How does the pen work ? What is its history ?
History of PEN :: పెన్ (కలము) చరిత్ర
ఈ రోజు మనం రాస్తున్న పెన్ను ఎలా పనిచేస్తుంది? దాని చరిత్ర ఏమిటి? ఆ పెన్ను పని చేయడంలో ఇమిడియున్న సాంకేతికత ఏమిటో తెలుసుకుందాం…..
పెన్ (కలము):
కలము ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు. (How does the pen work ? What is its history ?)
చరిత్ర:
ఈ రోజు మనమెవ్వరం ఇంక్ పెన్ను వాడడం లేదు. కేవలం బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడుతున్నాంకదా… ఈ పెన్నుకు పూర్వ రూపమే ఇంక్ పెన్ను. దీనినే ఫౌంటెన్ పెన్ను అనికూడా అంటారు. దీని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో పక్షి ఈకను ఇంకులో ముంచి రాసేవారు. దీని రూపం ఇలా ఉండేది. కాని పర్యాటకుడైన లూయిస్ ఎడ్సన్ వాటర్ మన్ తన పర్యాటక అనుభవాలను గ్రంధస్థం చేయాలనే ఉద్దేశ్యంతో రాయడం మొదలుపెట్టాడు.
కాని అప్పటికి అందుబాటులోనున్న పెన్నులు ఇంకులో ముంచిరాయవలసివచ్చేది. దీనితో విసుగుచెందిన వాటర్మన్ ఒక నూతన పెన్నును కనిపెట్టాలనే ఆలోచనతో ఫౌంటెన్ పెన్నును కనిపెట్టి పేటెంటు కూడా పొందాడు. తరువాతి కాలంలో పెన్నుల వ్యాపారం మొదలు పెట్టి మంచి నాణ్యమైన పెన్నులు తయారు చేశాడు.
ఫౌంటెన్ పెన్ నిర్మాణము:
ఫౌంటెన్ పెన్ అనేది ఒక పాళీ (నిబ్) పెన్. ఇంకులో ముంచి రాసే పెన్లాగా కాకుండా అంతర్గతంగా ఒక ఇంకు రిజర్వా యర్ కలిగి యుంటుంది. ఈ రిజర్వాయర్నుండి ఇంకును ఒక ఫీడ్ ద్వారా పాళీ గ్రహించేలా, కేశనాళికా ప్రక్రియ, మరియు గురుత్వాకర్షణల కలయిక ద్వారా ఇంకును కాగితంపై నిక్షిప్తమయ్యేటట్లు చేస్తుంది. “ఫౌంటెన్ పెన్ పనిచేయడంలో ఇమిడియున్న సూత్రం కేశనాళికా ప్రక్రియ మరియు గురుత్వాకర్షణ”. ఫౌంటెన్ నుండి నీరు బయటకు చిమ్ముతున్నట్లుగా, ఈ పెన్ యొక్క పాళీ మద్యలో గల రంద్రంనుండిఇంకు పైకి చిమ్ముతూ ఉంటుంది కనుక ఈ పెన్నును ఫౌంటెన్ పెన్ అన్నారు
పాళీ నిర్మాణము:
పాళీలను మొదట్లో బంగారంతో తయారుచేసి దాని చివర ప్లాటినం నిజ్ను ఉంచేవారు. తరువాత అనేక లోహాలు, లోహ మిశ్రమాల ఆవిష్కరణ వల్ల నేడు మనం చూస్తున్న సాధారణ పాశీల రూపంలో తయారు చేస్తున్నారు. పార్టీ ఒక లోహపు ప్లేటు. దీనికి వివిధ రకాలైన ఆకారాలుంటాయి కాని ప్రాధమికంగా ఒక వెడల్పాటి, పొడవైన ప్లేటులాగా ఉండి చివర ఒక నిబ్ ను కలిగి ఉంటుంది. ఈ ప్లేటు మద్యలో ఒక సన్నని రంద్రం మరియు మరియు చీలిక బయటకు చిమ్ముతుంది. కాని ఈ పెన్నుల వాడకంలో ఒక ఇబ్బంది ఉండేది. అదేమిటంటే పాళీ నుండి తరచుగా ఇంకు కారుతూ ఉండేది.దీనిని నివారించుటకై బోస్టన్ లోని “కాస్ పెన్ మరియు ఇంక్” కంపెనీ వారు సీసామూతను పెట్టినట్లుగా ఇంకు రిజర్వాయరుకు పాళీని అమర్చారు. దీనివల్ల పాళీనుండి ఇంకు కారడం తగ్గించగలిగారు. ఇలా తయారైన సేఫ్టీ పెన్ ను వాటర్మన్ 1908 వ సంవత్సరంనుండి పెద్దఎత్తున తయారుచేయడం మొదలు పెట్టాడు.
