Jawaharlal Nehru Biography in Telugu
జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14, 1889- మే 27, 1964)
జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రి మరియు గొప్ప స్వాతంత్ర పోరాట నాయకుడు. ‘చాచాజీ’,’పండిత్ జీ’ గా ప్రాచుర్యము పొందిన ఈయన ఒక ప్రసిద్ధ రచయిత, పండితుడు, చరిత్రకారుడు, ప్రముఖ రాజకీయవేత్త. భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థ, పంచశీల ఒప్పందం, అలీన విధానం ఏర్పాటు చేయడంలో కీలక పాత్రను పోషించారు. భారతీయ రాజకీయాలలో శక్తివంతమైన నెహ్రూ- గాంధీ కుటుంబానికి ఈయన మూల పురుషుడు. ‘ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా’ నవభారత నిర్మాణ గా నెహ్రూ సుప్రసిద్ధుడు. Jawaharlal Nehru Biography in Telugu
బాల్యం, విద్యాభ్యాసం
1889 నవంబర్ 14న సుప్రసిద్ధ న్యాయవాది అయినా మోతీలాల్, స్వరూపారాణి దంపతులకు యునైటెడ్ ప్రావిన్స్ లోని అలహాబాదులో జన్మించారు. ఈయన కాశ్మీర్ పండిట్ల సంఘానికి చెందినవారు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టర్, తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు. తల్లి స్వరూపరాణి తుస్సు లాహోర్‌లో స్థిరపడ్డ కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినది. జవాహర్ జననం నాటికే తండ్రి పేరొందిన న్యాయవాది, తర్వాతి కాలంలో బ్రిటీష్ బారిస్టర్ అయిన మోతీలాల్ నెహ్రూ బ్రిటీష్ పెద్దమనిషి తరహాలో వ్యవహరించేవాడు.
జవహర్లాల్ నెహ్రూ తొలి సంతానం కావడంతో జవహర్లాల్ బాల్యం అతి గారాబంగా.. సాగింది. జవాహర్‌లాల్‌ను తండ్రి కొద్దినెలల పాటు స్థానిక కాన్వెంటుకు పంపి ఆ ప్రయత్నం విరమించి, ఇంట్లోనే ప్రైవేటుగా చదివించడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అతనికి మహాపండితుడైన గంగానాథ ఝా సంస్కృత విద్య, అనీ బిసెంట్ సూచించిన ఫెర్డినాండ్ టి. బ్రూక్స్ అనే దివ్యజ్ఞాన సమాజ యువకుడు ఆంగ్ల విద్య బోధించేవారు. బ్రూక్స్ అతనికి విజ్ఞానశాస్త్రం పట్ల ప్రాథమిక అవగాహన, దివ్యజ్ఞాన సమాజ తాత్త్వికత పట్ల ఆసక్తి, ఆంగ్ల కవిత్వం, సాహిత్యం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పలు అంశాలను పరిచయం చేశాడు. దివ్యజ్ఞాన సమాజం పరిచయం నెహ్రూకు బౌద్ధ, హిందూ మతగ్రంథాల పట్ల ఆసక్తి కలిగించి అధ్యయనానికి పురిగొల్పింది. మూడు సంవత్సరాల పాటు టీ. బ్రూక్స్ నెహ్రూ గారికి ట్యూటర్ గా వ్యవహరించాడు.
13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అన్ని బీసెంట్ యొక్క థియోసాఫికల్ సొసైటీలో చేరారు. జవహర్లాల్ నెహ్రూ ప్రైవేట్ విద్యను పూర్తి చేశాక 1905 మే నెలలో బ్రిటన్ వెళ్లి ప్రతిష్టాత్మక ‘ హెరో ‘పాఠశాలలో ప్రవేశం సంపాదించాడు. 1910లో కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కాలేజీ నుండి సైన్స్ లో ఆనర్స్ డిగ్రీతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1916లో అన్ని బిసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ లో భాగమయ్యారు. బారెట్లా ఉత్తీర్ణుడై ఇన్నర్ టెంపుల్‌లో బారిస్టరుగా నమోదుకాగానే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి 1912 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చాడు. జవాహర్‌లాల్ అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకుని, తండ్రి ప్రాక్టీసులో సహ న్యాయవాదిగా వృత్తి ప్రారంభించాడు.
