై చర్చ జరిగే సమయానికి Holistic Progress Cards సిద్ధం చేసుకోవాలి.
పిల్లల గురించి పేరెంట్స్కి వీలైనంత పాజిటివ్గా చెప్పాలి. నెగెటివ్స్ ఏమైనా ఉంటే నెమ్మదిగా చెప్పాలి. (మంచిని పదిమందిలో చెప్పాలి. చెడుని చెవిలో చెప్పాలి)
విద్యార్థిలో Mental Disturbance గుర్తిస్తే దాని గురించి తప్పనిసరిగా చర్చించాలి. కౌన్సెలింగ్ చెయ్యాలి.
Progress Cards జూన్ నెల నుండి అక్టోబర్ నెల వరకు హాజరు, Self Assessment1 మరియు 2 పరీక్షల మార్కులతో సిద్ధం చేసుకోవాలి.
పిల్లలు ఇంటివద్ద సెల్ఫోన్, ట్యాబ్ వంటి గ్యాడ్జెట్స్ వినియోగాన్ని తగ్గించేలా చూడమని చెప్పాలి. విద్యార్థినుల తల్లులకు శానిటరీ నాప్కిన్స్ వినియోగం గురించి చెప్పాలి.
Common Meetingలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించాలి. అభ్యంతరకరమైన పాటలకు డ్యాన్సులు చేయించవద్దు.
కార్యక్రమాల Photos, Videos తీయించాలి. App లో Upload చెయ్యాలి. విద్యార్థులందరూ యూనీఫామ్లో వచ్చే విధంగా చూడాలి.
ప్రతి పేరెంట్ నుండి Feed back తీసుకోవాలి.
గ్యాప్స్ రాకుండా ఒకసారి ట్రయల్ రన్ నిర్వహించడం మంచిది.
పాఠశాల ఎన్రోల్మెంట్ని బట్టి దీనికోసం నిధులు విడుదల చేయబడతాయి.
పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించాలి. దీనికొరకు పర్యావరణ హితమైన మామిడితోరణాలు మరియు అరటిమొక్కలు ఉపయోగించాలి.
ఈ పనుల్లో ఉత్సాహంగా పాల్గొనే పిల్లల్ని భాగస్వామ్యం చేయండి. కానీ తల్లిదండ్రులు అభ్యంతరపెట్టే పనులు చేయించవద్దు.
స్థానిక శాసనసభ్యుల వారు నోడల్ హైస్కూల్లో పాల్గొంటారు. మిగిలిన పాఠశాలల్లో ప్రజా ప్రతినిథులు ఎవరినైనా పిలుచుకోండి. కానీ కార్యక్రమం మాత్రం పేరెంట్స్ ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా తల్లుల ఆధ్వర్యంలో జరగాలి.
కార్యక్రమానికి స్వాగత ప్రదర్శనలో School Band లేదా Scout Band వాడవచ్చు.
School Attendance App నుండి Digital Invitation ను Download చేసుకుని వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా తల్లిదండ్రులను ఆహ్వానించవచ్చు. (Physical Invitation తప్పనిసరి)
ఈవెంట్ ను డాక్యుమెంట్ చేయడానికి SMC చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సహకారంతో కింది ఫోటోగ్రాఫ్ ను కూడా అప్లోడ్ చేయాలి:
పాఠశాలలోకి తల్లిదండ్రులను స్వాగతించడం.
తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు ముఖాముఖి సంభాషణ.
సమావేశాన్ని ఉద్దేశించి వేదిక నుంచి ప్రసంగిస్తున్న తల్లిదండ్రులు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, SMC సభ్యులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, దాతలు మరియు ఇతర హాజరైన వారి గ్రూప్ ఫోటోలు.
సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు లేదా బహుమతి పంపిణీల ఫోటోలు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేస్తున్న ఆహ్వానితులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ఫోటోలు.
PTM యొక్క ప్రధాన అంశాలు మరియు ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని ఖచ్చితంగా యాప్ (App) లో నమోదు చేయాలి. యాప్లో(App) లో ఖచ్చితమైన డేటాను మాత్రమే అప్లోడ్ చేయించాలి.