Indira Gandhi Biography In Telugu

Indira Gandhi Biography In Telugu

ఇందిరాగాంధీ బయోగ్రఫీ (నవంబర్ 19, 1917- అక్టోబర్ 30, 1984)

భారత తొలి మహిళా ప్రధానమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి ఇందిరాగాంధీ. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాలాల్ నెహ్రూ కుమార్తె. అసాధారణ ధైర్యసాహసాలను, అకుంఠితమైన కార్యదీక్షను, అసమానమైన పాలన ప్రదర్శించి దేశ విదేశాలలో ఖ్యాతి పొందిన మహిళ ఇందిరాగాంధీ. ఈమె పుట్టిన రోజున మహిళా దినోత్సవంగా దేశమంతా పాటిస్తున్నారు అంటే, ఆమె సాధించిన విజయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తన తండ్రి నెహ్రూ నుండి రాజకీయ మెలకువలు నేర్చుకొని తాను స్వయంగా ప్రధానిగా దేశానికి అపూర్వ సేవలను అందించి, తన కొడుకు రాజీవ్ గాంధీని కూడా దేశ ప్రధానిగా పనిచేయడానికి ఉత్తమ శిక్షణు అందించిన అద్భుతమహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా సమర్థవంతంగా పాలనను అందించారు. Indira Gandhi Biography In Telugu

Indira Gandhi బాల్యం

ఇందిరా ప్రియదర్శిని 1917 నవంబర్ 19వ తేదీన జవహర్లాల్ నెహ్రూ కమల నెహ్రూ లకు ఏకైక సంతానం, ఈమె అలహాబాద్ లోని ఆనంద్ భవన్లో జన్మించారు. తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ జగమెరిగిన బ్రాహ్మణుడు, తల్లి కమలా నెహ్రూ మహా భక్తురాలు. ఇందిరాగాంధీకీ బాల్యం నుండి హిందూమత ఔన్నత్యం గురించి, సద్గురువులు, సంస్కృతికి సంబంధించిన ఎన్నో కథలు చెప్పేది. తాతగారైన మోతిలాల్ నెహ్రూ కి ఇందిరా పంచప్రాణాలు, మేనత్త విజయలక్ష్మి పండిట్, కృష్ణ లకు కూడా ఇందిరమ్మ అంటే ప్రాణం. బాల్యం నుండి ఇందిరా కు ధైర్య సాహసాలు ఎక్కువ, తండ్రి తాతల నుండి నేర్చుకున్న ఆత్మవిశ్వాసం పాఠశాలలో ప్రథమరాలిగా నిలబెట్టింది.

చిన్నతనంలో తండ్రితో పాటు సబర్మతి ఆశ్రమానికి వెళ్ళేది, అక్కడ గాంధీ మహాత్ముని బోధనలను వినేది, ఆ మహాత్ముని బోధనలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. అలానే రవీంద్రుని రచనలు ఆమెను ఎంతగానో ఆలోచింపజేశాయి, బ్రిటిష్ వారి చేతిలో భారతీయులు బానిసలుగా బ్రతకడం ఆమెకు ఇష్టం లేకపోయింది. తన పాణాలు పనంగా పెట్టినా సరే దేశానికి స్వాతంతం సాధించి తీరాలనే నిర్ణయం తీసుకుంది.

ఇకోలె ఇంటర్నేషనల్ – జెనీవా, ప్యూపుల్స్ ఓన్ స్కూల్- పూణే, బాంబే, బ్యాట్మెంటన్ స్కూల్- బ్రిస్టల్, విశ్వభారతి, శాంతినికేతన్, సోమర్ విల్ కాలేజ్- ఆక్స్ఫఫర్డ్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఇందిరాగాంధీ చదువుకున్నారు. అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు పొందారు. ప్రముఖ విద్యాసంస్థల నుంచి విద్యను అభ్యసించిన ఇందిరాగాంధీ కొలంబియా యూనివర్సిటీ నుంచి విశిష్ట ప్రశంస పత్రం అందుకున్నారు. బాల్యంలో ఆమె ‘బాల్ చరఖా సంఘ్’ స్థాపించారు.

