DSC 6th Class Science ELECTRICITY AND CIRCUITS Practice Bits

DSC 6th Class Science ELECTRICITY AND CIRCUITS Practice Bits

6వ తరగతి సామాన్య శాస్త్రం “విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు” ప్రాక్టీస్ బిట్స్

6వ తరగతి సైన్స్ పాఠం ‘విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు’ విద్యుత్తు అంటే ఏమిటి, అది ఎలా ప్రవహిస్తుంది మరియు దానిని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకునే ఒక ఆసక్తికరమైన ప్రయాణం. ఈ పాఠంలో విద్యార్థులు విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్తు ప్రవాహానికి కావలసిన అంశాలు (విద్యుత్ జనరేటర్, వాహకాలు, విద్యుత్ బల్బు), విద్యుత్ వలయాలు (ఓపెన్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్), విద్యుత్ ప్రమాదాలు మరియు జాగ్రత్తలు, విద్యుత్తు యొక్క ఉపయోగాలు వంటి అంశాలను తెలుసుకుంటారు. ఈ పాఠం విద్యార్థులలో శాస్త్రీయ అవగాహనను పెంపొందిస్తుంది మరియు వారి దైనందిన జీవితంలో విద్యుత్తు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. (DSC 6th Class Science ELECTRICITY AND CIRCUITS Practice Bits)

01) మనం విద్యుత్ ను ఎందుకు ఉపయోగిస్తున్నాము?

ఎ) బావుల నుండి ఇంటి పైన ట్యాంకులోనికి నీటిని పంపుటకు విద్యుత్ ను ఉపయోగిస్తున్నాము.

బి) వెలుతురు కోసం గృహాలలో, కార్యాలయాలలో విద్యుత్ ను వినియోగిస్తున్నాము

సరియైన సమాధానం గుర్తించండి

  1. ఎ సరియైనది, బి సరికానిది
  2. ఎ సరియైనది, బి సరియైనది
  3. ఎ సరికానిది, బి సరికానిది
  4. ఎ సరికానిది, బి సరియైనది

02) పుర్రె మరియు ఎముకలతో కూడిన గుర్తు విద్యుత్ పరికరాలపై ఉండటానికి కారణం

  1. ఆయా పరికరాల తయారీలో ఎముకలలో లభించే ఫాస్పరస్ ను వినియోగించారని సూచన
  2. ఆయా విద్యుత్ పరికరాలు ప్రమాదంతో కూడినవి కనుక జాగ్రత్త వహించాలని సూచన
  3. ఆయా విద్యుత్ పరికరాలను నీటిలో తడవనివ్వరాదని, పాడవుతాయని సూచన
  4. ఆయా విద్యుత్ పరికరాల తయారీలో ఉపయోగించిన రసాయనాలు తాకడానికి అనువైనవి కాదని సూచన

03) విద్యుత్ వాహకత దృష్ట్యా క్రింది వానిలో ఏది భిన్నమైనది?

  1. చేతి గాజు
  2. అగ్నిపుల్ల
  3. ఇనుప మేకు
  4. ప్లాస్టిక్ స్కేలు

04) విద్యుత్ బల్బులో కాంతినిచ్చే భాగము ఏది అనే విషయంపై శ్రీనివాస్ కు సందేహం కలిగినది. అతనికి మీరు ఇవ్వదగిన సరియైన సమాధానం క్రింది వానిలో ఏది?

  1. విద్యుత్ బల్బులో, ఘటము అనేది కాంతిని ఇచ్చే భాగము
  2. విద్యుత్ బల్బులో, ధృవాలు అనేవి కాంతిని ఇచ్చే భాగాలు
  3. విద్యుత్ బల్బులో, రసాయనాలు అనేవి కాంతిని ఇచ్చే భాగాలు
  4. విద్యుత్ బల్బులో, ఫిలమెంట్ అనేది కాంతిని ఇచ్చే భాగం

05) ఎలక్ట్రీషియన్లు టేపును ఉపయోగించి విద్యుత్ తీగలను కలిపి ఉంచడానికి ప్రధాన కారణం

  1. షాక్ తగలకుండా
  2. విద్యుత్ వినియోగించబడకుండా
  3. విద్యుత్ బయటకు పోకుండా
  4. షార్ట్ సర్క్యూట్ కాకుండా

06) క్రింది వానిలో ఏది విద్యుత్ స్విచ్ తయారీలో ఉపయోగించే పరికరాల జాబితాలో భాగం కాదు?

  1. రెండు డ్రాయింగ్ పిన్నులు
  2. సేఫ్టీ పిన్ లేదా పేపర్ క్లిప్
  3. థర్మోకోల్ షీట్ లేదా చెక్క బోర్డు
  4. మెలితిరిగిన చిన్నపాటి స్ప్రింగ్

07) విద్యుత్ ఉపకరణాలతో పనిచేస్తున్న సమయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కారణం

  1. విద్యుత్ వల్ల గుండె స్పందించే లక్షణాన్ని కలిగి ఉంటుంది.
  2. విద్యుత్ ఆకర్షణ వల్ల రక్త సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది
  3. మానవ శరీరం ఒక మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది
  4. మానవ శరీరంలోని పలు అవయవాలు విద్యుత్ కు స్పందిస్తుంటాయి

08) క్రింది వానిలో ఏది(వి) టార్చిలైటులోని భాగములు

ఎ) బల్బు, పరావర్తకాలు

బి) ప్లాస్టిక్/ రక్షణ కవచం

సి) కదిలే స్విచ్

డి) విద్యుత్ ఘటాలు

సరియైన సమాధానం గుర్తించండి

  1. ఎ, బి, సి సరియైనవి, డి సరికానిది
  2. ఎ, బి, డి సరియైనవి, సి సరికానిది
  3. ఎ, సి, డి సరియైనవి, బి సరికానిది
  4. ఎ, బి, సి, డి సరియైనవి

09) సాధారణంగా

ఎ) సబ్ స్టేషన్ నుంచి వచ్చే విద్యుత్ ప్రమాదకరమైనది

బి) పోర్టబుల్ జనరేటర్ ద్వారా వచ్చే విద్యుత్ ప్రమాదకరమైనది

సరియైన సమాధానం గుర్తించండి

  1. ఎ సరియైనది, బి సరికానిది
  2. ఎ సరియైనది, బి సరియైనది
  3. ఎ సరికానిది, బి సరికానిది
  4. ఎ సరికానిది, బి సరియైనది

10) విద్యుత్ ఘటం యొక్క రెండు కొనలను విద్యుత్ ఉపకరణాలైన స్విచ్, బల్బు వంటివి లేకుండా కలుపరాదు. ఒకవేళ అలా చేసినట్లయితే

  1. విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది
  2. రసాయనాలు త్వరగా వినియోగించబడతాయి
  3. విద్యుత్ శక్తి కాంతి శక్తిగా మార్చబడతుంది
  4. విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మార్చబడుతుంది

సమాధానాలు : 1-2: 2-2: 3-3: 4-4: 5-1: 6-4; 7-3: 8-4: 9-2: 10-2

Read also…

DSC 6th Class Science LIGHT, SHANDOWS AND REFLECTIONS practice bits

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!