International Women’s Day
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
జాతి, భాష, సాంస్కృతిక, ఆర్థిక రాజకీయ అనే తేడాలతో సంబంధం లేకుండా మహిళలు సాధించిన విజయాలకు గుర్తింపు పొందిన రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా పరిగణించారు. సామాజికంగా, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగాలలోనూ మహిళలు ఎంతో మేరకు ఎదిగారు అని తెలుసుకొని వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా మారింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా మహిళ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. International Women’s Day
భారతదేశం – మహిళా దినోత్సవం
మగవారి జీవితంలో మగువ మధురభావన. మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపి వెలుగునిస్తుంది. అతడి వెనక ఆమె నిలబడి తగు సలహాలను ఇచ్చి విజయపథంలో నడిపిస్తుంది. ఆమె మార్గదర్శిగా ఉండి బతుకును ఇంపుగా సరిదిద్దుతుంది. ప్రపంచంలో మరే ఇతర దేశం స్త్రీ కి ఇవ్వని సమున్నత స్థానాన్ని మనదేశం ఇచ్చింది. ప్రకృతి వనరులు, దేశం, పశుపక్ష్యాదులు, పరిసరాలు… ఇలా అన్నింటినీ స్త్రీ మూర్తిగా గౌరవించి నమస్కరించే సంస్కారం మనదేశంలోనే ఉంది. గంగానదిని గంగామాత అని, దేశాన్ని దేశమాత అని, భూమిని భూమాత అంటూ… తల్లిగా, స్త్రీ మూర్తిగా గౌరవించే సంస్కారం భారతీయ సంస్కృతికి ప్రత్యేకం. వేద కాలంనాటి నుంచి మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. ఇంటిల్లపాదికీ ఆధారం ఆమె అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఆడవారే శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఆడవారే. పరిచయం లేని మహిళ ఎదురై ఆమెతో మాట్లాడవలసిన సందర్భం వస్తే ‘అమ్మా’ అంటూ సంబోధించే ఉత్తమగుణం కేవలం మనదేశంలోనే ఉంది.
కొన్ని మూఢనమ్మకాలు, స్వార్ధపరుల ఆలోచనలు, చాదస్తాలు వారి స్థానాన్ని కొన్నాళ్లపాటు కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు వివిధ రంగాల్లో కానరాని సంకెళ్లలో చిక్కుకునేటట్టు చేశారు. ఆమెను అబల అన్నారు. అనేకమైన దురాచారాలకు బలి చేశారు. ఫలితంగా కొన్నాళ్లు వంటింటికే పరిమితం అయిపోయారు. కానీ నేడు ఆంక్షల సంకెళ్లు తెంచుకొని, ఆత్మస్థైర్యం నిండిన హృదయంతో ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు.
వేదవేత్తలు మంత్రదర్శినులు అయిన మహిళలు చాలామంది ఉన్నారు. గార్గి, గోధఘోష, విశ్వపార, వేష, మాతృకర్షక, బ్రహిజాయ, రోమక, జుహు, నామ, అగస్త్య, నృపాదితి, శశ్వతి మొదలైన వారెందరో… ఖేలుని భార్య నిష్పల, యుద్ధ విద్యలలో ఆరితేరినది. రెండో పులకేశి కోడలు విజ్జిక సంస్కృతభాషలో తొలి కవయిత్రి. ఎందరో వీరనారీమణులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. ఆనాటి వనితలు చూపిన ధైర్య సాహసాలు, త్యాగనిరతి, పోరాట పటిమ, ప్రతిఘటన ఎందరికో ఆశ్చర్యాన్ని స్ఫూర్తిని కలిగించాయి. దుర్గాబాయి దేశముఖ్ వంటి ఎందరో వనితామణులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మి తన భర్త వీరేశలింగంగారికి చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించారు. తాళ్లపాక అన్నమాచార్యుని సతీమణి తాళ్లపాక తిమ్మక్క గొప్ప కవయిత్రి.
International Women’s Day ఎప్పుడు ప్రారంభమైంది?
మహిళా దినోత్సవం కు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి.
మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకోవాలి?
1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ”ఆహారం – శాంతి” డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.