ఇప్పుడు అనేక రకాలైన పెన్నులు అందుబాటు లోకి వచ్చాయి. కాలక్రమంలో ఇంకు పెన్నుల వాడకం బాగా తగ్గిపోయి ప్రస్తుతం బాల్ పాయింట్పన్నులు వాడడం మొదలు పెట్టారు. వీటి ఆవిష్కరణ ఎలా జరిగిందో తెలుసుకుందాం.
బాల్ పాయింట్ పెన్:
బాల్ పాయింట్ పెన్ అనేది ఒక చిన్న లోహపు బాల్ ద్వారా ఇంకు సరఫరాను నియంత్రించే ఒక కలము. ఇది ముంచిరాసే ఈక పెన్ను, ఫౌంటెన్ పెన్ను లకు ఒక ప్రత్యామ్నాయం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడే ఒక సాధారణ కలము. ఈ కలము యొక్క ఆవిష్కరణ 19వ శతాబ్దము చివరలో జరిగింది. జాన్. జె. లౌడ్ అనే ఒక వర్తకుడు ఈ పెన్నును 1888వ సంవత్సరంలో తయారుచేసి పెటెంట్ పొందాడు.
దీనిలో ఒక సన్నని ట్యూబులో అత్యధిక తలతన్యత గల ద్రవంగా ఇంకును నింపి, ఆ ట్యూబు చివర ఒక సన్నని లోహపు గొట్టం పెట్టి అందులో ఒక లోహపు బాల్(గుండు) ను ఉంచుతారు. ఇంకు ఈ ట్యూబు గుండా ప్రయాణించి సన్నని లోహపు గొట్టంలోనికి చేరుతుంది. ఈ గొట్టంలో నున్న బాల్ ఇంకుయొక్క ప్రవాహాన్ని నియంత్రించి సరియైన రీతిలో కాగితంపై పడేటట్లుగా చేస్తుంది. దీనిద్వారా ఇంకు లీకేజి గాని, ఫౌంటెన్ పెన్లోలాగా రిజర్వాయర్ లో ఇంకు నింపడం గాని చేయనవసరం లేకుండా, ముందుగా ఇంకు నింపబడిన రీఫిల్ ను తిరిగి అమర్చడం ద్వారా నిరంతరంగా వాడుకోవచ్చు. ప్రస్తుత తరుణంలో వీటి తయారీ మరింత చౌకగా మారి వాడి పడవేసే బాల్ పాయింట్ పెన్నుల వాడకం మరింత ఎక్కువైనది. ఒకరకంగా ఇది మంచిదే అయినప్పటికి, వాడి పడవేసే పెన్నులన్నీ ప్లాస్టిక్ తో తయారైనవి కావడం, వీటిని వాడిన తరువాత ఎక్కడ పడితే అక్కడ పడవేయడం ద్వారా భూమిపై ప్లాస్టిక్ నిల్వలు ఎక్కువౌతున్నాయి.
గళం విప్పే కలం:
మాట్లాడే పెన్నును ఆదర్శ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని ‘మల్టీమీడియా ప్రింట్ రీడర్ (ఎంపీఆర్)’ అంటారు. పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పకలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం.
స్టైలస్:
స్టైలస్ పెన్ అనేది సిరాను ఉపయోగించని ఒక వ్రాత పాత్ర , కానీ ప్రధానంగా వ్రాత ఉపరితలంలో గీతలు లేదా ఇండెంటేషన్‌లను సృష్టించడం ద్వారా గుర్తులను చేస్తుంది. అలాగే, చివరిలోని నిబ్ పదునైన మెటల్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. ఇటువంటి సాధనాలు రాయడం కంటే ఇతర రకాల మార్కింగ్ కోసం ఉపయోగించబడతాయి . ఇది టచ్‌స్క్రీన్‌లను ఉపయోగించినప్పుడు వేలిముద్రతో సాధారణంగా సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ ఖచ్చితత్వాన్ని సాధించడానికి ఉపయోగించబడుతుంది.
Read also..