DSC 6th Class Science Getting to know plants Practice bits

DSC 6th Class Science Getting to know plants Practice bits

6వ తరగతి సామాన్య శాస్త్రం “మొక్కల గురించి తెలుసుకోవడం” ప్రాక్టీస్ బిట్స్ 

6వ తరగతి “మొక్కల గురించి తెలుసుకోవడం” (Getting to Know Plants) పాఠం, విధ్యార్ధులకు వృక్షాల గురించి ప్రాథమికమైన అవగాహన ఇవ్వడం లక్ష్యంగా ఉంది. ఇందులో వృక్షాల భాగాలు, వాటి కార్యాలు, వృక్షాలను విభజించడం మరియు వృక్షాల వృద్ధి, పెంపకం వంటి అంశాలను చర్చించబడింది. వృక్షాల రకాలు, అవి ఎలా పెరుగుతాయో, వాటి ఉపయోగాలు మరియు వివిధ వృక్షాల ప్రాముఖ్యత గురించి వివరణాత్మకంగా తెలియజేయబడింది. ఈ పాఠం ద్వారా విధ్యార్ధులు వృక్షాలపై ఆసక్తి పెంచుకొని, పర్యావరణానికి వాటి ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోగలుగుతారు. (DSC 6th Class Science Getting to know plants practice bits)

01) పంట పొలాలు, పచ్చిక బయలు లేదా కుండీలలో తరచుగా పెరిగే అవసరం లేని మొక్కలను ఇలా పిలుస్తారు.

  1. కలుపు మొక్కలు
  2. సేద్యపు మొక్కలు
  3. సేంద్రియ మొక్కలు
  4. నిరీంద్రియ మొక్కలు

 02) వికసించిన పుష్పంలో వివిధ రంగులతో ఆకర్షణీయంగా కనిపించే పత్రాలను ఇలా పిలుస్తారు.

  1. రక్షక పత్రాలు
  2. ఆకర్షక పత్రాలు
  3. సంధాన పత్రాలు
  4. క్షేత్రీయ పత్రాలు

03) ఈ ఆకారపు పుష్పాలలో లోపలి భాగాలను స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంటుంది.

  1. బల్లపరపు ఆకారపు పత్రాలు
  2. వలయాకారపు పత్రాలు
  3. గంటాకారపు పత్రాలు
  4. స్థూపాకారపు పత్రాలు

04) పుష్పంలోని అన్నింటికిన్నా లోపలి భాగాన్ని

  1. కేసరము అంటారు.
  2. కీలాగ్రము అంటారు
  3. కీలము అంటారు
  4. అండకోశం అంటారు

05) సాధారణంగా సౌష్టవత అనేది ఈ పత్రాలలో కనిపించేందుకు అవకాశం ఉంటుంది.

  1. మృదు పత్రాలు
  2. దారు పత్రాలు
  3. జాలాకార ఈనెలు గల పత్రాలు
  4. లంబాకారపు ఈనెలు గల పత్రాలు

06) రంగునీళ్లలో ఉంచిన కాండంలోకి రంగు చేరడానికి కారణం ఏమిటి?

  1. మొక్క యొక్క వేర్లు నీటిని సరఫరా చేయడంలో సహకరిస్తాయి
  2. మొక్క యొక్క కాండం నీటిని సరఫరా చేయడంలో సహకరిస్తాయి
  3. మొక్క యొక్క ఆకులు నీటిని సరఫరా చేయడంలో సహకరిస్తాయి
  4. మొక్క యొక్క పుష్పాలు నీటిని సరఫరా చేయడంలో సహకరిస్తాయి.

07) పారదర్శకపు పాలిథీన్ సంచి, ఆరోగ్యకరమైన మొక్కలను ఉపయోగించి దీన్ని నిరూపించవచ్చు.

  1. మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తాయి
  2. మొక్కలు ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి
  3. మొక్కలు నీటి ఆవిరిని విడుదల చేస్తాయి
  4. మొక్కలు ఖనిజ లవణాలను గ్రహిస్తాయి

08) వేర్లను కత్తిరించిన మొక్క సాధారణంగా ఆహారాన్ని కిరణజన్య సంయోగ ప్రక్రియలో తయారుచేసుకోలేకపోవడానికి కారణము

  1. పత్రాలు కార్బన్ డై ఆక్సైడ్ ను స్వీకరించలేకపోవడం
  2. కాండం లోనికి ఆక్సిజన్ వాయువు చేరకపోవడం
  3. పత్రాలు ఆక్సిజన్ వాయువును స్వీకరించలేకపోవడం
  4. కాండం లోనికి ఖనిజలవణాలు, నీరు చేరకపోవడం

09) మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచడంలో సహకరించేవి.

  1. కాండం
  2. వేర్లు
  3. ఫలాలు
  4. ఆకులు

10) క్రింది వాక్యాలను పరిశీలించండి 

ఎ) అన్ని మొక్కలకూ ఆకులు ఉంటాయి

బి) అన్ని మొక్కలకూ కాండం ఉంటుంది

  1. ఎ సరికావచ్చు కాకపోవచ్చు కానీ బి మాత్రం సరియైనది
  2. బి సరికావచ్చూ కాకపోవచ్చు కానీ ఎ సరియైనది
  3. ఎ, బి వాక్యాలు రెండూ సర్వ సత్యాలు
  4. ఎ, బి వాక్యాలు రెండూ సర్వ అసత్యాలు

సమాధానాలు : 1-1: 2-2: 3-3: 4-4: 5-3: 6-2; 7-3: 8-4: 9-2: 10-1

Read also..

DSC 6th Class General Science Components of food Practice bits

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!