DSC 6th Class Science LIGHT SHANDOWS AND REFLECTIONS Practice Bits
6వ తరగతి సామాన్య శాస్త్రం “కాంతి, నీడలు మరియు పరావర్తనాలు” ప్రాక్టీస్ బిట్స్
6వ తరగతి సైన్స్ పాఠ్యభాగం ” కాంతి, నీడలు మరియు పరావర్తనాలు” కాంతి యొక్క ప్రవర్తన, నీడల ఏర్పడటం మరియు అద్దాలలో ప్రతిబింబాలు ఏర్పడే విధానాన్ని వివరిస్తుంది. ఈ పాఠం విద్యార్థులకు వెలుగు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. (DSC 6th Class Science LIGHT, SHANDOWS AND REFLECTIONS Practice Bits)
01) అక్షరాల ఆకారంలో రంధ్రాలు కలిగిన ఇనుప స్కేలు గుండా కాంతిని పంపుతూ, ఆయా రంధ్రాలు గోడపై ఏర్పరచే చిత్రాలను గమనిస్తున్నాడు శ్రీకంఠం. A – B – C – D అనే నాలుగు అక్షరాలను గమనించినపుడు గోడపై చిత్రం కూడా ఎటువంటి తారుమారు లేకుండా ఏర్పడే అక్షరాలు ఎన్ని
- ఒకటి మాత్రమే
- రెండు మాత్రమే
- మూడు మాత్రమే
- నాలుగు మాత్రమే
02) క్రింది వాక్యాలను పరిశీలించండి
ఎ) కాంతి లేకుండా మనం వస్తువులను చూడలేము.
బి) వస్తువులను చూడటానికి కాంతి మనకు సహాయపడుతుంది.
సరియైన సమాధానం గుర్తించండి
- ఎ సరియైనది, బి సరికానిది
- ఎ సరియైనది, బి సరియైనది
- ఎ సరికానిది, బి సరికానిది
- ఎ సరికానిది, బి సరియైనది
03) నిశ్చితం: సూర్యుడు ఒక ప్రకాశవంతమైన వస్తువు
కారణం: తమకు తాముగా కాంతిని ఉత్పత్తి చేసే వస్తువులను ప్రకాశవంతమైన వస్తువులు అంటారు.
సరియైన సమాధానం ఎంచుకోండి
- నిశ్చితం, కారణం రెండూ సరియైనవి మరియు నిశ్చితానికి, కారణం సరియైనది
- నిశ్చితం, కారణం రెండూ సరియైనవి కానీ నిశ్చితానికి, కారణం సరియైనది కాదు
- నిశ్చితం సరియైనది కానీ కారణం సరియైనది కాదు
- నిశ్చితం సరియైనది కాదు కానీ కారణం సరియైనది
04) క్రింది వాక్యాలను పరిశీలించండి
ఎ) పెన్సిల్ ద్వారా వస్తువును చూసినపుడు అవతలి వస్తువును చూడటం సాధ్యం అవుతుంది.
బి) గాజు గ్లాసు ద్వారా వస్తువును చూసినపుడు అవతలి వస్తువును చూడటం సాధ్యం అవుతుంది.
సి) నీటి అడుగున ఉన్న వస్తువును పై నుంచి చూడటం సాధ్యం అవుతుంది.
సరియైన సమాధానం గుర్తించండి
- ఎ, బి మాత్రమే సరియైనవి, సి సరికానిది
- బి, సి మాత్రమే సరియైనవి, ఎ సరికానిది
- ఎ, సి మాత్రమే సరియైనవి, బి సరికానిది
- ఎ, బి మరియు సి మూడూ సరియైనవే
05) చీకటి గదిలో ఉన్న బంతిని టార్చిలైటు సహాయంతో వెతకడానికి జీవా వెళ్లాడు
- బంతిపై టార్చి వెలుగు పడినపుడు బంతి కనిపిస్తుంది
- జీవా కంటిపై టార్చి వెలుగు పడినపుడు బంతి కనిపిస్తుంది
- గోడపై టార్చి వెలుగులను ప్రసరింపచేయడం ద్వారా బంతిని గుర్తించగలడు
- అద్దంపై టార్చి వెలుగును ప్రసరింపచేయడం ద్వారా బంతిని గుర్తించగలడు
06) ఒక సరళమైన పెరిస్కోపు తయారుచేయడానికి అవసరం అయినది
ఎ) పొడవైన పైపుముక్కలు మూడు
బి) సమతల దర్పణాలు రెండు
సి) గోళాకార దర్పణము ఒకటి
సరియైన సమాధానం గుర్తించండి
- ఎ, బి మాత్రమే సరియైనవి, సి సరికానిది
- బి, సి మాత్రమే సరియైనవి, ఎ సరికానిది
- ఎ, సి మాత్రమే సరియైనవి, బి సరికానిది
- ఎ, బి మరియు సి మూడూ సరియైనవే
07) ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మళ్ళే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు?
- నీడ
- పారదర్శకత
- పరావర్తనం
- లేజర్
08) ఒక వస్తువు నీడను ఏర్పరుస్తున్నది అంటే
ఎ) అది ఒక కాంతి పారదర్శక పదార్ధం కావచ్చు.
బి) అది ఒక కాంతి అపారదర్శక పదార్ధం కావచ్చు.
సి) అది ఒక కాంతి నిరోధక పదార్ధం కావచ్చు
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఎ మరియు బి
- బి మరియు సి
09) సూర్యకాంతి సముద్రంలో సుమారు ఎన్ని అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది?
- 262
- 245
- 238
- 250
10) చీకటి చేయబడిన గదిలో ఒక బంతిని, టార్చిలైటుకు ఎదురుగా ఉంచబడినది. అయితే ఏర్పడే నీడ
- నల్లని వృత్తము
- తెల్లని వృత్తము
- నల్లని కంకణము
- తెల్లని కంకణము
సమాధానాలు : 1-4: 2-2: 3-1: 4-2: 5-1: 6-1; 7-3: 8-4: 9-1: 10-1
Read also…