1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కి సహాయంగా ఉండేందుకు పిల్లలతో కలిసి ‘వానర్ సేన’ ఏర్పాటు చేశారు. 1942లో సెప్టెంబర్ నెలలో ఆమె జైలుకు వెళ్లారు. ఆమె చదువుతున్న రోజుల్లో జర్నలిస్ట్ అయిన ఫిరోజ్ గాంధీ తో పరిచయం ఏర్పడి 1942 మార్చి 26వ తేదీన ఫిరోజ్ గాంధీ ని వివాహమాడారు. 1947లో ఢిల్లీలో అల్లర్లకు గురైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.

రాజకీయ ప్రవేశం- ముఖ్య ఘట్టాలు

  • 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి సహాయకంగా ఉండేందుకు “వానర్ సేన” ఏర్పాటు చేశారు.
  • 1950లో అల్ట్రాబాద్ కమల నెహ్రూ విద్యాలయాన్ని ప్రారంభించారు.
  • 1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ ఎన్నికల కమిటీలలో సభ్యురాలుగా నియమితులయ్యారు.
  • 1956లో అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
  • 1958లో కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు
  • 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి 1966 వరకు ఆ పదవిలో కొనసాగారు.
  • 1960 లో ఢిల్లీ యూనివర్సిటీ కోర్టు సభ్యురాలు గాన, యునెస్కో’కు భారత ప్రతినిధివర్గం సభ్యురాలు గాను, 1960-64 యునెస్కో కార్యవర్గ మండలి సభ్యురాలు గాను వ్యవహరించారు.
  • 1962లో నేషనల్ డిఫెన్స్ కాలేజీ సభ్యురాలి గాను వ్యవహరించారు.
  • 1964 ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన శ్రీమతి ఇందిరాగాంధీ 1967 ఫిబ్రవరి వరకు పనిచేశారు.
  • 1964 నుండి 1966 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.
  • 1966-77 మధ్య జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, నార్త్ ఇన్స్టాన్ వంటి కొన్ని పెద్ద సంస్థలతో కలిసి పని చేశారు.
  • 1966 జనవరి నుండి 1977 మార్చి వరకు భారత అత్యున్నత ప్రధానమంత్రి పదవిని అలంకరించారు.
  • అదే కాలంలో 1967 సెప్టెంబర్ నుంచి 977 మార్చి వరకు అణు ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు.
  • 1967 సెప్టెంబర్ ఐదు నుంచి 1969 ఫిబ్రవరి 14 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.
  • 1970 జూన్ నుంచి 1973 నవంబర్ వరకు హోమ్ మంత్రిత్వ శాఖకు న్యాయకత్వం వహించారు.
  • 1972 జూన్ నుంచి 1977 మార్చి వరకు అంతరిక వ్వవహారాల మంత్రిగా పనిచేశారు.
  • 1980లో లోక్ సభకు ఆమె రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్, మెదక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో మెదక్ స్థానాన్ని స్వీకరించి రాయ్ బరేలి స్థానాన్ని వదులుకున్నారు.
  • 1984 కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారు.
  • 1980 జనవరి నుంచి ప్రణాళికా సంఘం చైర్ పర్సన్ గా వ్యవహరించారు.
  • 1980లో జనవరి 14న మళ్లీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
  • ఇందిరాగాంధీ ప్రముఖ రచనల్లోనూ ప్రసంగాలు లోను భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని విస్తృతంగా పర్యటించారు.
  • పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా, చైనా, నేపాల్, శ్రీలంక దేశాలను సందర్శించారు.
  • ఫ్రాన్స్, జర్మనీ, గుయాన్, హంగేరి, ఇరాన్, ఇరాక్, అల్జీరియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, బల్గేరియా, కెనడా, చెలి, చెకోస్లోవేకియా, ఇండోనేషియా, బొలీవియా, ఈజిప్ట్, జపాన్, జమైకా, కెన్యా, మలేషియా, మారిషన్, నెదర్లాండ్, మెక్సికో, నైజీరియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఒమన్, రుమేనియా, పోలాండ్, సిరియా, స్వీడన్, థాయిలాండ్, బ్రిటన్, అమెరికా, రష్యా, జాంబియా, జింబాబ్వే, యుగోస్లావియా, వెనిజులా, ఉరుగ్వే, అమెరికన్, ఆసియా దేశాల్లో ఇందిరాగాంధీ పర్యటించారు.
  • విభిన్నమైన విస్తృత అంశాల పట్ల ఆసక్తి కలిగిన ఇందిరాగాంధీ జీవితం పట్ల సమగ్ర దృక్పథం కలిగి ఉండేవారు.
  • వివిధ రకాల కార్యకలాపాలు ఆసక్తులను వేరువేరుగా కాక మొత్తంగా అంగరించి ఆచరించడంలో తనదైన ప్రత్యేకతను ఇందిరాగాంధీ చాటుకున్నారు.

