DSC 6th Class Science FUN WITH MAGNETS Practice Bits
6వ తరగతి సామాన్య శాస్త్రం “అయస్కాంతంతో సరదాలు” ప్రాక్టీస్ బిట్స్
6వ తరగతి సైన్స్ పాఠం అయస్కాంతంతో సరదాలు’ అనేది అయస్కాంతాల గురించి తెలుసుకునే ఒక ఆసక్తికరమైన ప్రయాణం. ఈ పాఠంలో విద్యార్థులు అయస్కాంతాలు అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, వాటి రకాలు, ధ్రువాలు, ఆకర్షణ-వికర్షణ ధర్మాలు మరియు అనేక రంగాలలో వాటి ఉపయోగాలు గురించి తెలుసుకుంటారు. ఈ పాఠం విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహిస్తుంది మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. (DSC 6th Class Science FUN WITH MAGNETS Practice Bits)
01) చెత్తను పోగువేయు ప్రదేశం నుండి ఇనుమును వెలికితీయడానికి క్రేన్ చివరగా ఒక
- పెద్ద తాడును అమర్చుతారు
- పెద్ద అయస్కాంతాన్ని అమర్చుతారు
- పెద్ద కాంతి దీపాన్ని అమర్చుతారు
- పెద్ద రసాయన పాత్రను అమర్చుతారు
02) పాఠ్యపుస్తకంలో ఉదహరించిన ‘మాగ్నస్ నడక’లో భాగంగా మాగ్నస్ కర్ర దేనిని తీసుకుని వస్తుంది?
- ఇనుమును
- అయస్కాంత పదార్ధాలను
- అల్యూమినియంను
- అనయస్కాంత పదార్దాలను
03) భోజో అడిగిన ప్రశ్న – అయస్కాంతాన్నికి దగ్గరగా దిక్సూచిని తీసుకుని వచ్చినపుడు ఏమవుతుంది?
- దిక్సూచిలోని ముల్లు నిరయస్కాంతీకరణానికి గురి అవుతుంది
- దిక్సూచిలోని ముల్లు అపవర్తనాలకు, విచలనాలకు లోనవుతుంది
- దిక్సూచిలోని ముల్లు మరింత శ్రద్ధగా దిశలను చూపగలుగుతుంది
- దిక్సూచిలోని ముల్లు విరిగిపోతుంది
04) పిన్ హోల్డర్ మూత వద్ద గుండు పిన్నులు అతుక్కుని ఉండటానికి ప్రధాన కారణం
- అక్కడ ఏర్పాటు చేసిన జిగురు వంటి పదార్ధం
- అక్కడ ఏర్పాటు చేసిన మైనం వంటి పదార్ధం
- అక్కడ ఏర్పాటు చేసిన అయస్కాంతం
- అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప గుండు
05) ఒక ప్లాస్టిక్ కాగితం కప్, స్టాండ్, దారం, పేపర్ క్లిప్ తోపాటు మరొక వస్తువులను ఉపయోగించి, పేపర్ క్లిప్ ను గాలిలో నిలిచేలా చేయడానికి ఈ శక్తి సహకరిస్తుంది
- విద్యుత్ శక్తి
- కాంతి శక్తి
- చలన శక్తి
- అయస్కాంత శక్తి
06) ఈ దేశపు చక్రవర్తి రథంపై ఏ దిశలోనైనా తిరుగగలిగే ఒక స్త్రీ విగ్రహం ఉందని చరిత్ర చెబుతున్నది?
- రష్యా
- చైనా
- గ్రీకు
- జపాన్
07) ఒక గాజు మూత కలిగిన చిన్న పెట్టెలో, ఇరుసుపై అయస్కాంతీకరించిన సూది స్వేచ్ఛగా తిరుగాడేలా అమర్చబడి ఉంటుంది – ఈ వర్ణణ ఏ పరికరానికి సంబంధించినది?
- థర్మామీటరు
- హైడ్రో మీటరు
- మాగ్నటిక్ కంపాస్
- మాగ్నటిక్ లీవర్
08) దండాయస్కాంతం, పురిలేని దారం మరియు స్టాండును తీసుకున్న శశాంక్ ఈ అయస్కాంతపు ధర్మాన్ని ప్రదర్శించబోతున్నాడు
- అయస్కాంత ధృవాల సిద్ధాంతం
- అయస్కాంతం యొక్క ఆకర్షణ స్వభావం
- అయస్కాంతం యొక్క దిశా ధర్మం
- అయస్కాంతం యొక్క విలుప్తీకరణము
09) సొంతంగా తరగతి గదిలో దిక్సూచిని తయారుచేయడానికి క్రింది ఏది అవసరం లేదు?
- చిన్న గిన్నెలో నీరు
- మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం
- చిన్నపాటి కార్క్ లేదా ఫోమ్ ముక్క
- అయస్కాంతీకరించిన గుండుసూది
10) మాగ్నైటైట్ లేదా ఆకర్షించే స్వభావం గల రాయి ముఖ్యంగా ఈ లోహమును కలిగి ఉంటుంది.
- ఇనుము
- నికెల్
- క్రోమియం
- మాంగనీస్
సమాధానాలు : 1-2: 2-2: 3-2: 4-3: 5-4: 6-2; 7-3: 8-3: 9-2: 10-1
Read also…