Mission vatsalya Scheme details in Telugu

Enrolment of children for SPONSORSHIP under Mission vatsalya / ICPS Scheme details

మిషన్‌ వాత్సల్య ముఖ్య ఉద్దేశం ?

భారత ప్రభుత్వం, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న “మిషన్‌ వాత్సల్య” పధకంలో భాగంగా వున్న స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రాం ద్వారా నిరాదరణకు గురైన అవసరతలతో ఉన్న బాలలకు వారి యొక్క విద్య , ఆరోగ్యం మరియు అభివృద్ది అవసరాలకు ఉపయోగపడే విధముగా ఆర్థికముగా ఆదుకోవడానికి షరతులతో కూడిన ఆర్థిక సహాయమును అందించటము.

ఎవరు అర్హులు ?

అనాధలు, అభాగ్యులు, తల్లిదంద్రులు కోల్పోయిన వారు, తల్లిదంద్రులు దూరమైన వారు, పాక్షిక అనాధలు (తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారు) విడాకులు పొందిన తల్లిదంద్రులు వున్నవారు, కుటుంబం వదిలివేసిన, తల్లిదంద్రులు ప్రాణాంతక వ్యాధి బారిన పదినా, పేదరికంతో ఇంటి పెద్దను కోల్పోయిన, బాలల న్యాయ ఆదరణ మరియు సంరక్షణ చట్టం – 2015 ప్రకారం ఇల్లు లేని పిల్లలకు, ప్రకృతి వైపరిత్యానికి గురి అయిన బాలల, బాల కార్మికులు, అక్రమ రవాణాకు గురైన బాలలు, కుటుంబ వాతావరణంలో పెరగటానికి విర్ధిష్ట పరిధిలో ఒక్కొక్కరికి నెలకు రూ.  4000/లు చొప్పన “మిషన్‌ వాత్సల్య పధకం” ద్వారా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం మండి నిధులు విడుదల చేయబడతాయి.

దరాఖాస్తు చేయు విధానం :

పైన తెలిసిన కేటగిరిలో ఉన్న అభ్యర్థులను గ్రామ మహిళాకార్యదర్శి/ అంగన్‌వాడి కార్యకర్త/ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మరియు ఇతరుల చ్వారా గుర్తించి ఆ బాలల వివరాలను కుటుంబ నేపధ్యంను, అర్ధిక, సామాజిక, ఆరోగ్య స్థితిగతులను మరియు విద్య కొనసాగించు వివరాలను తెలియపరుస్తూ ఉన్న దరఖాస్తు ఫారంను పూర్తి చేసి సంబంధిత దృవప్రతములను జతపరచి వారి పరిధిలో ఉన్న ఐ.సి.డి.యస్‌ ప్రాజెక్ట్‌ అధికారి (సి. డి. పి. ఒ) వారి కార్యలయంలో దరాఖస్తు చేయవలెను.

జతపరచవలసిన పత్రములు :

  1. బాలుడు/ బాలిక జనన దృవీకరణ పత్రము
  2. బాలుడు / బాలిక ఆధార్‌ కార్డు
  3. తల్లి ఆధార్‌ కార్డు
  4. తండ్రి ఆధార్‌ కార్డు
  5. తల్లి/ తండ్రి మరణ దృవికరణ పత్రము మరియు మరణ కారణము
  6. గార్డియన్‌ ఆధార్‌ కార్డు
  7. రేషన్‌ కార్డు
  8. బాలుదు/ బాలిక పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో
  9. ప్టదీ సర్టిపికెట్‌ ( స్కూల్‌ లో ప్రస్తుతం చదువుచున్నది)
  10. ఆదాయ ద్భవికరణ పత్రం (రూరల్‌ అభ్యర్థులకు 72,000/- అర్బన్ అభ్యర్థులకు 96,000/- లోపు ఆదాయం ఉందాలి)
  11. బ్యాంక్‌ అకౌంట్‌ వివరములు (బాలుదు / బాలిక ఇండివిడ్యువల్ ఆకౌంట్‌ లేక తల్లి / తండ్రి/ సంరక్షకుల తో జాయింట్‌ అకౌంట్‌)

Format for enrollment of children for SPONSORSHIP under Mission vatsalya / ICPS Scheme (Application form)

CLICK HERE

Mission vatsalya Scheme full details in Telugu (CDPO’s letter )

CLICK HERE

Sharing is caring!

Trending Information

Leave a Comment

error: Content is protected !!