Froots February-2024 children’s magazine

Froots February-2024 children’s magazine

Froots magazine ఈ మాసపు ప్రత్యేకతలు:

ఈనెల FROOTS e- magazine జాతీయ సైన్స్ దినోత్సవం గురించిన సమాచారం తో మీ ముందుకు వచ్చింది, అలానే ఈ మాసపు కథ: ఏ కాలు ది నేరం ?, గేమ్ టైం: ఆడండి నేర్చుకోండి, మీ సమస్య – మా సమాధానం కు డాక్టర్ టీవీఎస్ రమేష్ గారి సమాధానాలు, TLM, మీకు నా పేరు ఏంటో తెలుసా ?, ఆటలు మరియు క్రీడలు వంటి విషయాలతో మీ ముందుకు వచ్చింది . (Froots February-2024 children’s magazine) .

“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకత (“Fruits e-magazine” specialty):

ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

రచయితల ముందు మాట:

ఈ సజీవ ప్రపంచంలో మనిషిని సమస్త జీవజాలం నుండి వేరు చేసి చూపే సాధన మే ఆలోచన. ఇది మనిషికి మాత్రమే పరిమితమైన అద్భుత శక్తి. తన జ్ఞానేంద్రియాలతో ప్రకృతిని పరిశీలించి దానికి తన ఆలోచనలను జోడించి విషయాన్ని విశ్లేషించి నూతన ఆవిష్కరణ చేయడమే మనిషి నైజం . ఇది ఒక సహజాతం. అందుకే ఈ భూమి మీద మానవ ఆవిర్భావం జరిగినది మొదలు నేటి వరకు మానవ మస్తిష్కం లో నుండి నిరంతరం జ్ఞాన సృష్టి జరుగుతూనే ఉంది. ఈ నిరంతర జ్ఞాన ప్రవాహం సమస్యలను తరచి చూడడం వాటికి పరిష్కారాలు కనుగొనడంలో మనిషి సంతృప్తి చెందేలా దోహదపడుతుంది. అయితే ఏ సమస్యకు అలవోకగా పరిష్కారం లభించదు దాని వెనుక అవధులు లేని ఓరిమి, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, ఎన్నో ఏళ్ల కృషి దాగి ఉంటాయి. ఉదాహరణకు మన చుట్టూ బోలెడన్ని మొక్కలు ఉన్నాయి. ఏ ఆకులు తినవచ్చు ఏ ఆకులు తినకూడదు తెలుసుకోవడానికి మన ముందు తరాల వాళ్ళు ఏళ్ల తరబడి ఎన్నో ప్రయోగాలు చేసి మరెన్నో ప్రయత్నాలు చేసి ఉంటేనే తోటకూర తినవచ్చు అని, పత్తి ఆకులు పనికిరావు అని నిర్ధారణకు వచ్చి ఉంటారు. -మీ ఫ్రూట్స్ టీచర్స్ టీమ్

Froots February -2024 Magazine

DOWNLOAD

Read also..

Froots January -2023 School Children Magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!