Froots November-2023 children’s magazine

Froots November-2023 children’s magazine

Foreword of Froots November-2023 children’s magazine (రచయితల ముందు మాట)

“భూషలు గావు మత్యులకు, భూరిమయాంగద తార హారముల్ పురుషుని భూషితు చేయు పవిత్ర వాణి వాగ్భూషణమే సుభూషణము” అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి. నోటి మాట మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుంది. అదే నోటి మాట అధః పాతాళానికి తొక్కి వేస్తుంది. మంచిగా మాట్లాడడం మనిషికి అలవాడాల్సిన అతిముఖ్యమైన లక్షణం., సొంపైన మాటతీరు అలవాడాలి అంటే రకరకాల భావ ప్రకటనలు పరిచయంలోకి రావాలి. వినుసొంపైన మాటతీరుకు తగిన శిక్షణ ఎక్కడ లభిస్తుంది? అనుమానం ఎందుకు ? ఈ మహత్కార్యానికి బడిని మించిన ఇంకేముంటుంది? బాలలు మాటల మాంత్రికులు కావాలంటే బడిలో కథా ప్రపంచం వెల్లి విరియాలి.

మానవజాతి తన అనుభవాలను ఆలోచనలను అనుభూతులను దండ గుచ్చి తరువాత తరం మెడ లో మాలగా వేస్తుంది. ఈ క్రతువు అత్యంత సుకుమారంగా ముగ్ధ మనోహరంగా నిర్వహించడానికి మనిషి అనుసరించిన వ్యూహమే కథ. తనకు తారసపడ్డ ప్రతి సంఘటనను తన వారితో పంచుకోవడం మనిషి నైజం. ఇందుకోసం పదాలను పోగు చేసి మనసుకు హత్తుకునేలా చెప్పేందుకు చేసే ప్రయత్నంలో తాను తనివి తీరా తడిసి ముద్దయిపోతాడు. సంతోషం, కోపం, ఆశ్చర్యం అనుభూతి ఏదైతేనేం దృశ్యరూపం కాస్త శబ్ద చిత్రంగా మారిపోతుంది. మరింత ముందుకెళ్లి అక్షర రూపాన్ని ఎంచుకుంటుంది. కథలా సాక్షాత్కరిస్తుంది. అనుభూతులను ఆవాహన చేసుకున్న అక్షరం పదమై, వాక్యమై భాష సుగంధాలతో గుబాళిస్తుంది. చదువుతున్న పాఠకుడిని చేతులు చాచి స్వాగతిస్తుంది. అక్షరానికున్న సాంకేతిక పరిజ్ఞాన రహస్యం ఏమిటో తెలియదు కానీ, అది మనోఫలకంలో దృశ్య రూపంలోకి మారిపోయి కనికట్టు చేసి కట్టిపడేస్తుంది. అదే కథకు ఉన్న అపారమైన శక్తి.

పిల్లలను కథలను విడిగా చూడలేము. కథ వినకుండా కథ చెప్పకుండా పెరిగి పెద్దయిన మనిషి ఈ భూమి మీద ఉండడు. చందమామను చూపిస్తూ పాల బువ్వ తింటున్నప్పుడు, వెన్నెల వాకిట్లో తాతయ్య దుప్పటిలో దూరి కథ వింటూ నిద్రలోకి జారుకునే బాల్యం అమూల్యం. బడిలో కొచ్చాక సార్ కథ చెప్పండి అంటూ కాళ్ళ వేళ్ళపడడం మనోవికాసం కోసం బాలలు చేస్తున్న స్వీయశోధన యత్నం. కథ ఆలోచించడాన్ని నేర్పుతుంది. మాట్లాడడానికి తర్ఫీదునిస్తుంది. కథ బ్రతుకునిస్తుంది. బ్రతకడాన్ని నేర్పుతుంది. అందుకే అలనాటి శ్రీరామచంద్రుని మొదలు అబ్దుల్ కలాం దాకా మహోన్నతుల జీవితాలలో కథ ఎంతోప్రేరణ నిచ్చింది. శ్రవణ కుమారుడి కథ గాంధీజీని జాతిపితగా మార్చింది. జిజియా బాయ్ చెప్పిన కథ వీర శివాజీని ఛత్రపతిలా తీర్చిదిద్దింది. అందుకే కథను బాలలను భవిష్యత్తులోకి నడిపే దారి దీపం అంటారు. మన బడిలో కథా ప్రపంచం ఎంతగా వెల్లివిరుస్తుందో బాలల మనోవికాసం అంతగా శోభిల్లుతుంది.

“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకత (“Fruits e-magazine” specialty):

ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

Froots November-2023 School children’s magazine

DOWNLOAD

Read also..

Froots October-2023 School children’s magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!