Jhansi Lakshmibai Story biography in Telugu pdf
ఝాన్సీ లక్ష్మీబాయి
ఝాన్సీ లక్ష్మీబాయి ఉత్తర భారతదేశ రాజ్యమైన “ఝాన్సీ” అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. 1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. ఇందులో బ్రిటిష్ వారు అనుసరించిన వివిధ విధానాలతో తమ రాజ్యాలను కోల్పోయిన అనేక మంది రాజులు, రాణులు పాల్గొన్నారు. ఇటువంటి వారిలో వీరనారి ఝాన్సీ లక్ష్మీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారు. భారతదేశం “జోన్ ఆఫ్ ఆర్క్” గా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. (Jhansi Lakshmibai Story biography in Telugu pdf)
బాల్యం
ఆమె అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు19న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో మోరోపంత్ తాంబే, భాగీరథీబాయిలు అనే దంపతులకు జన్మించారు. పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. మను నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఆమె చిన్నప్పుడు నుండి స్వతంత్ర భావాలతో ఉండేది. ఆటపాటలతో పాటు చదువు మరియు గుర్రపు స్వారీ కత్తి యుద్ధం షూటింగ్ మొదలైనవి నేర్చుకుంది.
వివాహం
లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. వివాహానంతరం హిందూ దేవత లక్ష్మీదేవి గౌరవార్థం మహారాష్ట్ర సాంప్రదాయ ప్రకారం లక్ష్మీబాయి అని పిలవబడింది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. బిడ్డ మరణం నుండి తేరుకోలేని గంగాధర్రావుకు 1853 లో విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బంధువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన ఆనందరావు ను దత్తత తీసుకొని అతనికి దామోదర్ రావు గా నామ కరణం చేయడం జరిగింది. దామోదర్ రావు ను చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణించాడు.
తిరుగుబాటు
మహారాజు గంగాధర్ రావు మరణించిన తరువాత వారికి సంతానం లేనందున అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్ హౌసి, డాక్టరిన్ ఆఫ్ లాప్స్ సిద్ధాంతం ప్రకారం వారు చేసుకున్న దత్తత చెల్లనేరదని తెలియజేస్తూ సంవత్సరానికి లక్ష్మీబాయికి 60 వేల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తూ ఝాన్సీ రాజ్య భూ భాగాలని మరియు కోటని ఖాళీ చేసి వెళ్లాలని ప్రకటించెను. కానీ లక్ష్మీబాయి ఝాన్సీని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక న్యాయవాది రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ న్యాయస్థానంలో దావా వేసింది. ఆ న్యాయవాది కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది.
మరణం
1857 లో మొదలైన సిపాయిల తిరుగుబాటులో నానాసాహెబ్ తాంతియాతోపే లతో చేతులు కలిపి లక్ష్మీబాయ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. చివరికి 1858 జూన్ లో గ్వాలియర్ వద్ద బ్రిటిష్ వారితో జరిగిన ఎదురుదాడిలో విరోచితంగా పోరాడి ఘోరంగా గాయపడి వీరమరణం పొందింది. ఆమె ధైర్య సాహసాలు అసమాన పోరాటపటిమ భారతదేశ జోన్ ఆఫ్ ఆర్క్ గా కీర్తి గడించేటట్లు చేశాయి.
Read also..