రాజకీయ జీవితం
1916లో కమలను పెళ్లాడి జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. 1917లో హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1921లో గాంధీజీ శిష్యుడె నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. అచంచల జాతీయవాది, మహోన్నత రాజకీయ నాయకుడు, ప్రసిద్ధ రచయిత, శాంతి దూత, జవహర్లాల్ నెహ్రూ “చాచా నెహ్రూ గా” ప్రఖ్యాతి గాంచాడు. ప్రపంచ శాంతి సంధాత, నిస్వార్ధ ప్రజా సేవకుడైన జవహర్లాల్ నెహ్రూ భారతమాత ముద్దు బిడ్డలలో ఒకరు. తరువాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకున్న తర్వాత కూడా అతను గాంధీకి విధేయుడుగా ఉన్నాడు. భారతదేశానికి స్వాతంత్రం కావాలని 1929లో భారతదేశానికి త్రివర్ణ పథకాన్ని ఎగరవేసిన మొదటి వ్యకి.
1947 ఆగస్టు 15 నుండి మే 27, 1964 వరకు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఈయన గొప్ప రాజకీయవేత్త, అంతర్జాతీయతావాది, సమర్ధుడైన పరిపాలకుడు, తత్వవేత్త, అద్భుత రచయిత, మానవతావాది, తిరుగులేని దేశభక్తుడు. ప్రతి పనిలోనూ మానవత్వము, కరుణ చూపే మహానీయుడు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎంతో అభిరుచి గౌరవం కలవాడు. ఈయనకు పిల్లలు అంటే అతి ప్రీతి జవహర్లాల్ నెహ్రూ కు పిల్లలు అంటే చాలా ఇష్టమని అతని జన్మదినం నాడు ‘బాలల దినోత్సవం’ గా నవంబర్ 14న ఏర్పాటు చేశారు. పిల్లలు అతనిని ‘చాచా నెహ్రూ’ అని అంటారు.
1929లో భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుడు సంపూర్ణ స్వరాజ్యమే తమ ధ్యేయమని చాటారు. జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీకి శిష్యుడిగా, వారసుడిగా జాతీయోద్యమంలో తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. భార్య మరణించిన లెక్క చేయలేదు, జైలులో అష్ట కష్టాలను అనుభవించిన బాధపడలేదు., పుస్తక పఠనం చేసి “డిస్కవరీ ఆఫ్ ఇండియా”, “గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ” అనే గ్రంథాలను ఇంగ్లీష్ లో రచించి గొప్ప ‘రచయితగా’ ప్రపంచ కీర్తిగాంచారు. నిరాడంబరత, విశ్వ మానవ ప్రేమ, దేశభక్తి నెహ్రూ కు అమూల్య భూషణాలు. 1936, 1937 చివరిగా 1946లో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడై జాతీయ ఉద్యమంలో గాంధీజీ తర్వాత రెండవ ప్రముఖ నాయకుడిగా అవతరించాడు. జాతీయ నేతగా 1945 జూన్ 15న రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని అనుభవించారు.
భారతదేశంలో రాజ్యాంగ సభ, డోమినియన్ల ఏర్పాటుకు బ్రిటిష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ.. మరో రెండేళ్లపాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్లకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసనసభల్లో కాంగ్రెస్ తరపున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్రను పోషించారు జవహర్లాల్ నెహ్రూ,
ముస్లిం నియోజకవర్గాల్లోనూ, ముస్లిం జనాధిక్యత ఉన్న కొన్ని ప్రావిన్స్ ల్లోను లీగ్ స్పష్టమైన విజయంతో భారతీయ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాబట్టుకోగలిగినంత రాబట్టుకునేందుకు రాజకీయాలను, మత హింసను వాడుకో సాగారు. నెహ్రూ కాంగ్రెస్ ప్రతినిధుల్లో ముఖ్యునిగా నిర్ణయకమైన స్థానాన్ని ఆక్రమించాడు.
