Good news to DSC-2003 Teachers
డీఎస్పీ-2003 టీచర్లకు శుభవార్త.. పాత పెన్నన్ వర్తింపునకు వివరాలు కోరిన ప్రభుత్వం..
డీఎస్సీ-2003 టీచర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. వీరిలో అర్హులకు పాత పెన్షన్ (OPS) విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లా విద్యా శాఖాధికారుల నుండి వివరాలు కోరింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1వ తేదీ నుంచి సీపీఎస్ అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు 2004 సెప్టెంబరు 1లోపు ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2004 జనవరి 31లోపు ఖాళీ అయిన పోస్సుల్లో 2004 సెప్టెంబరు 1 తర్వాత చేరిన వారికి ఈ సౌకర్యం కల్పించనుంది. 2004 సెప్టెంబరు 1 ముందు ఫలితాలు ప్రకటించి సెప్టెంబరు 1 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు, టీచర్లు వివరాలను వెంటనే ఆర్దిక శాఖకు పంపించేలా డీఈవోలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది..
Govt. Orders about DSC-2004 Teachers
DOWNLOAD
NPS TO OPS: Central Memo No:57, Dt:17/02/2020 &,03/03/2023 ప్రకారం డిసెంబర్ -22,2003 కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు OPS ను పునరుద్ధరిస్తూ ఆదేశాలు..
AP లో మెమో:57 అమలు పై ప్రభుత్వము వివిధ సందర్భాలలో ఇచ్చిన మెమోలు లు, సర్క్యులర్స్..
- తేది: 30/07/2020-మెమో 57 ద్వారా అమలు కోసం గ్రూప్ -2, నోటిఫికేషన్ 10/99 ద్వారా నియామకమైన వారి వివరాలు తెలపాలని ఆర్థిక శాఖ ఆదేశం
- తేది: 21/09/2020– మెమో:57 ద్వారా OPS అమలుకు అర్హులు అయిన వారి వివరాలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రిన్సిపల్ సెక్రెటరీ టు గవర్నమెంట్,స్కూల్ ఎడ్యుకేషన్ వారికి పంపడం జరిగినది.
- తేది: 08/08/2022– మెమో:57 ద్వారా OPS కు అర్హులు అయిన వెలగపూడి సచివాలయం ఎంప్లాయీస్ వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం
- తేది: 09/09/2022-మెమో:57 ద్వారా OPS అమలు ప్రక్రియ వేగవంతానికి 14/09/2022 న ALL HOD’S తో సమావేశం
- తేది: 26/09/2022-మెమో:57 ద్వారా OPS కు అర్హులు అయిన డిగ్రీ కాలేజ్ లలో పనిచేస్తున్న వారి వివరాలు రెండు రోజులలో ఇవ్వాలని ఆదేశం
- తేది: 07/10/2022– మెమో:57 ద్వారా OPS అమలుకు అర్హులైన ఉద్యోగుల వివరాలు 12/10/2022 లోపు ఇవ్వాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆదేశాలు.
- తేది: 28/10/2022– మెమో:57 ద్వారా OPS కు అర్హులు అయిన ఎయిడెడ్ ఉపాధ్యాయుల వారి వివరాలు పంపాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి ఆదేశం.
- తేది: 18/11/2022– మెమో:57 ద్వారా OPS కు అర్హులు అయిన TTD ఎంప్లాయిస్ వారి వివరాలు ఇవ్వాలని ఆదేశం.
- తేది: 04/01/2023– మెమో:57 అమలు నిమిత్తం DSC-2002,DSC-2003 నోటిఫికేషన్ వారి వివరాలు పంపమని తెలంగాణ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిని అడిగిన ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు.
- తేది: 31/01/2023– మెమో:57 ద్వారా OPS కు అర్హులు అయిన వారి పూర్తి వివరాలు పంపాలని రెవెన్యూ(ఎండోమెంట్),అగ్రికల్చర్, కోపరేటివ్, హైయర్ ఎడ్యుకేషన్,హెల్త్&మెడికల్ డిపార్ట్మెంట్ ల వారిని ఆదేశించిన ఆర్థిక శాఖ
- తేది: 09/03/2023– DSC -2002 ద్వారా సెలెక్ట్ అయ్యి 2006,2008,2009,2010&2012 లలో నియామకం అయిన హిందీ పండిట్ లకు మెమో:57 ద్వారా OPS వర్తింప చేయాలని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి స్పీకింగ్ ఉత్తర్వులు.
- తేది: 12/05/2023– 15/05/2023 లోపు మెమో:57 ద్వారా OPS కు అర్హులు అయిన రెగ్యులర్ టీచర్స్ వివరాలు పంపాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ HOD లకు ఆదేశం.
ఇప్పటికే మెమో:57 ద్వారా వేలాది మంది ఉద్యోగులను OPS లోకి మార్చిన కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు / సంస్థలు..
- సెంట్రల్ గవర్నమెంట్
- రైల్వే డిపార్ట్మెంట్
- ఢిల్లీ
- పంజాబ్
- కర్ణాటక
- గోవా
- జార్ఖండ్
- హర్యానా
AP DSC-2003 వారి సమాచారం మండల MEO ల ద్వారా సేకరించబడుతుంది. అందరూ తగు సమాచారం మీ మీ ఆఫీస్ వారికి వెంటనే పంపగలరు. వారు అడుగుతున్న సమాచారం లో ప్రధానంగా..
- డేట్ ఆఫ్ రిజల్ట్స్ (అన్ని జిల్లాలకు Announcement date of results:11/06/2004)
- డేట్ ఆఫ్ అప్పాయింట్మెంట్ (Date of appointment అనేది జిల్లా జిల్లాకు మారినది గమనించగలరు, appointment order మీద ఉంటుంది) లను తెలుపగలరు