ఉద్యమం

దేశమంతా పర్యటించి 300 సభలను నిర్వహించి కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకొని వారందరి దృష్టిలో ఆమె వారి కోసం పోరాడే ఒక గొప్ప యోధురాలిగా కనిపించింది. ప్రజలే ఆమె బలం, వారిచ్చే తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని తెలిసిన ప్రత్యక్షంగా వారిని కలిసి గెలిపించ వలసిందిగా కోరింది. ఎలా అయినా ఇందిరాగాంధీని పదవీచ్యుతురాలిని చెయ్యాలని ‘ఇందిరాహఠావో’ అనే నినాదాన్ని ప్రచారం చేశారు. ఆ నినాదానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ “గరీబీహటావో” [పేదరికాన్నిపారద్రోలండి) అనే నినాదంతో తన ప్రచారాన్ని నిర్వహించింది.

1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ ఆ ఉద్యమంలో అరెస్టు అయ్యారు. అరెస్టుకు నీరసంగా దేశమంతా సమ్మెలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ కూడా కారాగారానికి వెళ్లారు. కారాగారంలో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడే రాజీవ్ గాంధీ. 1943 మే 13న విడుదల అయింది, దేశం కోసం పని చేయాలనే తపన ఆమెలో మొదలైంది.

రాజీవ్ గాంధీ కి రెండు సంవత్సరాలు వయసు ఉండగా వారు లక్నో బయలుదేరి వెళ్లారు అక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడిగా ఫిరోజ్ గాంధీ పని చేసేవాడు, అక్కడే రాజీవ్ గాంధీ కి తమ్ముడు సంజీవ సంజయ్ గాంధీ జన్మించాడు. భర్తతో విభేదాలు కారణంగా అలహాబాద్ ను వదిలి ఢిల్లీ లోని తండ్రి దగ్గరికి చేరింది ఇందిర గాంధీ. 1954లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్లాల్ నెహ్రూ కు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్ బరేలి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఇందిరాగాంధీ తండ్రి తరపున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ నెహ్రూ కు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా ‘భీమ కుంభకోణాన్ని’ బయటపెట్టాడు. జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధాని పదవిని అధిష్టించాడు.

ఇందిరా గాంధీని ప్రధానిగా ఉండమని లాల్ బహుదూర్ శాస్త్రి కోరాడు, ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవలసి వచ్చింది. ఆమె మాత్రం విజయం సాధించింది. దీనికి అసలు కారణం ఆమె సామాన్యునికి దగ్గరగా ఉండడం. ఇందిరాగాంధీ దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా సమర్థవంతంగా బాధ్యతలు స్వీకరించారు. దేశానికి తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇందిరా మహిళా లోకానికి గర్వకారణంగా నిలిచారు.

అత్యవసర పరిస్థితి (Emergency)

1971లో అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1975లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఇందిరాగాంధీ అత్యున్నత న్యాయస్థానంలో స్టే ఆర్డర్ తెచ్చుకున్నది.

ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి ఇందిరకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఇందిరకు తమ అవిధేయతను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతిని పసిగట్టిన ఇందిర పరిస్థితిని చేజారనీయకుండా అదుపులోకి తీసుకురావాలని ఆలోచిందింది. వారిని అలా వదిలేస్తే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయని, శాంతిని స్థాపించడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యకైనా సిద్ధమని నిరూపిస్తూ ఇందిర దేశామంతటా అత్యయిక స్థితి (emergency)ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న అత్యయిక స్థితిని ప్రకటించారు.