వల్లభాయ్ పటేల్ తో పాటుగా కాంగ్రెస్ విధానాలను తరచూ మారే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించడంలో తన పాత్రను పోషించాడు జవహర్లాల్ నెహ్రూ. 1946లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గాంధీ మద్దతు ఆధారంగా గెలుపొందిన నెహ్రూ గారు కాంగ్రెస్ అధ్యక్షత హోదాలో ప్రభుత్వ ఆహ్వానం మేరకు వైస్రాయ్ కౌన్సిల్ ఉపాధ్యక్షునిగా, మధ్యంతర ప్రభుత్వాధినేతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి మంత్రివర్గంలోని ఉంటూ పనిచేయని ఇవ్వని ముస్లిం లీగ్ సభ్యుల ధోరణితో విసిగిపోయి తోటి కాంగ్రెస్ మంత్రులతో సహా రాజీనామా చేశారు.
1946లో ఆందోళనలు చేసిన నెహ్రూ సంస్థానాధీశులు, సంస్థానాల అధికార వర్గాలకు అప్రియమైన భయాందోళనలు రెకెత్తె మనిషిగా పేరు తెచ్చుకోవడంతో 1947లో సంస్థానాల విలీనం విషయంలో వల్లభాయ్ పటేల్, మౌంట్ బాటన్ లు, బిపి మీనన్, సంస్థానాల విలీనం పూర్తి చేశారు. 1947 ఆగస్టు 15 నాటికి విలీనం పూర్తికాని సంస్థానాల అయినా, హైదరాబాద్, జునాగడ్, కాశ్మీర్ వ్యవహారాల్లో ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో కల్పించుకున్నారు. 1947లో అధికార బదిలీ ప్రక్రియ విషయంలో చర్చల అనంతరం తోటి కాంగ్రెస్ నాయకులతో సహా భారత విభజనకు ఆమోదం తెలిపాడు.
1947 డిసెంబర్ నాటికల్లా కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి నివేదించాలన్న నిర్ణయాన్ని మౌంట్ బాటన్ ప్రభావం, ఒత్తిడి మేరకు నెహ్రూ తీసుకున్నాడు. తర్వాత కాలంలో దాని పశ్చాత్తాపం వ్యక్తం చేసి నిర్ణయం మేరకు 1948 జనవరి 1 నాటికి కాశ్మీర్ సమస్య ఐక్యరాజ్యసమితి పరిశీలనకు వెళ్ళింది. 1947 ఫిబ్రవరిలో పంజాబ్ ప్రావిన్స్ లో ముస్లింలు, ముస్లింమేతరుల నడుమ హింసాత్మకమైన రాజకీయ సంఘర్షణ మతాల మధ్య సంఘర్షణగా మారి హింసకు దారి తీసింది.
దేశ విభజన జరగాలంటే పంజాబ్ ను విభజించాలంటూ కాంగ్రెస్ తీర్మానించింది. అదేం తీర్మానంలో బెంగాల్ విభజన అంశం కూడా ఇమిడి ఉంది. ఉపఖండంలో వ్యాపిస్తున్న హింసను అడ్డుకోవడానికి బెంగాల్ నుంచి బీహార్ కు వెళ్ళిన గాంధీని ఈ నిర్ణయంపై ముందస్తుగా నెహ్రు సహా వర్కింగ్ కమిటీ సభ్యులు ఎవరు సంప్రదించకుండా పక్కన పెట్టేశారు.
భారతదేశానికి విభజనతో పాటుగా ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. ఆగస్టు 14వ తేది రాత్రి 11 గంటల నుంచె వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ సభ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రార్థనలు పూర్తయ్యాక, భారత ముస్లిం లను ప్రతినిధిగా చౌధురీ ఖాలిజ్జమాన్, భారత తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లు ప్రసంగించాక స్వాతంత్ర భారతదేశానికి ప్రధాని హోదాలో జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించాడు. చారిత్రాత్మక మైనది, అలంకార శోభిత మైనది భవిష్యత్తులో పలుమార్లు ఉటకింపులకు దోచుకున్నది ఆయన ప్రసంగం.