International Women’s Day ముఖ్య ఉద్దేశం
ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు తగిన గౌరవాన్ని, గుర్తింపు ను ఇవ్వడం.
ప్రపంచవ్యాప్తంగా మహిళల దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు?
అంతర్జాతీయ మహిళల దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. మార్చి 8కి ముందు, తర్వాత మూడు నాలుగు రోజుల పాటు రష్యాలో పువ్వుల కొనుగోళ్లు రెండింతలు అవుతుంటాయి. చైనాలో మార్చి 8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలా మంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది. ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా ‘ల ఫెస్టా డెల్ల డొన్న’ను మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులను బహూకరించి జరుపుకుంటారు. ఈ మిమోసా పువ్వులను పంచే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్‌లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు. అమెరికాలో అయితే మార్చి నెల మహిళల చరిత్ర నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది.
మహిళా దినోత్సవం – ఐక్యరాజ్యసమితి
ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్’ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారకంగా గుర్తించి ప్రతి ఏటా మార్చి 8న మహిళ దినోత్సవం గా నిర్వహిస్తుంది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
సంవత్సరం – ఇతివృత్తం (థీమ్)
- 1996: గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట
- 1997: మహిళలు, శాంతి టేబుల్
- 1998: మహిళలు, మానవ హక్కులు
- 1999: మహిళలపై హింసలేని ప్రపంచం
- 2000: శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట
- 2001: మహిళలు, శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట
- 2002: నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు, అవకాశాలు
- 2003: లింగ సమానత్వం, లింగ సమానత్వం, సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు
- 2004: మహిళలు, హెచ్.ఐ.వి / ఎయిడ్స్
- 2005: తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట
- 2006: నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు
- 2007: మహిళలు, బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట
- 2008: మహిళలు, అమ్మాయిలు ఇన్వెస్టింగ్
- 2009: మహిళలు, పురుషులు యునైటెడ్ మహిళలు, అమ్మాయిలు హింసకు వ్యతిరేకంగా
- 2010: సమాన హక్కులు, సమాన అవకాశాలు: అన్ని కోసం ప్రోగ్రెస్
- 2011: మహిళలు మంచి పని చేయడానికి మార్గం: సమాన విద్య, శిక్షణ,, సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్సెస్
- 2012: గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం, ఆకలి నిర్మూలన
- 2013: ఒక వాగ్దానం వాగ్దానమే: మహిళలపై వయోలెన్స్ నిర్మూలన యాక్షన్ కోసం సమయం
- 2014: మహిళల సమానత్వం అన్నింటి కోసం పురోగతి
- 2015: మహిళలను శక్తివంతం చేయడం, మానవత్వాన్ని శక్తివంతం చేయడం: చిత్రించండి.
- 2016: 2030 నాటికి గ్రహం 50-50: లింగ సమానత్వం కోసం స్టెప్ ఇట్ అప్
- 2017: మారుతున్న పని ప్రపంచంలో మహిళలు: 2030 నాటికి ప్లానెట్ 50-50
- 2018: ప్రస్తుత సమయం: గ్రామీణ, పట్టణ కార్యకర్తలు మహిళల జీవితాలను మారుస్తున్నారు
- 2019: సమానంగా ఆలోచించండి, నేర్పుతో నిర్మించండి, మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి.
- 2020: నేను పురుషానుక్రమముతో సమానత్వం: మహిళల హక్కులను గ్రహించడం
- 2021: నాయకత్వంలోని మహిళలు:కోవిడ్ – 19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం
- 2022: లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండి
- 2023: ప్రతి చోట మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడం
- 2024: మహిళలు పెట్టుబడి పెట్టండి.. ప్రగతిని వేగవంతం చేయండి.
ఈ పవిత్ర భూమిలో ఆధ్యాత్మిక సేవా భావం, త్యాగం, ధీరత్వం వంటి సద్గుణాలు కలిగిన వనితామణులకు కొదవ లేదు. అవనిలోనే కాదు అంతరిక్షంలోనూ వనితామణులు విజయం సాధించారు. అందుకే విశ్వమంతా ముక్తకంఠంతో పలికే ఒకే ఒక్క మాట ‘వనితా వందనం’ అని.
స్త్రీ శతకం (హెచ్.ఆర్.చంద్రం)
Read also..