Froots July-2023 children’s magazine

Froots July-2023 children’s magazine

“ఫ్రూట్స్ జూలై 2023 సంచిక” లో గల అంశాలు: ఈ మాసం ప్రత్యేకత : ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం, ఆటలతో గణితం నేర్చుకోవడం కోసం ప్రత్యేక వీడియోలు, స్థాన విలువల ఆట, ఎవరు గొప్ప నాటిక, మూడు చేపల కథ, మీకు తెలుసా ?, గేమ్ టైమ్: పజిల్ – ఆడండి నేర్చుకోండి, మీ ప్రశ్న – మా సమాధానం, మీకు నా పేరేంటో తెలుసా ? – పువ్వులు మరెన్నో.. (Froots July-2023 children’s magazine)

“ఫ్రూట్స్ e-మాసపత్రిక” లోని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

Froots July-2023 School children’s magazine

DOWNLOAD

Read also..

Froots June-2023 School Children Magazine

CLICK HERE

రచయితల ముందుమాట

     ఈ భూగోళం మీద మానవ సమాజాలన్నీ తమ ఉనికిని నిలుపుకోవడం కోసం, తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం నిరంతరం పరితపిస్తాయి. అందుకోసం పోరాడుతాయి. యుద్ధం చేస్తాయి. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడవు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద మళ్లీ నవ సమాజాన్ని నిర్మించుకొని స్వేచ్ఛ బావుటా ఎగరేస్తాయి. ఇది చారిత్రక సత్యం. స్వేచ్ఛ ఎవరికివారు పొందవలసినదా? ఎవరైనా ప్రసాదించవలసినదా? పోరాడితే తప్ప సాధించుకోలేనిదా? ప్రకృతి ప్రసాదించిన వరమా? ఇవేవీ కాకపోవచ్చు. స్వేచ్ఛ మానవుని జన్మహక్కు. శిశువు పౌరుడుగా స్వేచ్ఛగా ఎదగగలుగుతున్నాడా? అటు ఇంటిలోనూ ఇటు బడిలోనూ క్రమశిక్షణ పేరుతో ఎన్నో బంధనాలు. బడిలో జరిగే బోధన బాలల ఆలోచనలనే రెక్కలకు సంకెళ్లు వేసి ఎగర మంటుంది..

      కాళ్లు చేతులు కట్టేసి ఈదులాడమనీ అంటుంది. ప్రతి కదలికకు ప్రతి బంధకమే. దీనికి మనం అందంగా క్రమశిక్షణ అని పేరు పెట్టి పెత్తనం చెలాయిస్తుంటాం. స్వచ్ఛాపూరిత ఆలోచన సృజనాత్మక ఆవిష్కరణలకు ఆలవాలమని తెలిసినప్పటికీ వాటికి చోటు కల్పించడానికి బడి ఎందుకో భయపడుతూ ఉంటుంది .ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని పాలకులు కూడా భయపడుతూ ఉంటారు . ఈ భయాన్ని విడనాడడమే బడి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు నొక్కి ఒక్కాణిస్తుంటారు. ఎందుకంటే స్వేచ్ఛ ఉంటేనే సమానత్వం వెల్లివిరుస్తుంది. సౌబ్రాతృత్వం వెళ్ళునుకుంటుంది. స్వేచ్ఛ అంటే చిత్తం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు . బాధ్యతతో వ్యవహరించడం. నిబద్ధతతో కృషి చేయడం అనే గుణగణాలు బడి నేర్పాలి. అది అసలు సిసలైన స్వతంత్రోత్సవం.

Sharing is caring!

error: Content is protected !!