Froots March-2024 children’s magazine

Froots March-2024 children’s magazine

Froots magazine ఈ మాసపు ప్రత్యేకతలు:

ఈనెల froots e-magazine ఎందరో త్యాగధనులైన, తమరంగాలలో ఖ్యాతిగడించిన స్త్రీమూర్తుల ఏకపాత్రాభినయాలతో మీ ముందుకు వచ్చింది.  వీటితో పాటు కథలు, TLM, మీ ప్రశ్న మా సమాధానం, పిల్లలు గీసిన చిత్రాలు మొదలైన వాటితో సిద్దంగా ఉంది. చిత్రాలపై నొక్కండి వీడియోలు చూడండి. దీనిని మీ పిల్లల what’s app గ్రూప్ లలో share చేసి వారికి అందుబాటులో ఉంచండి. (Froots March-2024 children’s magazine).

“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకత (“Fruits e-magazine” specialty):

ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

రచయితల ముందు మాట:

వెన్నెల చల్లదనాన్ని, వెన్నల మెత్తదనాన్ని, పువ్వుల కమ్మదనాన్ని రంగరించి రాశీభూతం చేస్తే రమణి లలామ రూపుదిద్దుకుంటుంది అని పల్లవిస్తాడు కృష్ణశాస్త్రి. అక్కలా, చెల్లిలా, అమ్మలా, అత్తలా పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోయి ఆప్యాయతానురాగాలు పంచడం ఆమెకే చెల్లు. పరికిణీల గరగరలు, గాజుల గలగలలు , అందెల సందడులతో ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతిరోజు పండుగే. పాత్రలు ఎన్ని ఉన్నప్పటికీ అమ్మగా అతివ పాత్ర అమోఘం, అనితర సాధ్యం. నవ మాసాలు మోసి, బిడ్డలను కని, పెంచి రేపటి తరానికి వారసులను అందించడంలో అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా సవాలక్ష పనులను తనకున్న రెండు చేతులను పది చేతులుగా మార్చుకొని ప్రతి పనిని చక్కబెట్టుకోవడంలో ఆమెకు సాటి లేరెవ్వరు. మల్టీ టాస్కింగ్ కు మహిళ నిలువెత్తు నిదర్శనం అని తేల్చారు. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు. అత్యున్నత స్థాయిలో అధికారిగా మహిళలు ఉన్న సందర్భంలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నట్లు ఆ సోచాం లాంటి ఎన్నో సంస్థల సర్వేలు తెలియజేస్తున్నాయి. పరిపాలన స్థానంలో మహిళలు ఉన్నప్పుడు పురుషుల కన్నా మెరుగైన విధాన నిర్ణయాలు రూపుదిద్దు కుంటాయని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అధికారానికి అమ్మతనం తోడైతే బంగారానికి సువాసన అబ్బినట్టు ఉంటుంది అధికారిణిగా కరకుదనం చూపించినప్పటికీ అంతరంగంలో కారుణ్యం కదలాడుతూనే ఉంటుంది.- మీ ఫ్రూట్స్ టీచర్స్ టీమ్

Froots March-2024 School children’s magazine

DOWNLOAD

Read also..

Froots February-2024 School Children Magazine

DOWNLOAD

Trending Information
error: Content is protected !!