Gramin Dak Sevak July-2024 Notification details
తపాలా శాఖలో 44,228 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారం గా ఉద్యోగం ఇవ్వనున్నారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టుల వరకు ఉన్నాయి. (Gramin Dak Sevak July-2024 Notification details)
Gramin Dak Sevak Notification పోస్టుల వివరాలు
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) డాక్ సేవక్
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.07.2024
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.08.2024
- దరఖాస్తు సవరణ తేదీలు : 06.08.24 నుండి 08.08.24 వరకు
మొత్తం పోస్టుల సంఖ్య: 44,228
తెలుగు రాష్ట్రాలలో పోస్టుల వివరాలు
Category | Andhrapradesh | Telangana |
UR | 656 | 454 |
OBC | 200 | 210 |
SC | 177 | 145 |
ST | 88 | 54 |
EWS | 194 | 97 |
PWD-A | 6 | 5 |
PWD-B | 20 | 5 |
PWD-C | 14 | 10 |
PWD-DE | 0 | 1 |
TOTAL | 1355 | 981 |
అర్హతలు
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- వయోపరిమితి కింద తప్పనిసరిగా అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
- కంప్యూటర్ నాలెడ్జ్ తోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
జీతం వివరాలు
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు జీతంగా చెల్లిస్తారు.
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు.
Gramin Dak Sevak (GDS) ఎంపిక విధానం
ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి, పోస్టులను కేటాయిస్తారు.
Detailed..
GDS July 2024 Notification
Post Consolidation
Official website CLICK HERE
Read also..