Employees Income Tax Softwares-2024
ఆదాయపుపన్ను లెక్కించు విధము – సమీక్ష
Old INCOME TAX Regime
Employees Income Tax Softwares 2024: Finance Act- 2023 ప్రకారము ది. 1-4-2023 నుండి 31-3-2024 వరకు వర్తించే విధంగా ఆదాయపుపన్ను చట్టము (1961)లో 2023-2024 ఆర్థిక సం.నకు ఉద్యోగుల జీతాదాయమునకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నవి. వాటిని పరిశీలిద్దాం.
2023-2024 ఆర్థికసంవత్సరము మరియు 2024-25 మదింపు సం.నకు ఆదాయపు పన్ను శ్లాబులు:-
కేటగిరీ | శ్లాబు | పన్నురేటు |
60 సం. లోపు పురుషులకు | రూ.2,50,000 వరకు | పన్ను లేదు |
రూ.2,50,001 నుండి 5 లక్షల వరకు | 5% |
రూ.5,00,001 నుండి 10 లక్షల వరకు | 20% |
రూ. 10 లక్షల పైన | 30% |
60 సం. లలోపు మహిళలకు | రూ.2,50,000 వరకు | పన్ను లేదు |
రూ.2,50,001 నుండి 5 లక్షల వరకు | 5% |
రూ.5,00,001 నుండి 10 లక్షల వరకు | 20% |
రూ.10 లక్షల పైన | 30% |
60సం.ల పైన 80సం. లలోవు అందరకు | రూ.3 లక్షల వరకు | పన్ను లేదు |
రూ.3 లక్షల నుండి 5 లక్షల వరకు | 5% |
రూ.5,00,001 నుండి 10 లక్షల వరకు | 20% |
రూ. 10 లక్షల పైన | 30% |
80సం. ల పైన అందరకు | రూ.5 లక్షల వరకు | పన్ను లేదు |
రూ.5,00,001 నుండి 10 లక్షల వరకు | 20% |
రూ.10 లక్షల పైన | 30% |
ఆరోగ్య మరియు విద్యాసెస్సు :- చెల్లించవలసిన ఆదాయపుపన్నుపై 4% |
New INCOME TAX Regime U/s 115 BAC
భారత ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో ఆదాయ పన్ను చట్టము 1961 లో 115 BAC అనే కొత్త సెక్షన్ ను నూతనంగా పొందుపరచినది. దీనినే New Income Tax Regime అంటారు. పాత పద్ధతిలో ఆదాయపన్ను గణన అలాగే ఉంచుతూ 2020-21 నుండి ఈ New Regime ను హిందూ అవిభాజ్య కుటుంబాల వ్యక్తుల ఆదాయపన్ను మదింపును ఐచ్ఛికంగా (optional) అనుసరించుటకు వీలుగా ఈ నూతన సెక్షన్ వెసులుబాటు కల్పించింది. ఈ నూతన సెక్షన్ లో ఆదాయపన్ను శ్లాబును 2023-24 ఆర్థిక సం. నుండి ప్రస్తుతం ఉన్న 7 స్లాబ్ల నుండి 6 స్లాట్లకు తగ్గించబడింది. వ్యాపార పరంగా వచ్చిన ఆదాయంనకు ఈ నూతన విధానం వర్తించదు. ఈ నూతన సెక్షన్ వలన వ్యక్తులకు నికర ఆదాయం 7 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు. రూ.7 లక్షల నికర పన్ను చెల్లించే ఆదాయం ఉన్న వారికి గరిష్టంగా రూ.25,000/- ల వరకు రిబేట్ను U/s 87 A ద్వారా కల్పించబడినది. ఈ నూతన ఇధానములోని శ్లాబులు వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా ఉండును.
నూతన సెక్షన్ 115 BAC (New Regime) ముఖ్యాంశాలు
New Regime IT slabs for F.Y. 2023-24 on optional Basis |
Common Slabs for Individuals, HUF, Senior Citizens & Super Senior Citizens |
Slab | Rate |
Up to Rs. 3 Lakhs | Nil |
3 Lakhs – 6 Lakhs | 5% |
6 Lakhs – 9 Lakhs | 10% |
9 Lakhs – 12 Lakhs | 15% |
12 Lakhs – 15 Lakhs | 20% |
Above 15 Lakhs | 30% |
Employees Income Tax Softwares 2024 for FY 2023-24
Latest softwares (Updated on 9th Feb 2024)
Old softwares (Updated on 28th Dec 2023)
Method of Computation of Income Tax – Review by Mani sir
DOWNLOAD