Froots June-2024 School children’s magazine
“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకతలు (“Fruits e-magazine” specialty):
ఈనెల froots e-magazine పిల్లలు చదివిన మరియు చెప్పిన కథలతో మీ ముందుకు వచ్చింది. వీటితో పాటు కథలు, TLM, మీ ప్రశ్న మా సమాధానం, పిల్లలు గీసిన చిత్రాలు మొదలైన వాటితో సిద్దంగా ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు. దీనిని మీ పిల్లల what’s app గ్రూప్ లలో share చేసి వారికి అందుబాటులో ఉంచండి. ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. (Froots March-2024 children’s magazine).
Froots June-2024 School children’s magazine
రచయితల ముందు మాట:
జూన్ నెల బడికి చైత్రమాసం లాంటిది. పిల్లలంతా ఎల కోయిలలై కేరింతలు కొడుతూ పాఠశాల వృక్షం పై వాలే పర్వదినం అది. చదువులు ఒక పండుగలాగా సాగాలి అనే శుభసంకల్పంతో పిల్లలంతా పాఠ్యపుస్తకాల పూర్ణకుంభంతో కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికే శుభ సందర్భం ఇది. కొత్త తరగతి, కొత్త స్నేహితులు, కొత్త టీచర్లు, కొత్త పుస్తకాలు ఎటు చూసినా కొండంత కొత్తదనం విరబూసిన పారిజాత వృక్షంలో సుగందాల సొగసులీనుతూ ఉంటుంది.
కొందరికి బడి ప్రాంగణం ఆనందసంద్రం. మరికొందరికి అది విషాద సదనం. కొత్త లోకంలో ఇట్టే కలిసిపోయి కిలకిలలాడే పిల్లలు ఒకవైపు, నూతన ప్రపంచంలో అడుగిడి అమ్మ కొంగు వదలలేక వలవల ఏడ్చే పిల్లలు ఇంకొకవైపు. ఇద్దరినీ పొందికగా _పొదివి పుచ్చుకోవడంలో ప్రతి టీచర్ అసామాన్య మాతృ మూర్తిలా మారిపోయే మహోన్నత మధుర క్షణం ఇది. అమ్మ తనపు లాలనను అక్షరాలకు అలదుకొని చదువుల దారిలో చెయ్యి పట్టి నడిపించే తొలి అడుగుకు ప్రాణ ప్రతిష్ట జరిగే పవిత్ర క్షణం ఇది. రేపటి ప్రపంచానికి తలమానికంలా నిలబడే వ్యక్తిత్వపు మూర్తిమత్వాన్ని తీర్చి దిద్దే తపస్సు లో తొలి అర్ఘ్యం ఇది.
ఆర్థిక అసమానతలతో సంబంధం లేకుండా అంబానీ మొదలుకొని అపార్ట్మెంట్ వాచ్మెన్ వరకు ప్రతి ఒక్కరూ ఉన్నంతలో తమ బిడ్డలకు మంచి చదువు చెప్పించాలని ఆరాటపడతారు. తమ బిడ్డల భవిష్యత్తునకు బంగారు బాట వేసేది బడే అన్న ప్రగాఢ నమ్మకంతో తమ పంచప్రాణాలుగా భావించే బిడ్డలను బడిలో విడిచి పెడతారు తల్లిదండ్రులు. బడిలో చేరిన బిడ్డ మంచి మనిషిగా ఎదుగుతాడనే తల్లిదండ్రుల ఆశలకు ఊతమిస్తూ ప్రతి టీచరు అక్షర యజ్ఞాన్ని ఆరంభిస్తారు.
ప్రతి విద్యా సంవత్సరం పవిత్ర ఆశయంతోనే ప్రారంభమవుతుంది. అనుకున్న లక్ష్యాలు అందిపుచ్చుకోవడంలో గతం తాలూకు అనుభవాల పాఠాలను అమలు చేసుకుంటేనే మన ఆశయం సదాశయం అవుతుంది. లేకపోతే ఆశయం అతిశయంగా మిగిలిపోతుంది. ప్రారంభాలు ఆరంభ సూరత్వాలుగా కాకుండా ఉండాలంటే పట్టు సడలని లక్ష్య దీక్ష ఉండాలి. కార్యసిద్ధికి కంకణ ధారణ జరగాలి. అప్పుడే చదువుల చెట్టులో విద్యా వసంతం విరబూస్తుంది.
-మీ ఫ్రూట్స్ టీచర్స్ టీమ్
Read also..