20 సూత్రాల పథకం

పంచ వర్ష ప్రణాళికల నెరవేరడం లేదని తలచి గాంధీ గారి సూత్రాన్ని అనుసరించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వారి కోసం ఇరవై సూత్రాల పథకాన్ని రూపొందించింది. వెట్టి చాకిరీ చట్ట విరుద్ధమని ప్రకటించింది. 20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానని ఆమె చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకోవడమే ఆమె ఆశయం. ఇరవై సుత్రాల పథకాన్ని అమలు చెయ్యాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్రమంత్రులకు సూచించింది. దేశ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడసాగింది.

వివాదాలు

ఇందిరాగాంధీ పాలనాపరంగా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 14 బ్యాంకులను జాతీయం చేయడం., సంస్థానాధీశులకు ఇచ్చే భరనాలను రద్దు చేయడం, అణుపరీక్షలకు అనుమతిని ఇవ్వడం, బంగ్లాదేశ్ అవతరణకు సైన్య సహకారాలను అందించడం వంటి సంచలనాత్మక, సాహస పూరిత నిర్ణయాలు ఆమె వ్యక్తిత్వానికి అడ్డు పడ్డాయి. పంజాబ్ లో సంభవించిన హింసను అణచివేయడానికి చేపట్టిన ఆపరేషన్ “బ్లూస్టార్” సిక్కుల మనోభావాలను దెబ్బతీసింది. సిక్కుల పవిత్ర దేవాలయం అయిన స్వర్ణ దేవాలయంలో కాల్పులు జరగడం వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

Indira Gandhi మరణం

ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 30వ తేదీన ఇంటి నుండి ఆఫీస్ కి వెళ్తుండగా ఆమె రక్షకుడు బియాంత్ సింగ్ అనే సిక్కు ఆమెపై దారుణంగా కాల్పులు జరిపాడు. దాంతో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.. ఆమె మరణం జాతికి తీరని లోటు…

గుర్తింపు

శ్రీమతి ఇందిరా గాంధీ ఎన్నో విజయాలను అందుకున్నారు.

  • 1971లో “భారతరత్న” పురస్కారాన్ని స్వీకరించి, ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది.
  • 1953లో అమెరికాకు చెందిన మదర్స్ అవార్డును స్వీకరించారు.
  • 1967 – 68 సంవత్సరాలలో వరుసగా రెండుసార్లు ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ సి రా ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో అత్యంత అభిమాన మహిళగా అవార్డును అందుకున్నారు.
  • 1971లో జంతు సంరక్షణకు చేసిన కృషికి గాను అర్జెంటీనా సొసైటీ ఆమెకు డిప్లొమా ప్రధానం చేసింది.
  • 1971లో అమెరికాలోని ప్రత్యేక గ్యాలప్ పోల్ సర్వేలో అత్యంత అభిమాన నేతగా గౌరవం అందుకున్నారు.
  • 1972లో మెక్సికన్ అకాడమీ అవార్డు ఫర్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ పురస్కారాన్ని అందుకున్నారు.
  • 1973లో ఎస్ఏఓ రెండవ వార్షిక మెడల్ అందుకున్నారు.
  • 1976లో నగరి ప్రచారిణి సభకు చెందిన సాహిత్య వాచస్పతి అవార్డును అందుకున్నారు.

ఇందిరా ప్రధానిగా దేశానికి అందించిన సేవలు ఈనాటికీ మరువలేనివి. పేదరికాన్ని పారద్రోలే గరీబీ హటావో అనే నినాదానికి వాస్తవ రూపం ఇచ్చి నిరుపేదల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. విదేశాలతో మన సంబంధం బాంధవ్యాలను పెంచి, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇందిరమ్మ పేరు భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం ఉండి తీరుతుంది.

Read also…

Mother Theresah Biography in Telugu

CLICK HERE 

error: Content is protected !!