Froots August-2023 Magazine

Froots August-2023 children’s magazine

రచయితల ముందు మాట

ఉన్నఫలాన దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకోమంటే ఎలాంటి తడబాటు లేకుండా ప్రతి ఒక్కరూ నా బాల్యాన్ని నాకు ఇచ్చేయమని కోరుకుంటారట. ఎందుకంటే బాల్యమంత అందమైనది, సుందరమైనది, ఆహ్లాద భరితమైనది మరొకటి లేదు. బాల్యాన్ని దాటుకొని యవ్వనం మీద నుండి జీవితంలోకి ఎగిరిపోయాక చిన్నప్పుడు నీకు బాగా భారంగా అనిపించిన అంశం ఏమిటని అడిగితే ఎలాంటి తొట్రపాటు లేకుండా బడికి వెళ్లడం అని జవాబు చెబుతారట. అంత అందమైన బాల్యంలో చంద్రుడిలో మచ్చలా బడి మిగిలిపోవడం చాలా బాధాకరం. బాల్యాన్ని బడిని విడదీసి చూడలేము. బతుకు పోరాటానికి బడి తర్ఫీదునిస్తుంది.

మందుబిళ్ళ ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. వ్యాధి కుదురుకోవాలంటే చేదు మందు తప్పదు. బడి కూడా చేదు మందు లాంటిదేనా కాలం గడిచే కొద్దీ బడి నాలుగు గోడల మధ్య బందీ అయింది. చివరాఖరికి పాఠ్యపుస్తకాల్లోకి దూరి బతుకునుండి పూర్తిగా మాయమైపోయింది. మనకు తెలిసిన బడి వల్లి వేయించడంలో హుంకరిస్తుంటుంది. పరీక్షలు పెట్టడంలో కన్నెర్ర చేస్తుంటుంది. ఆ బడిలో కళ్ళు వింటుంటాయి. చెవులు చూస్తుంటాయి. చేయడానికి ఏమీ లేక చేతులు, కదలడం మర్చిపోయి కాళ్లు పట్టపగలు కమ్ముకు వచ్చిన కారు చీకట్లలో వినయం పేరిట క్రమశిక్షణను సాధన చేస్తూ చదువు సాగిస్తుంటాయి. అరక దున్నడం కంటే అక్షరాలు నేర్చుకోవడం అంత కష్టమా? సారె తిప్పడం కంటే లెక్కలు చేయడం అంత కష్టమా? బతుకు బడిలో ఓటమిని ఎరుగని పిల్లవాడు చదువుల బడిలో ఎందుకు చతికిలబడుతున్నాడు. ఈ కారు చీకట్లు బడిలో నుండి అతి ముఖ్యమైనది ఏదో దానినే మింగేసాయి.

చీకట్లు తొలగి అసలు సిసలు వెలుగు పుట్టదా …? నిజమైన అర్థంలో బడి మళ్లీ మొలకెత్తదా…? చీకటిలో చిరుదివ్యలు వెలిగించేవాడే గురువు అంటారు. ఆ గురువు ఎక్కడున్నాడో…. ! ఏమిచేస్తున్నాడో…. ! ఆయన కోసం లోకం ఆర్తిగా ఎదురుచూస్తోంది.

“ఫ్రూట్స్ ఆగష్టు 2023 సంచిక” లో గల అంశాలు:

ఈ మాసం ప్రత్యేకత – స్వాతంత్ర్య దినోత్సవం, ఆటలతో తెలుగు, English, గణితం నేర్చుకోవడం కోసం ప్రత్యేక వీడియోలు, ఆడుతూ నేర్చుకుందాం, English sentences, చిత్ర కథ, ఈ మాసపు TLM, మీ సమస్య- మా సమాధానం, No bag day activities , నేను గీచిన చిత్రాలు, మీకు నా పేరేంటో తెలుసా ? – సముద్ర జీవులు వాటి విజయాలు మరెన్నో..

పిల్లలకు ఏవిధంగా ఉపయోగపడగలదు:

ఇవి పిల్లలలో రాత నైపుణ్యాలను, రాయడం పట్ల ఇష్టాన్ని కలిగించడం, అదేవిధంగా రాయడానికి అవసరమైన కండర సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడే pre writing activities పెంపొందించడం లో తోడ్పడతాయి..“ఫ్రూట్స్ e-మాసపత్రిక” లోని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి విషయాన్ని మీరు వీడియోలో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు పత్రిక లో ఇవ్వబడిన చిత్రాలపై క్లిక్ చేసిన సంబంధిత వీడియో ను వీక్షించవచ్చు.

Froots August-2023 School children’s magazine

DOWNLOAD

Read also..

Froots July-2023 School Children Magazine

CLICK HERE 

error: Content is protected !!