ప్రధాన మంత్రిగా…
జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ భావాలు గలవాడు. అతివాదులైన యువకులు హింసా మార్గంలోకి పోకుండా గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్ర సమరంలోకి వచ్చేటట్లు చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జైలులో బంధింప పడ్డాడు. 1946లో జైలు నుండి విడుదల అయిన పిదప భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వ అంగీకరించింది. ఆనాటి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా, స్వాతంత్రానంతరం తొలి భారత ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ భారత ప్రజలకు ఎనలేని సేవలు చేశాడు. వాటికి గుర్తుగా 1955లో “భారతరత్న” అవార్డుతో ఆయనను సత్కరించారు.
అజ్ఞానం, అవిద్య, అనారోగ్యం, వెనకబడిన తనంతో సతమతమయ్యే మన దేశాన్ని ముందుకు నడిపించడానికి జాతీయ ప్రణాళిక సంఘాన్ని ఏర్పరిచి, పంచవర్ష ప్రణాళికలను అమలు పరిచి దేశాభివృద్ధికి, దేశ అభ్యుదయానికి శ్రమించాడు. తృతీయ ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతున్న సామ్రాజ్యవాద, సామ్యవాద కుటుంబాలకు వ్యతిరేకంగా అలీన విధానాన్ని రూపొందించాడు. అతి సభలు నిర్వహించాడు. పంచశీల సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు, అలీన దేశాల బలాన్ని పెంపొందించి యుద్ధాన్ని గురించి శాంతి సాధించాడు. 1962 అక్టోబరులో చైనా చేసిన మిత్ర ద్రోహంతో కృంగిపోయిన నెహ్రూ గారు 14 సంవత్సరాలు తిరుగులేని ప్రధానిగా దేశాన్ని తీర్చిదిద్దారు.
విద్య , సంఘ సంస్కరణ
భారత దేశ బాలలు , యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమయిన కోరికగల నెహ్రూ, భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వం నెలకొల్పింది. భారత దేశ బాలలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్య అందించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు. దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కార్యక్రమాలను , వేలాది పాఠశాలల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అంతేకాక బాలలలో పోషకాహార లోప నివారణకై ఉచిత పాలు , ఆహార సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు. వయోజనుల కొరకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయోజన విద్యా కేంద్రాలు, వృత్తి , సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు.
మరణం
శాంతి, స్నేహం, సౌబ్రాతృత్వం కోసం కృషి సల్పిన చాచా నెహ్రూ అనారోగ్యంతో మే 27 -1964న కీర్తిశేషుడైన నాడు. నవంబర్ 14న బాలల దినంగా జరుపుకుంటూ జాతి ఆ నాయకునికి నివాళులర్పిస్తూ గులాబీలను, బాలలను ప్రేమించిన నెహ్రూ వంటి ప్రపంచ నాయకుడు మరొకరు లేరు.
గుర్తింపు
- 1946: జూలై 6, 1946 నాడు జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాలుగోసారి అధ్యక్షుడయ్యారు. మళ్లి 1951 నుంచి 1954 వరకు మరో మూడు సార్లు అధ్యక్షుడయ్యారు. 1947 లో దేశ ప్రధానమంత్రి అయి, 17 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు.
- 1942: క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టి, జైలు పాలయ్యారు.
- 1929: భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశాలకు నెహ్రూ అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలోనే ఆయన బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పూర్ణ స్వాతంత్య్రోద్యమాన్ని ప్రారంభించారు.
- 1923: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యారు.
- 1920: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో తొలిసారిగా రైతు యాత్రలను చేపట్టారు.
- 1919: అలహాబాద్ హోంరూల్ లీగ్ సెక్రటరీగా నియమితులయ్యారు.
Read also..