Froots October-2023 children’s magazine

Froots October-2023 children’s magazine

Foreword of Froots October-2023 children’s magazine authors (రచయితల ముందు మాట)

కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇది శరీర ధర్మ శాస్త్రంలో ఒక కీలకమైన వ్యవస్థ. అవయవాల పనితీరును నిర్వహించే వ్యవస్థగా దీనిని పేర్కొంటారు. ఆరు నెలల శిశువును గమనించినట్లయితే కదిలి వస్తువులను చూస్తూ కళ్ళు తిప్పుతాడు. ఏడు నెలలు వచ్చేసరికి వస్తువులను పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకాస్త ఎదిగేసరికి చేతికి అందిన వస్తువులను విసిరి వేయడానికి సిద్ధపడతాడు. ఇవన్నీ కంటికి చేతికి మధ్య సమన్వయం సాధించటం ద్వారా అలవడే పనులు. చేతితో చేసే ప్రతి పని కంటితో సంబంధం కలిగినది గాని ఉంటుంది. అంధుల విషయంలో తప్ప మిగిలిన వారందరిలోనూ కంటికి చేతికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. Froots October-2023 children’s magazine

అచ్చన గాయలు ఆడే పిల్లలను గమనించండి. పైకి విసిరిన రాయి కిందికి వచ్చేలోగా రాయి కసకకుండా తీసుకోవడంలో, ఒడిసి పట్టుకోవడంలో కనిపించే ఒడుపు కన్ను చేయి కలసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది. వేగంగా వస్తున్న బంతిని బ్యాట్ తో లాగిపెట్టి కొట్టి సిక్స్ లు ఫోర్లు పరిగెత్తించాలంటే క్రికెట్ ఆడే ఆటగాడికి కన్ను చెయ్యి సమన్వయంతో పనిచేయించాల్సి ఉంటుంది. గాలిపటం ఎగరేయడంలో, గోలీలాట ఆడడంలో, బొమ్మలు గీయడంలో, ముగ్గు వేయడంలో, కలుపు తీయడంలో ఒకటేమిటి ఎక్కడ ఏ పని జరిగినా పని జరిగే ప్రతిచోట కన్ను చెయ్యి చట్టపట్టాలేసుకుని ముందుకెళుతుంటాయి. బాణం వేయడం లాంటి గురి చూసి కొట్టే సందర్భాల ను కన్ను చేయి సమన్వయానికి పరాకాష్టగా చెప్పవచ్చు.

నిజానికి నేర్చుకోవడం అంటే నేర్పరితనం సాధించడం. అంటే నైపుణ్యం పొందడం అని అర్థం. ఈత నేర్చు కోవాలి అంటే ఈత కొట్టాల్సిందే. ఈత గురించి కబుర్లు వింటే నో, ఈదులాడే వాడిని చూస్తూ కూర్చుంటే నో ఈత రాదు. పునాది విద్యలో చదువు అంటే నేర్చుకోవడమే. అంటే చేయడమే . కంటికి చేతికి లంకె కుదిరేలా చూసుకోవడమే. బిల్లంగోడు ఆడే పిల్లోడు కూసుగా ఉండే బిళ్ళ అంచును కొట్టి అది పైకి లేవగానే కోడు తో లాగిపెట్టి కొట్టి అల్లంత దూరాన పడేలా చేయడంలో ఉన్న లాఘవం కన్నా మించిన సంక్లిష్టత మన బడిలో నేర్పే అంకెలు అక్షరాలలో ఉండనే ఉండదు. అక్కడ ఆటలో పిల్లోడే ప్రధానం. ఇక్కడ చదువులో పిల్లోడు తప్ప మిగిలినవన్నీ ప్రధానం . ఈ చిత్రం అర్థం కానంతవరకు కన్ను దారి కన్నుదే చెయ్యి దారి చెయ్యిదే.

ఈ మాసపు ప్రత్యేకత – ఐక్యరాజ్య సమితి

ప్రపంచాదేశాలన్నీ యుద్ధాలు లేకుండా శాంతి యుతంగా మెలగడానికి దేశాల మద్య స్నేహ సంబంధాలు పెంపొందించి, ఆర్ధిక, సామాజిక అభివృద్ధి సాదించడానికి, మానవ జీవనం సజావుగా సాగడానికి ప్రపంచ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 1945 లో స్థాపించారు. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన అక్టోబర్ 24వ తేదీని ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి తన భాద్యతలన్నీ 6 ప్రధానభాగాలుగా నిర్వర్తిస్తుంది. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థలుగా ఉన్న WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుంది. UNISEF (యునిసెఫ్) అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నది. UNESCO (యునెస్కో) ప్రపంచ ప్రజలం జీవన ప్రమాణాలు పెంచడానికి కావలసిన శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకత (“Fruits e-magazine” specialty):

ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

Froots October-2023 School children’s magazine

DOWNLOAD

Read also..

Froots September-2023 School children’s magazine

CLICK HERE

Trending Information
error: Content is protected !!