Karnataka Assembly elections-2023 Results
కర్ణాటక శాసనసభ ఎన్నికలు 2023 ఫలితాలు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ, జేడీఎస్ నుంచి వచ్చిన బలమైన పోటీని తట్టుకుని అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. మొత్తం 224 స్థానాలకు గాను 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2023 (మొత్తం స్థానాలు-224) | |||
పార్టీ పేరు | ఆధిక్యం | గెలుపు | మొత్తం |
కాంగ్రెస్ | – | 136 | 136 |
భాజపా | – | 65 | 65 |
జేడీస్ | – | 19 | 19 |
ఇతరులు | – | 4 | 4 |
అయితే గెలుపుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన హామీలు..
- 2006 నుంచి సర్వీసుల్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు OPS అమలు.
- నైట్ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ.5 వేల ప్రత్యేక అలవెన్స్.
- మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చూస్తాం.
- రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కి పెంచుతాము.
- ప్రతీ గ్రామ పంచాయతీలో, భారత్ జోడో సోషల్ హార్మనీ కమిటీని ఏర్పాటు చేస్తాము.
- PWD, RDPR, నీటి పారుదల, UD, విద్యుత్ రంగంలో అవినీతిని నిర్మూలనకు ప్రత్యేక చట్టం.
శాసనసభ ఎన్నికల వివరాలు:
కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 10 మే 2023న శాసనసభ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 2018లో జరగగా దాని పదవీకాలం 24 మే 2023న ముగియనుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను 2023 మార్చి 29న సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించాడు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 21లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 2 కోట్ల 59 లక్షల మంది మహిళా ఓటర్లు కాగా, 2 కోట్ల 62 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి 9లక్షల 17వేల మంది కొత్తగా ఓటు హక్కును పొందారు.
కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం 2,165 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,777 ప్రాంతాల్లో 58,545 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 73.19% శాతం పోలింగ్ నమోదైంది.