Froots December-2023 children’s magazine
Froots magazine ఈ మాసపు ప్రత్యేకతలు:
గణిత దినోత్సవం, Puzzle: fraction flowers, ఈ మాసపు కథ: భీముడు – బకాసురుడు, గేమ్ టైం: ఆడండి – నేర్చుకోండి, Unscramble the house , మీ సమస్య – మా సమాధానం, మేము చేసిన చిత్రాలు, Human rights day, నేను గీసిన చిత్రాలు, మీకు నా పేరు ఏంటో తెలుసా: Birds / పక్షులు (Froots December-2023 children’s magazine) మరెన్నో..
“ఫ్రూట్స్ e-మాసపత్రిక” ప్రత్యేకత (“Fruits e-magazine” specialty):
ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.
Foreword of Froots December -2023 children’s magazine (రచయితల ముందు మాట)
కనుచూపుమేరలో పరిష్కారం కానరాని ఆలోచనలు అతలాకుతలం చేస్తున్నప్పుడు, కష్టాలన్నీ కట్ట కట్టుకుని వచ్చి ముంచెత్తి ముప్పేటగా దాడి చేసి ముప్పిరిగొన్నప్పుడు మనిషి స్వాంతన కోరుకుంటాడు. అలాంటి సందర్భంలో ఆత్మీయతతో కూడిన ఓ పలకరింపు గ్రీష్మంలో రాలిన చినుకులా తల్లడిల్లుతున్న తనువునూ మనసునూ తెప్పరిల్ల చేస్తుంది. తిరిగి తలెత్తుకు నిలబడేలా చేస్తుంది. అది మాటమహిమ. అది మాటకున్న మహత్తు. ఆ మాటలు వెలలేనివి,విలువ కట్టలేనివి. అలాంటి మాట పన్నీటి జల్లు. తేనెల సోన. వెన్నెల వాన. ఈ జగత్తు సమస్తం అలాంటి మాటలకు దాసోహం అంటుంది. మాటలకు మూలమైన మనిషిని అందలమెక్కిస్తుంది.
తిరగేసి చూస్తే మాట ఒక మారణాయుధం. ఒక్కొక్కసారి భస్మాసుర హస్తమై అతః పాతాళానికి అణిచివేస్తుంది. పెదవి దాటిన మాట పృద్వి దాటుతుంది అంటారు. కాలు జారినా కడుక్కో వచ్చేమో గానీ నోరు జారితే ఇక అంతే సంగతులు. ఊబిలో కాలు పెట్టినట్లే. కూరుకుపోవడం తప్ప కోలుకోవడం ఉండదు. అంటే మాట రెండు వైపులా పదునున్న చురకత్తి లాంటిది అన్నమాట. అందలమెక్కించినా అధ పాతాళానికి అణచివేసినా దానికే చెల్లు. (పూర్తి వివరణ క్రింద ఇచ్చిన pdf లో చూడగలరు..)
Froots December -2023 School children’s magazine
Read also..