EPFO recruitment-2023 Notification details

EPFO Social Security Assistant, Stenographer recruitment-2023 Notification details

న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) దేశవ్యాప్తంగా రెగ్యులర్‌ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో-రీజియన్ల వారీగా సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ (SSA),స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు, ఉద్యోగ అర్హతలు, వయసు, జీత భత్యాలు:

సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు : 2674 పోస్టులు (ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌లో 39, తెలంగాణ రీజియన్‌లో 116 ఖాళీలు)

సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ పోస్టుల కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎన్‌సీఎల్ ) లకు 514, ఈడబ్యూఎన్‌లకు 529 , అన్‌ రిజర్వ్‌డ్ కు 999  కేటాయించారు.

సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ పోస్టుల ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేన్ట్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్‌ టైపింగ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో 150 ప్రశ్నలకు 600 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రండున్నర గంటలు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌(30 ప్రశ్నలు), జనరల్‌ నాలెడ్డ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌(30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ(30  ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌(50 ప్రశ్నలు), కంప్యూటర్‌ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.

సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ (SSA),స్టెనోగ్రాఫర్ పోస్టుల దరఖాస్తు రుసుము: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్భలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్‌ దరఖాస్తు/ రిజిస్టేషన్‌ తేదీలు: 27-03 -2023  నుంచి 26  -04-2023  వరకు.

దరఖాస్తు సవరణ తేదీలు: 27-04-2029 నుంచి 28-04-2029 వరకు.

పూర్తి నోటిఫికేషన్: CLICK HERE

వెబ్‌సైట్‌: www.epfindia.gov.in

Trending Information

Leave a Comment

error: Content is protected !!