Froots September-2023 children’s magazine
రచయితల ముందు మాట (Foreword of Froots magazine authors):
ఆకుపచ్చ గురువులు: చెట్టును చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది అంటారు తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఎందుకంటే తాను చేయగలిగింది ఏదో తన మానాన తను చేసుకుంటూ పోతుంది కాబట్టి. ఎవరి సాయం కోసమూ ఎదురుచూడదు కాబట్టి. ఎవరి పొగడ్తల కోసము అర్రులు చాచదు కాబట్టి. తన శక్తిని మాత్రమే నమ్ముకుంటుంది అందుకే ఆకాశాన్ని కమ్ముకుంటుంది కాబట్టి. నాకు చెట్టును చూస్తే చూడబుద్దేస్తుంది అని అంటారు ఆయన. అంబరాన్ని తాకేంత మర్రి చెట్టు ఆవగింజంత కూడా లేని విత్తనంలో దాగి ఉండడం కన్నా మించిన వినయ శీలత ఇంకెక్కడుంటుంది. రాళ్ల దెబ్బలు తగిలే కొద్దీ రెట్టించి మరీ కాపు కాసి కాయల బరువుతో కోసుకొండ్రా అంటూ కింది కిందికి వంగి పోవడం కన్నా మించిన దాతృత్వం ఇంకెక్కడుంటుంది. కరుడుగట్టిన రంపాలతో నేలంటా పరపరా కోసేసినా, మొలకెత్త వద్దంటూ యాసిడ్ పోసి తగలేసినా, పాతాళంలోంచి ప్రాణ శక్తిని పుంజుకుని మళ్లీ కళ్ళు తెరిచి చిగురెత్తడం కన్నా మించిన ధీరోదాత్తత ఇంకెక్కడుంటుంది.
పూల పరిమళాలతో గాలికి గంధాన్ని అద్ది కంటికి కనువిందు చేసి మనసుకు మందు వేయడంలో , ఎండ వేడికి సొమ్మసిల్లకుండా అక్కున చేర్చుకుని సేద తీర్చడంలో చెట్టును మించిన వైద్యం ఇంకెక్కడుంటుంది. తరువును మించిన గురువు ఇంకెవరు ఉంటారు. అందుకేనేమో జపాన్ విద్యా విధానంలో చెట్టు చుట్టు ఎన్నో పాఠాలు ఉంటాయి. చెట్టును పరిశీలించడం మొదలుపెడితే మెదడు కణాలు ఉత్తేజితమై సృజనాత్మక ఆలోచనలు పురుడు పోసుకుంటాయని, సున్నితమైన మనో ప్రవృత్తి అలవడుతుందని, మనుషులు శాంతికాముకులుగా మారతారని జపాన్ విద్యా పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఆ దిశగా మన ఉపాధ్యాయులలో కూడా ఆలోచనలు చిగురిస్తే ఎంత బాగుంటుందో కదా!
“ఫ్రూట్స్ సెప్టెంబర్ -2023 సంచిక” లో గల అంశాలు (Topics in “Fruits September -2023 magazine”) :
ఈ మాసపు ప్రత్యేకత Google, మెదడు గురించి మీకు తెలుసా..?, గేమ్ టైం – ఆడండి నేర్చుకోండి, చిత్రాల ఆధారంగా కథ చెప్పటం, ఈ మాసపు కథ అత్యాశ, మీ సమస్య- మా సమాధానం, నేను గీసిన చిత్రాలు, మీకు నా పేరు ఏంటో తెలుసా ? Action words (క్రియా పదాలు) మరెన్నో..
పిల్లలకు ఏవిధంగా ఉపయోగపడగలదు:
ఈనెల froots e-magazine పిల్లలలో ధారణ శక్తి (Memory power) పెంచడానికి ఉపయోగపడే రకరకాల ఆటలుతో మీ ముందుకు వచ్చింది. కేవలం బట్టీ పద్దతులతో ఎలాంటి ఆసక్తి లేకుండా భారంగా వల్లేవేస్తూ నేర్చుకునే పిల్లలను చురుకుగా ఉంచి జ్ఞాపక శక్తిని పెంచడంలో ఈ ఆటలన్నీ సహాయ పడతాయి.
“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకత (“Fruits e-magazine” specialty):
ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.
Froots September-2023 School children’s magazine
Read also..
Froots August-2023 School Children Magazine